తెలంగాణావాదులు, తాగుబోతులు మరియు తె"మిలిటెంట్లు
Posted by జీడిపప్పు
ఇవన్నీ చూస్తుంటే సాటి తెలుగువాడిగా "పాపం అమాయకులయిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారే" అన్న బాధ వేస్తుంది కానీ, "తెలంగాణా రజకుల సమ్మె, గుడి మూసి క్రికెట్ ఆడుకుంటున్న పూజారులు, అధికారుల వాహనాలను నడపడానికి డ్రైవర్ల నిరాకరణ, 48 గంటల ఆటోల బంద్, సెలూన్ షాపుల బంద్, మొరాయించిన పేపర్ బాయ్స్" లాంటి వార్తలు చూసి "ఓహో, తెలంగాణా సామాన్య జనం ఇలా ఆలోచిస్తున్నారన్నమాట, అయితే వీరికి కేసీయారే సరి అయిన రింగు మాష్టరు" అనిపిస్తుంది. ఇక్కడ ఒక వింతేమిటంటే "తెలంగాణా కోసం ప్రాణాలు అర్పిస్తాము" అంటూ సమ్మెలో పాల్గొన్న వారు నెలాఖరు వచ్చేసరికి "మా జీతాలు మాకివ్వండి, మా బోనసులెక్కడ" అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలంగాణాకోసం ఒక నెల జీతాన్ని వదులుకోలేరా వీళ్ళు? 'మాకు విద్యుత్ కోత విధించకండి ' అని కూడా అంటున్నారు. ఇదెక్కడి చోద్యం? తెలంగాణా ప్రాంతీయులే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిరాకరించారు కాబట్టి తెలంగాణాలో పూర్థిస్థాయి కరెంటు కోత విధించి (హైదరాబాదు తక్క) బయటినుండి తెసుకువచ్చే విద్యుత్‌ను సీమాంధ్ర ప్రాంతానికే ఇవ్వాలి అని నా అభిప్రాయం. అఫ్‌కోర్స్, తెలంగాణాకోసం ప్రాణాలయినా అర్పించే వారికి కరెంటు కోత, పంట నష్టం, విద్యాసంవత్సరం నష్టపోవడం లెక్కలోకి రాదనుకుంటా.
*****************
సీమాంధ్రులతో పోలిస్తే తెలంగాణా ప్రాంత వాసులు కష్టపడి పని చేయరు, తిని తాగి తొంగుంటారు అంటుంటారు గిట్టనివాళ్ళు. ఇది ఎంతవరకు నిజమో ఆ ప్రాంతాల గురించి అవగాహన ఉన్నవారికి బాగా తెలుసు. ఇక మొన్న దసరా పండగ సమయంలో తెలంగాణాలో మద్యం షాపులు బంద్ అన్నారు. 'తెలంగాణాకోసం ఐదారు లక్షలమంది ప్రాణాలర్పించారు కదా, ఈ సమయంలో ఈ మద్యం బంద్ గురించి ఎవరు పట్టించుకుంటారు ' అనుకున్నాను కానీ కొందరు మందు ప్రియులు టీవీల్లో "మద్యం లేకుండా పండగ చేసుకోవడం ఎలా" అని కన్నీళ్ళు పెట్టుకుంటే "సిసలయిన తెలంగాణావాది ఈ ఉద్యమ సమయంలో మద్యం ముట్టకూడదు అని తెలంగాణా మిలిటెంట్ నాయకుడు కోదండరాం హుకుం జారీ చేసాడు కదా, మరి వీళ్ళు ఇలా మందుకోసం ఏడుస్తున్నారంటే తెలంగాణావాదులే కాదు. ఈ ఉద్యమ సమయంలో మిలిటెంట్ నాయకుడి ఆదేశాలమేరకు తెలంగాణాలో ఎవరూ ఒక్కరూపాయికి కూడా మద్యం కొనరు" అని మళ్ళీ అనుకున్నా.
మూడ్రోజుల తర్వాత వచ్చిన గణాంకాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాయి. రాష్ట్రం మొత్తం సుమారు 125 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే అందులో తెలంగాణా ప్రాంతం లో సుమారు 110 కోట్ల అమ్మకాలు జరిగాయట. విజయవాడనుండి పదుల లారీల్లో స్టాకు తెప్పించి డబల్ రేటుకు మందుబాబులకు అమ్మారు. కోదండరాం పుణ్యమా అని సీమాంధ్ర మద్యం వ్యాపారులు కోట్లు సంపాదించారు. కేవలం ఈ వార్త ఆధారంగా తెలంగాణావాసులు మద్యం ప్రియులు అని అభాండం వేయడం సరికాదు అని నా అభిప్రాయం. ప్రత్యేక తెలంగాణా ఏర్పడకపోవడం చూసి ఆ బాధ మర్చిపోవడానికే తెలంగాణావాదులు మద్యం బాట పట్టారా, లేక తెలంగాణావాసులు ఈ స్థాయిలో మద్యానికి అలవాటుపడడం వెనుక కావూరి, లగడపాటిల కుట్ర ఏమయినా ఉందా అని కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
*****************
గత కొద్ది రోజులుగా తెలబాన్ల దుర్మార్గాలు మిన్నంటుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతమునుండి వస్తున్న బస్సులను సరిహద్దుల్లో ఆపివేయడం, వెళ్తున్నబస్సుల పైన రాళ్ళు రువ్వి అందులో స్త్రీలు, వృద్దులు, చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక తెలంగాణా తీవ్రవాది చేష్టలను చూసిన వీడి తల్లి, వీడి తండ్రులు ఎంత గర్వపడతారో అనిపిస్తుంది. ఎంతయినా కోదండరాం నేతృత్వంలో ఉద్యమం చేస్తున్నారు కదా.. ఆ మాత్రం ఉన్మాద చర్యలు లేకుంటే ఎలా? గాంధీ వారసులయిన తెలంగాణావాదులు అహింసాయుతంగా చేస్తున్న పోరాటంలో కోదండరాం వంటి రాక్షసాంశ కలిగినవాడు ప్రవేశించడం చాలా బాధాకరం. ఆ మధ్యనే వీడు 'తెలంగాణాలో మిలిటెంట్లను తయారు చేస్తా" అన్నాడు. వీడు చెప్పినట్లే చేస్తూ ఉన్మాదులు తయారవుతున్నారు.
ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన వీడి మాటలకు ఎదురు చెప్పకుండా మిగతా పార్టీల నాయకులు గంగిరెద్దుల్లా తలలూపడం చూస్తుంటే వీళ్ళకు కనీస ఇంగితం, సిగ్గూ ఉందా అన్న అనుమానం కలుగుతుది. వీడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏకపక్షమే, అందరూ శిరసావహించవలసిందే. లేదంటే తెలంగాణా తీవ్రవాదులను, మిలిటెంట్లను ఉసిగొల్పుతాడు! ఇన్నాళ్ళు వీడి చేష్టలు చూసినపుడు కోపం వచ్చినా మొన్న టీవీలో " రైల్ రోకోను 9,10,11 తేదీల్లో కాకుండా 12,13,14 తేదీలకు వాయిదా వేస్తున్నాము. ప్రయాణీకులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోండి" అంటూ లార్డ్ లా వీడు చెప్తుంతుంటే అర్జంటుగా వీడికి దండెయ్యాలనిపించింది. ఎవరినడిగి వీడు ఈ రైల్‌రోకో నిర్ణయించాడు? ఎవరితో చర్చించి వాయిదా వేస్తున్నాడు? రైళ్ళను నడపాలావద్దా అన్నది వీడి అంకుల్స్ చేతిలో ఉందా?
(తెలంగాణావాదులను "తీవ్రవాది" అని, కోదండరాంను "వాడు, వీడు" అనడం గమనించి ఉంటారు. వీడు ఒక ప్రొఫెసరు కాబట్టి మునుపెన్నడూ ఇలా బహిరంగంగా "వీడు" అనలేదు. నిజానికి వీడు చేస్తున్న పనులకు అలా అనడంలో తప్పేమి లేదు. ఆ మధ్యన Ntv లో కొమ్మినేని శ్రీనివాసరావు రోజువారీ జనాలను రెచ్చగొట్టే పిచ్చాపాటి తెలంగాణా చర్చలో ఎమ్మెల్యే అల్లం రాజయ్య (??) ను "అదేంటండి, నిన్న కేసీఆర్ ఎంపీ అయిన కావూరి సాంబశివరావు ను పట్టుకొని 'వీడొక దళారి. వాడి అంతు తేలుస్తాము, నాలుకలు చీరేస్తాం అన్నాడు" అంటే సదరు తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యే గారు "వాడు, వీడు అనడం తెలంగాణా సంస్కృతిలో భాగం. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. నాలుక చీరేస్తాం అంటే 'దయచేసి మా బాధ అర్థం చేసుకోండ'ని భావం. మీరు ప్రతిదానికీ పెడర్థాలు తీయకూడదు." అన్నాడు. కాబట్టి తెలంగాణా సంస్కృతిని గౌరవినడానికే కోదండరాంను "వీడు" అనవలసివచ్చింది. అలాగే "తెలంగాణా తీవ్రవాది" అంటే 'తెలంగాణా కావాలని తీవ్రంగా వాదించేవాడు" అని అర్థం. ఇక్కడ భాష ముఖ్యం కాదు, భావమే ప్రధానం కదా!)
ఇప్పటివరకు ఉద్యోగులను ఉద్యమంలోకి లాగి వారికి ఒక దారి చూపించకుండా అయోమయానికి గురిచేసిన కోదండరాం కన్ను ఉన్నట్టుండి ఎందుకో హైదరాబాదులోని విద్యాసంస్థల పైన పడింది. మొన్నపనిగట్టుకొని మరీ "హైదరాబాదులోని అన్ని విద్యా సంస్థలూ మూసివేసి సమ్మెలో పాల్గొనాలి" అని చెప్పుకొచ్చాడు. 1969లో తెలంగాణా ఉద్యమం వల్ల విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారట. అప్పుడు ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ ప్రోత్సహించి ఊరికే మార్కులు వేసారట. అలా మొదలయిన పతనం పది పదిహేనేళ్ళు కొనసాగి మళ్ళీ గాడిలోకి వచ్చింది. ఈలోపు చాలామంది పక్కదారులు పట్టారని తెలంగాణా విద్యావేత్త అయిన కంచె ఐలయ్య "చదువుకు సమ్మె వద్దు" అన్నవ్యాసంలో వ్రాశాడు. ఇది తెలిసి కూడా కోదండరాం "చదువులొద్దు" అనడం వెనుక మతలబేమిటో? హైదరాబాదులోని విద్యాసంస్థలు తాను అడిగిన కమీషన్ ఇవ్వలేదని అక్కసా లేక విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి తన ఉన్మాద చర్యల్లో పావులుగా వాడుకోవడానికి వేస్తున్న ఎత్తుగడా?
October 9, 2011 at 7:49 AM
తొక్కలోది భాషదేముంది వందలకొద్దీ వున్నయ్. మనకు భావమే ముఖ్యము. వాడిని (కోదండరాముని) వాడిభావములోనే ఇకమీదట గౌరవించెదము. ఆమెన్.
నిజానికిందులో ఇంతకన్నా గౌరవించవలసినది మన ఘనత వహించిన ప్రభుత్వాన్ని ఇచ్చేదీ లేనిదీ కూడా చెప్పడానికి ధైర్యంలేక పైనుంచి "సంకేతాలు" మాత్రమే వెలువరించుతున్న దద్దమ్మలను. వాళ్ళచేతాళంగురించి కూడా ఒక పోస్టేసుకుందురూ. అన్నట్టు ఈ మధ్య కర్ణాటకక్కూడా ఈ సమ్మె ప్రభావం విద్యుత్ రూపేణా తగులుతున్నట్లుంది.
October 9, 2011 at 7:57 AM
తెలంగాణా నిధులను, నీళ్ళను, ఉద్యోగాలను సమైక్యతా పేరిట కొల్లగొట్టింది చాలక ఇప్పుడు ఆంద్ర చాల్బాజీ గాళ్ళకు తెలంగాణాను నిందించడం, తెలంగాణా ప్రజల మీద విషం కక్కడం ... ఒక ఉన్మాదం స్థాయికి చేరింది.
ఈ సమైక్య వాద గోముఖ వ్యఘ్రాల భాష , శాడిజం , ర్యాగింగు శ్రుతిమించుతోంది.
ఒక పక్క తెలంగాణాను తెలంగాణా ఉద్యమాన్ని ఆడిపోసుకుంటూ ఇంకా తెలంగాణాను తమ పెత్తనం కింద తోక్కిపెట్టాలనుకోవడం ఈ దగుల్భాజీలకే చెల్లింది.
నాలుకలు చీరేస్తాం అని గంగా భావాన్ని అన్నప్పుడు సమ్మగా అనిపిస్తుంది.
తెలంగాణా వాళ్ళు అనగానే సంస్కృతీ గుర్తుకొస్తుంది.
డిసెంబర్ ప్రకటన వెలువడ్డ తర్వాత ఈ ఆంధ్ర సంస్కృతీ సంస్కార ఆదర్శ వాదులు ఎన్ని ప్రభుత్వ ఆస్తులు కాల్చి బూడిద చేసారో, ఎంతమంది
ఆటో రిక్షా కార్మికుల మీద, తోపుడు బల్ల, చిన్న వ్యాపారుల మీద ఎంత వీరంగం విధ్వంసం సృష్టించారో అప్పుడే మరచిపోయారా
ఎందుకీ దిక్కుమాలిన రాతలు ... ఎందుకీ ఆత్మ వంచన ...
మదిశన్నాక ఒక నీతీ జాతీ వుండాలి
October 9, 2011 at 9:54 AM
జీడిపప్పు గారు... అద్భుతంగా రాసారండి... నా మనసులో ప్రతీ అక్షరం పొల్లుపోకుండా మీ టపాలో వుంది. ముందు కే.సీ.ఆర్ గాడిని, కోదండరాం గాడినీ బొంద పెడితే గాని రాష్ట్రం బాగుపడదు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వారికి పట్టదు. అక్కడి ప్రజల్ని వేపుకు తింటున్నారు. అక్కడి ప్రజలు కూడా వీడు చెప్పిందల్లా వింటున్నారు. అదే విచిత్రం.
October 9, 2011 at 10:42 AM
గొర్రెలు కసాయినే నమ్ముతాయి
October 9, 2011 at 10:44 AM
/"మా జీతాలు మాకివ్వండి, మా బోనసులెక్కడ" అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలంగాణాకోసం ఒక నెల జీతాన్ని వదులుకోలేరా వీళ్ళు? 'మాకు విద్యుత్ కోత విధించకండి ' అని కూడా అంటున్నారు. ఇదెక్కడి చోద్యం?/
హ్వా హ్వా హ్వా అంతే కాదు "అవసరమైతే మరోమారు ఆమరణ దీచ్చకు సిద్ధం" అని ముక్కోడు అనడం, ఒక్కటి కాదు ఎన్నైనా చేస్తం అని కోదండం లాంటి ఎదవలు డప్పుకొట్టడం ఈ ఉజ్జమంలో హైలైట్. "జీతాలకు వెంపర్లాడకండి, తెలంగాన వచ్చాక అందరికీ సంవత్సరం బోనస్ అదనంగా ఇస్తాము" అన్నా ఈ వెంపర్లాడటం, అడుక్కోవడం ఆగలేదు. :))
ఆరోగ్యం సహరించదు కాబట్టి దీచ్చ చేయడట, "కావాలంటే తలలు నరుక్కుంటాడట" ఎన్ని సార్లైనా. :)) అదండి, ఉజ్జమం. వీళ్ళ బ్రతుకు చెడా, పోలీసులే వీళ్ళ వుజ్జమాలకి తగు న్యాయం చేయగలరు.
October 9, 2011 at 10:55 AM
nizalu nippu lantivi. andaroo mansullo anukune maatale ivi
October 9, 2011 at 1:03 PM
సూపర్బ్. మాటలు రావడంలేదు మీ పోస్టును పొగడటానికి. నాలాంటివాళ్ళకు ఇలా రాయాలని ఉన్నా తెలబాన్ల దాడులు ఎదుర్కోవలసివస్తుందని మిన్నకుంటున్నాం. మీరు ధైర్యంగా రాశారు. Hats off.
మీరన్నట్లు కంచె ఐలయ్య - చదువుకు బంద్ వద్దు, మద్యానికి బంద్ పెట్టండి అని మొన్న ఓ ఛానల్ లో విజ్ఞప్తి చేశారు.. అలా డెమోక్రటిక్ గా మాట్లాడేవాళ్ళ మాటలను ఈ పిచ్చి తెలబాన్లు ఎందుకు పట్టించుకుంటారు!
October 9, 2011 at 4:16 PM
మందు బందా?
ఎక్కడండీ? పనుండి కూకట్ పల్లి వైపు వెళ్తే మూసాపేటలో సీరియల్ బల్బుల దండలు వెలిగించి మరీ అమ్మారు. విజయదశమినాడు సాయంత్రం మూసాపేట వై జంక్షన్(మెట్రోకి ఇవతల) దగ్గర ఉన్న వైన్ షాపు ముందు ఐదారొందల మంది కొట్టుకు చస్తున్నారు.
October 9, 2011 at 10:38 PM
/తెలంగాణా విద్యావేత్త అయిన కంచె ఐలయ్య "చదువుకు సమ్మె వద్దు" అన్నవ్యాసంలో వ్రాశాడు./
:)) అదేంటి! 'సారాలేకపోతే నేను వుజ్జమకారుడిని ఎట్లయిత' అని రాసి వుండాల్సిందే! ఆ మేతావి. మద్యం బంద్ చేస్తే 'సకలజనుల సమ్మె' కుప్పకూలిపోదూ?!
October 10, 2011 at 1:56 AM
meerandaru ippudu jarugutunna vatiki answers chebutunnaru kani...jarigia anyayanni...evaru cheppatam ledu...endukante meerevvaru nashtapoledu kabatti.....nenu nallagonda vadini...maku chala nashtam jarigindi..adevidanga chala mandiki chalavidaluga nashtam jarigingi..sorry nashtam anoddu..anyayam jarigindi...
inka rechagodite chala godavalu jarugutai...vedipovadam anta pedda vishayam em kadu.....meeru telangana vallu telangana vachinakuda kalisivundalane vundi...merandaru ila matladite...aslu inkkada andhravadu vunnadate tattukoleni paristiti vastundi...chalamandi inka ikkada kalisevunnaru...andarilo oka division vachesindi...ippati gurinchi alochinchakunda...long run lo alochinchandi...anavasaranga rechakottaddu...
October 10, 2011 at 1:23 PM
first telangana history chadivi raste baguntundi ekada vudyamam kosam 660 mandi bali dhanalu cheste , samakyandra kosam okadu kuda chanipoyada . telangana lo prajalu vundyamani naduputunaru . Ade andhra lo mee kullu rajakiya Netalu money petti valla swardham to e 3 or 4 member ni kurcho betti samaikyandra antu overbildup isthunaru. Edaina rase mundu nee ku rase Arhatha Vundo ledo alochinchu kovali JIIdi .
Telangana lo 4 Kotla mandi vundyam lo palgontunaru adi gurtu petukoni raste baguntundi .Jai Telangana
October 10, 2011 at 10:09 PM
అనానిమస్సయ్య/Sunil - మీ కామెంట్లను అచ్చ తెలుగు లిపిలో వ్రాస్తే సులభంగా చదువుకోవచ్చు.. ఈ తెంగ్లీషు కామెంట్లు చదవడం కాస్తంత ఇబ్బందిగా ఉంది.