ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ Status Report - Aug 09

Posted by జీడిపప్పు

ఆగస్టు నెలలో జేపీ గారు కనిపించినన్ని ఎక్కువ సార్లు మరే నాయకుడూ టీవీల్లో కనిపించలేదు. ఎన్నో విషయాల పైన సుదీర్ఘ చర్చలు, సందేశాలు ఇచ్చారు. మొన్నటికి మొన్న రాజ్యాంగానికి అవమానం జరుగుతున్నదని అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నారు. అసలు విషయమయిన "ప్రజాసేవ" గురించి చెప్పాలంటే - గత నెల మొత్తం పైన కూకట్‌పల్లిలో ఎన్ని ప్రజాసమస్యలు పరిష్కరించారు, ఎన్ని అభివృద్ది పనులు చేపట్టారు, జేపీ గారి వల్ల ఎందరు పేద ప్రజలు లబ్ది పొందారు మొదలయిన వివరాలు దాదాపు ఎక్కడా కనిపించలేదు. లోక్‌సత్తా వెబ్‌సైటులో జేపీ గారు ఏ రోజు ఏమి ప్రజాసేవ చేసారో వివరాలు తెలపడం లేదు. ఇదేమయినా మీడియా కుట్రా? బ్లాగులోకంలోని జేపీ గారి అభిమానులయినా చొరవ తీసుకుని వివరాలను నలుగురికి చెప్పే ప్రయత్నం చేయాలి.

ఇక Status Report సంగతికొస్తే - 31 రోజులున్న గత నెలలో శెలవు రోజులు పక్కన పెడితే రోజుకొక్క task చొప్పున చేసినా కనీసం 25 tasks ఉండాలి. తెలిసిన వివరాల ప్రకారం గత నెల స్టేటస్ రిపోర్ట్:

సంగ్రహం
ప్రజలనుండి స్వీకరించిన మొత్తం సమస్యలు: 0
పరిష్కరించిన సమస్యలు: 0
పురోగతిలో ఉన్న సమస్యలు: 0
మిగిలినవి: 0

వివరాలు
వైద్యరంగం
1) తనిఖీ చేసిన ఆస్పత్రులు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0

విద్యారంగం
1) తనిఖీ చేసిన పాఠశాలలు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0

ఇతరములు
1) పర్యటించిన మురికివాడలు: 0
2) పరిష్కరించిన మంచి నీటి సమస్యలు: 0
3) తనిఖీ చేసిన చౌక దుకాణాలు: 0
4) తనిఖీ చేసిన ప్రభుత్వ కార్యాలయాలు: 0
5) అవినీతి అధికారుల పైన తీసుకున్న చర్యలు: 0
6) అవినీతిని నిరోధించుటకు చేసిన ప్రయత్నాలు: 0

పత్రికలు చేయలేని పనిని బాధ్యతగల పౌరులుగా మనము చేసి ప్రతినెలా మొదటివారంలో గతనెల జేపీగారు చేసిన పనుల వివరాలను ఈ స్టేటస్ రిపోర్ట్ రూపంలో తెలుసుకుంటూ అందరికీ తెలియజేద్దాము.

13 comments:

  1. Malakpet Rowdy said...

    Excellent one to start with.

  2. asha said...

    http://news.loksatta.org/2009/08/lets-eradicate-corruption.html

    ఇది మిమ్మల్ని పెద్దగా సంతృప్తి పరచకపోవచ్చు.

  3. Rajesh said...

    haha ... good one ...

  4. Krishna K said...

    భవాని గారి సంతృప్తి కోసం, అధికారులతో సమీక్షలు (అందరి MLA ల వలనే, end results పెద్దగా ఏమీ లేకుండా) అని ఓ column పెట్టి ఓ సారి (1) అని వేయండి.

    ఆయనకు ఒక్క MLA number తో front seat కాంగ్రెస్స్ ఇచ్చినప్పుడే అర్ధమయ్యింది, ఆయనను కాంగ్రెస్స్ ఆత్మబంధువు గా బావిస్తిందో లేదో నని. పొద్దున్నే దేముడుతో బాటు చిరు కు, ముఖ్యం గా JP కి దండం పెట్టుకొంటున్నం అని బెజవాడ కు చెందిన ఓ కాంగీ నాయకుడు సరదా గా మొన్నీ మధ్య మాతో అన్నా, front seat దానిని confirm మాత్రం చేసింది.

    జాగ్రత్త, మన కూడలి లో JP గారి భక్తులకు (నేనూ ఒక్కప్పుడు ఆయన ఫంకానే, ముఖ్యం గా పెకాశం జిల్లా వాడిగా) తక్కువేమీ లేదు, వాళ్లు offend అయిపోగలరు మరి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్స్ వాళ్లు ఆయన మీద ఈగను కూడ వాలనీయరు.

  5. పునర్వసు said...

    జీడిపప్పు గారూ, మీ ప్రయత్నం అభినందనీయం. నా దొక మనవి. అందరు M.L.A లపైనా యిలాంటి నివేదికలను ప్రచురించ గలిగితే, ప్రజాసేవ చేస్తున్న నిజమైన నాయకులెవరో, ప్రజల డబ్బు తింటూ స్వంత సేవ చేసుకునే వారెవరో అందరికి తెలుస్తుంది. బ్లాగరులందరూ దీనికి అవసరమైన సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్థన.

  6. కొండముది సాయికిరణ్ కుమార్ said...

    నేనిదివరకే చెప్పానండి. శతకోటి లింగాల్లో ఈయనా ఓ బోడిలింగమేనని. తేడా అల్లా, మిగతావారు ప్రజా సమస్యలపైన మాట్లాడరు. ఈయన కనీసం మాట్లాడతారు. అంతే, ప్రజలకు ఒరిగేది, ఒరుగుతున్నదీ ఏమీ ఉండదు.

  7. చదువరి said...

    మీరిలా దీన్నో సీరీసులాగా రాస్తారని తెలిస్తే కాసిని కూసిని లింకులు పోగుచేసి ఉండేవాణ్ణేనే! :)

    కానీ ఇక్కడ మీరు చేస్తున్న ఉద్దేశం ఏమైనప్పటికీ, చేస్తున్న పని మాత్రం మంచిదే! ఇలాగ అందరు నాయకులకూ చెయ్యగలిగితే ఎంత బాంగుంటుందో! అంటే ఒక్కరో ఇద్దరో చెయ్యలేరు, కనీసం ఓ పది ఇరవైమంది చేరితే తప్ప సాధ్యపడదు.

  8. Hima bindu said...

    అసెంబ్లీ లో ఈ మద్య జరిగిన సమావేశంలో ఎక్కువ సేపు మాట్లాడిన నాయకులలో వీరు వున్నారు ..సుమారు మూడు గంటల నలభయ్యి నిముషాలు మాట్లాడినట్లు రికార్డు అయ్యింది అనుకుంటాను ....మరి చేసిన పనులు ...హుమ్మ్.......చూద్దాం .

  9. AB said...

    Good One

  10. చైతన్య said...

    Actually... i was looking for a way to report the problems in and around Kukatpally..to him. But i am not sure how and where to do that!

    I am just wondering if he is also from the same set of polititians, who gets vanished after the elections!

    Could you please tell us if there is some way to approach him to report the issues?

  11. Vasu said...

    అయితే కే పీ లో ఏం చెయ్యట్లేదు అంటారా?? జే పీ గారు తరచూ కాలనీ లో కనిపిస్తున్నారని, సమస్యలు తెలుసుకుని శక్తి మేరకు (ఒక ఎం ఎల్ ఏ కి ఎంత రీచ్ ఉంటుందో తెలియనిది కాదు) పని చేస్తున్నారని కర్ణాకర్ణి విన్నాను. కానీ కొన్ని లోక సత్తా టీమ్స్ (కేపీ, లింగంపల్లి కి సంబందించినవి)చాలా యాక్టివ్ గా పని చేస్తున్నాయని తెలుస్కున్నాను. అలాటి ఒక టీం వివరాలు నవంబర్ వి నా దగ్గర ఉన్నాయి. కావాలంటే ఈమెయిలు చేస్తాను. మీ టపా చూసాక మీరు అడిగిన వాటి గురించి కూడా కనుక్కోవాలని పించింది. సమాచారం తెలిసితే మీకు త్వరలోనే చెప్తాను.

  12. Unknown said...

    నేను కూకట్ పల్లి నివాసిని. ఈనాటికి ఆయన హయాంలో జరిగిన అభివృధ్ధి చూసి లోలోన ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. ఆయన గారి హడావిడి చూసి ఎంతో నమ్మకంతో, ఆలోచనతో కూడిన విచక్షనతో ఓటు వేసిన జ.నా.లలో నేనూ ఒకడిని.

    లోకసత్తా సంస్థ ప్రవక్త దశ నుండి లోకసత్తా పార్టీ తరపున నియోజకవర్గానికి ప్రాతినిత్యం వహించే స్థాయికి వచ్చారని, ప్రవచనాలకి పరిమితి విధించి చేసిన పనుల వివరాలని తెలిపే బాధ్యత ఉందని గ్రహించ మనవి.

    ఆయన గారిని కూకట్ పల్లి నివాసులు ఎన్నుకున్నారని, రాష్త్ర ప్రజలంతా కాదని ఎవరైనా అవకాశం లభించినపుడు తెలియజేయగలరని నా ప్రార్థన.

    రాష్త్ర బాగోగులు చూడటానికి ముఖ్యమంత్రిగారు, ఇతర అమ్మత్యులు ఉన్నారని, తమరు తమ నియోజకవర్గానికి ముందు ప్రాతినిథ్యం వహించమని గుర్తుజేయ మనవి.

    ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడినీ పదే పదే వల్లె వేయమని వేడుకోలు.

    ఇంకనూ, ఈ దేశ నియోజక వర్గాలన్నింటా అత్యంత పరిణితి చెందిన నియోజకవర్గంగా విర్రవీగి, గాలి లేని బుడగలా తయారైన మా నియోజకవర్గ దుస్థితిని తరచి చూడ ప్రార్థన.
    ========

    జ.నా గారి అభివృధ్ధి పనుల వివరాలని తెలిపినందుకూ, వ్యాఖ్యానించే అవకాశం ఇచ్చిన జీడిపప్పు గారికి సర్వదా కృతఙుడను.
    జీడిపప్పు ప్రజారోగ్యానికి మంచిది కావున వివరాలని ఎప్పటికప్పుడు అందజేస్తారని ఆశిస్తూ...

    - ఆలోచన.

  13. Rajesh said...

    below is what i found in loksatta.org:

    Do you want to get regular updates on Dr.JP's work in Kukatpally?
    Do you want to report an issue in Kukatpally?
    Do you have a suggestion for improving Kukatpally constitency?
    If so ,subscribe to our Google group kukatpallynow.You can subscribe by clicking on the following link : http://groups.google.com/group/kukatpallynow/subscribe?note=1

Post a Comment