హాస్య చక్రవర్తికి నివాళి
Posted by జీడిపప్పు
కేవలం హాస్య పాత్రలే కాకుండా స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ ఆస్తి కాజేసే విలన్ పాత్ర పోషించారు. అహనా పెళ్ళంట సినిమాలో తన పిసినారి బావ (కోట శ్రీనివాసరావు) చేష్టలకు మతికోల్పోయే కలెక్టరుగా చిన్న పాత్రలో కనిపిస్తారు. పడమటి సంధ్యారాగం సినిమాలో గుమ్మలూరి శాస్త్రిగారిగారి మాటలు వింటూ, నటన చూస్తుంటే ఆయనకు డబ్బింగ్ చెప్పిన సుత్తి వీరభద్రరావుగారే గుర్తుకొస్తారు. ఇక వివాహ భోజనంబు తర్వాత వచ్చిన చూపులు కలసిన శుభవేళ సినిమాలోని "గుండు పాండురంగం" ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర.
ఘంటసాల పాటలను అమితంగా ఇష్టపడుతూ ఆరాధించే గుండు పాండురంగం ఆరోగ్యానికి మంచిదని తన దగ్గరకు వచ్చిన వాళ్ళనూ, తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులనూ కిలోమీటర్ల కొద్దీ నడిపించుకొని వెళ్ళి వాళ్ళను అక్కడే వదిలేసి తన కారులో తిరిగి వచ్చేస్తాడు. ఇప్పటికీ ఎవరయినా "అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందామా" అంటే ఒక్క క్షణం గుండు పాండురంగం గుర్తుకొచ్చి గుండె గుభేల్మంటుంది!
చూపులు కలసిన శుభవేళ సినిమా అపుడు అనారోగ్యానికి గురి అయిన, వైద్యం వికటించి 1988, జూన్ 30న కేవలం 40 ఏళ్ళ వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దశాబ్దకాలం పాటు ఎన్నో మరచిపోలేని పాత్రలలో నటించి ఆరోగ్యకరమయిన హాస్యానికి చిరునామాగా నిలిచిన ఈ హాస్య చక్రవర్తి, తనూ తొందరగా వెళ్ళిపోయిన ఆయనను సృష్టించిన హాస్యబ్రహ్మ జంధ్యాల స్వర్గంలో అందరినీ నవ్వించింది ఇక చాలనుకొని మళ్ళీ భూమిమీద పుడతారని ఆశిద్దాం.
హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మొదటి భాగం
హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - రెండవ భాగం
హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మూడవ భాగం
June 30, 2009 at 12:53 AM
నాకు పళ్ళున్నప్పుడు తిన్న జీడిపప్పు పాకం అంత బాగుంది మీ బ్లాగ్. గ్రేట్!! సుపర్బ్!
June 30, 2009 at 2:17 AM
మీ మీద ఒక కేసు వేస్తున్నా కాచుకో౦డి. జ౦ధ్యాల కామెడీ ని గుర్తుకు తెప్పి౦చి, నా కడుపు నొప్పికి మీరే కారణ౦.
June 30, 2009 at 3:45 AM
మిత్రమా,
ఇంత చక్కటి ఆనందాన్ని గుర్తు చేసి మాకందరికీ పంచినందుకు అదే హాస్య బ్రహ్మ సృష్టించిన మరో ప్రతిమ శ్రీలక్ష్మి గుర్తొచ్చి పెద్దగా ఒక్క విజిల్.అలా నవ్వుతూ కళ్ళల్లోంచి నీళ్ళొచ్చి బాధపడుతూ ఆనందంతో మళ్ళీ ఘెట్టిగా ఇంకో విజిల్...
June 30, 2009 at 8:01 AM
బాగుంది
June 30, 2009 at 10:12 AM
అత్భుతంగా నివాళులు అందించావు.
June 30, 2009 at 9:49 PM
@ ఫణిబాబు గారు - మొదటిసారి బ్లాగుకు విచ్చేసినందుకు ధన్యవాదాలు :)
@ పెదరాయ్డు గారు - ఈ కేసుల గోల ఇలలో కలలో మనకేల :)
@ శ్రీనివాసు పప్పు గారు - నాదీ ఒక విజిల్ :)
@ పుల్లాయన గారు - ధన్యవాదాలు
@ భాస్కర్ రామరాజు గారు - ధన్యవాదాలు
June 30, 2009 at 11:35 PM
ఇది నా మొదటి వ్యాఖ్య మాత్రమే.తెలుగు బ్లాగ్ లోకంలో కాలు పెట్టినప్పటి నుండీ, మీ బ్లాగ్గులు చదువుతున్నాను. మీలాంటి " సీనియర్" ల మీద వ్యాఖ్యలు వ్రాసేటంత ధైర్యం చేయలేకపోయాను.ఇంకోటేమిటంటే మీరు ఈ సారి వ్రాసిన "పోస్ట్" నాకు అత్యంత ప్రియమైన హాస్యంగురించి.మరో విషయమేమిటంటే నేను బ్లాగ్గులలోకి వచ్చేటైముకి " వాతావరణం" వేడి గా ఉంది. కొత్తవారిమీద అక్షింతలు వేసేవారు.ఎలా స్వీకరించాలో తెలియక, ప్రవేశించలేదు.
July 26, 2009 at 10:49 PM
supar chala bagundi