ముసుగువీరుడి అసలు రూపం

Posted by జీడిపప్పు

చాలా రోజుల తర్వాత బ్లాగుల్లో మళ్ళీ "ఆ సందడి" నెలకొన్నది. కామెడీ కరువైపోతున్న బ్లాగుల్లో ఒక బ్లాగరు "కేసు పెడతా" అంటూ పోస్టు వేసి కడుపుబ్బా నవ్వించి మిగిలినవాళ్ళు కూడా కేసులు వేయడానికి ఆదర్శమయ్యారు. ఈ entertainment కనీసం వారం రోజులు కొనసాగాలని ఆశిద్దాం. ఈ సందర్భంగా అందరికీ ఒక మనవి/విన్నపం: పొరపాటున కూడా నోరు జారకండి. ఎవరినీ ప్రత్యక్షంగా తిట్టకండి. వీలయినంతవరకు పరోక్షంగానే తిట్టండి. ఉదా: సుత్తి నరేష్ కుమార్ ను తిట్టాలంటే "నత్తి" అనడం.. అలాగన్నమాట. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఒక బ్లాగరు ఇలా అన్నారు: "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." తస్మాత్ జాగ్రత్త. ఆ విధంగా మనమందరం ముందుకు పోదాం.

ఇప్పటిదాకా కేసుల గురించి వెలువడిన పోస్టుల జాబితా:
మలక్పేట్ రౌడీ గారి పైన కేసు పెడుతున్నా 
IP address ద్వారా కులం కనిపెట్టడం ఎలా? 
సైబర్ నేరం, మర్యాద!! ఉఫ్ - బడే హోజావ్ బచ్చే
కత్తి మహేష్ ఎ౦దుకు వివాదాస్పదుడవుతున్నాడు - నా దృక్కోణ౦ :)
కొణతం దిలీప్ గారికి నా సమాధానం
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు - ఓ బెకబెక
బ్రాహ్మణ ద్వేషం - ఒక ఆటిట్యూడ్  

IT లో ఉన్నవాళ్ళకు బాగా తెలుసు on-call గురించి. ఎప్పుడు ఫోన్/మెయిల్ వస్తుందో తెలియదు. బయట వెళ్ళలేము, ఎక్కువ టైం తీసుకొనే ఏ పనీ చెయ్యలేము. ఇలాంటప్పుడు మంచి టైం పాస్ కిటికీలోనుండి చూస్తూ చెట్టు ఎక్కుతున్న, దిగుతున్న ఉడతలను లెక్కపెట్టడం.. లేదా.. ఇదిగో ఇలాంటి పోస్టు వెయ్యడం!

అసలు విషయానికొస్తే -  బ్లాగుల్లో వ్యక్తిగత దూషణ తప్పు, నేను అలాంటివాటికి వ్యతిరేకం అన్నారు కత్తి మహేష్ గారు. నేను నూటికి.. well.. 92.5 శాతం (ఇదొక FM రేడియో) అంగీకరిస్తాను. ఇంకా "సత్ప్రవర్తన గల" మహేష్ గారు ఇలా అన్నారు "బ్లాగుల్లో కంటెంట్ కామెంట్లతో సహా అన్నిటి బాధ్యతా బ్లాగరిదే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మోడరేషన్ బాధ్యత బ్లాగరి తీసుకుంటాడు కాబట్టి." ఈ సారి 102.5 శాతం (ఇది ఇంకో FM రేడియో, రేడియో జాకీ చాలా హాట్ గా ఉంటుంది ఫోటోలో) అంగీకరిస్తాను. ఈ మాటలను ఎవరయినా చూస్తే "ఆహా ఈ మహేష్ గారు ఎంత ఉన్నత భావాలు కలవారు. ఎవరినీ నొప్పించరు, నొప్పించకూడదని చెప్తున్నారు" అనుకుంటాము కదా!

అదేంటో కానీ నాకు ఈయన ఒక ముసుగువేసుకొన్న "ముసుగు వీరుడు" అనిపిస్తాడు. పైకి మాత్రం "వ్యక్తిగత దూషణ ఉండకూడదు" అంటూనే స్వయానా తన బ్లాగులో కామెంట్ల మోడరేషన్ పెట్టి మరీ ఇంకొకరిని దూషిస్తున్న మాటలను తన బ్లాగు పోస్టులో ఆమోదిస్తాడు. ఇదేమి "రహస్య కుతి"??  పైకి శ్రీరంగ నీతులు చెప్పడం, తన బ్లాగులో మాత్రం ఇంకొకరిని తిట్టించడం.. ఇదెక్కడి న్యాయం ఉప్మా!!!

అన్నట్టు "ఇలా బూతులు తిట్టడం చట్ట రీత్యా నేరం కాబట్టి బూతులను ఆమోదించిన బ్లాగర్ల పైన కేసులు పెట్టు" అంటారా?? సారీ.. ముందు ఉడతలను లెక్క పెట్టాలి/పట్టాలి!!

29 comments:

  1. ఏక లింగం said...

    ఎయ్. ఎయ్. ఏయ్..జెజ్జెనకరి జనారే..జెనకుజెనా జెనారే...


    య్యే లబాసృబా కజాకినీ రుసగా జికలీ
    కురియ కురియాచు కురియ కురియ

  2. Shashank said...

    నీ మీద నాకు ఇదయ్యో..
    ఈ కేసులు నేను తట్టుకోలేను బుడుగయ్యో..

    ఉడతలు లెక్కెట్టాకా కనిపించి. నిన్ను attempt to defame కాసు లో ఇరికిస్తా.

  3. ఏక లింగం said...

    see this also..creative post

    http://aha-naa-blog-anta.blogspot.com/2009/06/ip-address.html

  4. నాగప్రసాద్ said...

    బ్లాగరులందరికీ ఇదే విన్నపం. ప్రతి ఒక్కరూ తమ కామెంటు బాక్స్ ల పైన "తాడేపల్లి" గారు తన బ్లాగులో పెట్టుకొన్నట్లు క్రింది విధంగా పెట్టుకోండి.

    గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

    రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

    మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.

  5. నాగప్రసాద్ said...

    >>"ఇలా బూతులు తిట్టడం చట్ట రీత్యా నేరం కాబట్టి బూతులను ఆమోదించిన బ్లాగర్ల పైన కేసులు పెట్టు"

    అన్నట్టు చెప్పడం మర్చిపోయా! త్వరలో ఆంగ్లబూతులకు, తెలుగు బూతులకు ఉన్న తేడాల గురించి ఒక పోస్టు రాద్దామనుకుంటున్నా. :)

  6. Krishna K said...

    " ఇదేమి "రహస్య కుతి"?? పైకి శ్రీరంగ నీతులు చెప్పడం, తన బ్లాగులో మాత్రం ఇంకొకరిని తిట్టించడం.. ఇదెక్కడి న్యాయం ఉప్మా!!! " :))

  7. ఏక లింగం said...

    See Dhoom's new post also

    http://dhoommachara.blogspot.com/2009/06/blog-post_21.html

  8. Unknown said...

    LOL.. :)

    అవును నాకు తెలియకడుగుతాను... ధూం గారిని కూడలి లోంచి ఎందుకు తీసేసారూ?

  9. పానీపూరి123 said...
    This comment has been removed by the author.
  10. పానీపూరి123 said...

    మరి కేసు పెట్టడానికి మంచి లాయరు/అటార్నీ లకు "జీడిపప్పు" ప్యాకెట్లు ఎవరుపంపిస్తారు :-P

  11. ఏక లింగం said...

    @ Phanikumar

    ఏంచెప్పమంటారు...
    బ్లాగు చింపుకుంటే బజారులో పడుతుంది.

    వాళ్లకు నచ్చినట్లు ఎవరు రాయకుంటే వాళ్లను ఊడబీకుతారు..దెర్మ పెబువులు.

  12. sweeyapraneetham said...

    emandi radio f.requencyla gurinchi chepparu avi online frequencyla leka cell lo vine radio la taluku frequencyla endukante rendu kuda tappu frequencyle chepparu okati 92.7/93.5 lalo okati ayi undali kani 92.5 asalu ledu inkoti 102.5 kuda ledu 102.8f.m anedi vividhabharathi ane athi purathana pavitramayna ok frequency. endukante nenu konnallu andulo announcerga chesi ippudu radio jackyni ayanu kanaka chepthunnanau. thanku

  13. Varunudu said...

    బాబ్బాబూ.. ఈ కేస్ లేంది? ఈ గొడవలేంది..? యేడ మొదలైందో చెపితే ఆణ్ణించే చదివి.. నేనూ కేసు పెడతా.. నేనూ కేసు పెడతా.. !

  14. Shashank said...

    వరుణ్ - టెన్షన్ నక్కో.. ఇదిగో ఇక్కద మొదలెట్టు

    http://parnashaala.blogspot.com/2009/06/blog-post_20.html తర్వాత
    http://parnashaala.blogspot.com/2009/06/blog-post_1488.html తర్వాత
    http://parnashaala.blogspot.com/2009/06/blog-post_20.html?showComment=1245502506561చ్7407553763679280194

    migitAdi buDugu blAg lO http://jeedipappu.blogspot.com/2009/06/blog-post_20.html

    chaduvu. migitAdi nIkE artham autundi.

  15. Kathi Mahesh Kumar said...

    జీడిపప్పు: మీతో నాకు సమస్య లేదు. ఎందుకంటే I believe what ever you are doing is for your fun and you are doing it with no malicious intentions.

    నేను కులాన్ని ఆపాదించి వాదనల్నుంచీ తప్పుకునే స్వభావం కలిగినవాడ్నైతే ఒక సంవత్సరంగా ఆ పని ఎందుకు చెయ్యలేదు? కులం పేరుతో దీర్ఘమైన వాదోపవాదాలు చేసుకున్న తాడేపల్లి గారికి నేను కులవివక్షను ఎందుకు ఆపాదించలేదు? మీరు నన్ను కుల/మతగజ్జి అంటూ కొన్ని టపాలు రాసినా నేను ఎందుకు ఈ విధంగా స్పందించలేదు? మలక్పేట రౌడీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా నేను ఆరోపణలు చెయ్యకుండా కేవలం సమాధానాలు మాత్రం ఎందుకు చెబుతున్నాను?

    Because I know your intentions are not malicious. I have a convincing reason why I am taking on these guys on the ground I have.

    Please do have fun with what ever is happening. But my fight is for a reason and I will fight it.

  16. Praveen Mandangi said...

    మహేష్ గారూ. సన్నాసి దృష్టిలో తెలివైన వాడు కూడా బైరాగే. కుల గజ్జి ఉన్నవాళ్ళ దృష్టిలో కులగజ్జి లేనివాళ్ళు కూడా కులతత్వవాదులే. అందుకే మీకు లేని కులతత్వాన్ని అంటగడుతున్నారు.

  17. జీడిపప్పు said...

    మహేష్ గారూ, ఇన్ని చెప్తున్నారే.. బ్లాగులోకంలో ఎవరినీ అనని మాటలు మిమ్మల్నే ఎందుకు అంటున్నారు? అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ఎందుకు పేర్కొంటున్నారు? మీపైన "హిందూ ద్వేషి"గా ఎందుకు ముద్ర పడింది? హిందువుల మనోభావాలను కించపరచడంలో మీరు నిష్ణాతులు అని అందరూ ఎందుకు ఏవగించుకుంటున్నారు? మొదలయినవి ఆలోచించండి.

    మీరు మారకుండా మీ విద్వేషాన్ని, కుత్సిత భావాలను తెలియజేస్తున్నంత కాలం మేమేమి చెయ్యగలం.. ఉచితంగా లభిస్తున్న entertainment ఎంజాయ్ చేయడం మినహా!!

  18. రాఘవ said...

    @జీడిపప్పు గారు సరిగ్గా చెప్పారు బాసు

  19. Malakpet Rowdy said...

    Mahesh,

    Well I never tried to get judgemental on your stuff but feel like doing it now.

    As far as I perceive it (I may be wrong) - It is not your stuff but it is the way you write that irritates people.

    For instance when you say that the current form of corrupted Hinduimsm is no match to the Vedic Hinduism - I agree 100%, RATHER 200%

    2 minutes happy - Then started trouble :))

    When you try to put the blame on a specific group or community, it irritates people. Everyone knows that Caste system is the biggest problem threatening the Hindu culture today, but the fact remains that the whole society is responsible for it.

    For a moment let us assume that 2% Brahmins were responsible for the Caste system. What were the other 98% doing? Even today we have caste discrimination even among Dalits and that was the reason why MRPS (and DSU in HCU) were born.
    (By the way KVN Raju and Brahmanandam were good friends of mine, if yiou know them)

    The facts remians that the Hindu society as a whole that includes Brahmins and Dalits is responsible for the plight of the Dalits today and any attempt to blame one community does not make sense.

    I DO SEE IN SOME OF YOUR POSTS THAT YOU WERE NOT TRYING TO BLAME ONE COMMUNITY ALL THE TIME - But the choice of the words you choose, perhaps to become sensational, as abracadabra said is actually back-firing.

  20. జిల్లేడు పప్పు said...

    ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం తొందర్లో జీడిపప్పు ను కూడా కూడలి లోంచి ఊడ బీక బోతున్నారుట.ఎందుకటా? ఈ గ్రూపులో చేరినందుకటా.

  21. నాగప్రసాద్ said...

    నమస్కారం. మీరు వింటున్నది "బ్లాగువాణి 102.0005 FM". "రచ్చలహరి" కార్యక్రమంలో భాగంగా మరి కొద్ది క్షణాల్లో "కెలకవోయి బ్లాగు వీరుడా" అనే పాటను ప్రసారం చేస్తున్నాము. విని తిలకించండి. సారీ చదివి ఆనందించండి.

  22. Krishna K said...

    @naagaprasaad, It is too good.

  23. శ్రీనివాస్ said...

    ఒక్కొక సారి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కట్ అవుతుంది అప్పుడు వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే నేను లినక్ష్ లో కూడలి ని బ్లాక్ చేసి జల్లెడ వైట్ చేసాను. నేను పిటి బూర్జువా అవడం వల్ల నా పోస్ట్ లన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటాను. ఇందాక ఒక బ్లాగర్ దానికి నేను బాద్యుడను కానూ అని వివరణ ఇచ్చాడు కనుక అతన్ని విమర్శించడం అనవసరం. మగ దురహంకారులకు ఏం తెలుసు "కలం " రచనల విలువ.

  24. ఏక లింగం said...

    see my new post
    http://ekalingam.blogspot.com/2009/06/blog-post_22.html

  25. Krishna K said...

    @శ్రీనివాస్, you are getting too good at this. అర్ధం కావటానికో నిమిషం పట్టింది :))

  26. రాజ మల్లేశ్వర్ కొల్లి said...

    హిందుత్వం లో కొన్ని తప్పులున్నాయి ఎవరైనా ఒప్పుకుని తీరతారు. దాని పరిష్కారానికి అందరం కృషి చేయాలి.
    మనింట్లో తప్పుల్ని మనింట్లో ఉండి మనమే పరిష్కరించుకోవాలి కానీ.., సాని కొంపలో దూరి సొంతింటి మీదే రాళ్ళేస్తుంటే....!?

  27. Krishna K said...

    కొల్లి గారు, ఉన్న అవుడియాలతోనే సచ్చిపోతున్నాం, మీరు ఇంకా క్రొత అవుడియాలు ఇవ్వకండి బాబు. " సాని కొంపలో దూరి సొంతింటి మీదే రాళ్ళేస్తుంటే....!?" అన్న దానిమీద, సాని లు అంటే ఎవరు, మేక్స్ముల్లర్ ఎలా సానుల గురించిన సమాచారం దాసి పెట్టి మనందరికి అందిచాడు, సొంతిల్లు ఎవరిది, నాలుగు వర్ణాల వాళ్లదా, అయుదో వర్ణం వాళ్లదా, అంటూ ఇంకో టపా మనకిప్పుడు అవసరమా?

  28. పెదరాయ్డు said...

    http://panchayiti.blogspot.com/2009/06/blog-post.html

  29. ఏక లింగం said...

    Jeedipappu gaaru,
    you did not add this post in your list

    http://ekalingam.blogspot.com/2009/06/blog-post_22.html

Post a Comment