అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 3
Posted by జీడిపప్పు
ఈ-రీడర్లు/ట్యాబ్లెట్ కంప్యూటర్ల మధ్య కొనసాగుతున్న యుద్దానికి గతవారం అమెజాన్ సీయీవో మరో అంకాన్ని చేర్చాడు. iPad ను ఢీకొట్టడం మరెవరివల్లా కాకపోవడంతో మరి కొన్నేళ్ళు iPad ఆధిపత్యానికి తిరుగులేదనుకున్న వారు పునరాలోచించుకొనేలా ఓ మినీ iPad ను Kindle Fire పేరుతో విడుదల చేసాడు. ప్రస్తుత iPad ను $500కు (??) రిలీజ్ చేసినపుడే స్టీవ్ జాబ్స్ మరో మినీ iPad ను కాస్తంత తక్కువ ధరకు మార్కెట్లోకి వదిలి ఉంటే అమ్మకాలు మరింత పెరిగేవేమో కానీ, ఎందుకో ఆపిల్ అలా చెయ్యలేదు.!
ఇప్పటిదాకా కేవలం పుస్తకాలను చదువుకొనే ఈ-రీడర్ల పైన మాత్రమే దృష్టి పెట్టిన అమెజాన్ ఇప్పుడు కేవలం $199 కే 7 inches కలర్‌స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్ ను విడుదల చేసింది. ఇది గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పైన నడుస్తుంది కాబట్టి మార్కెట్లో ఉన్న వేలాది applications ఇందులో కూడా వాడవచ్చు. ఇక iPad తరహా ఇందులో సినిమాలు, మ్యూజిక్, బుక్స్.. మొదలయిన అన్ని సదుపాయాలున్నాయి. కెమెరా, వాయిస్ ఛాట్ లేకపోవడం ఒక మైనస్ కావచ్చు. Fire స్క్రీన్ సైజు కేవలం 7" కావడం వల్ల పీడీయఫ్‌లు చదువుకోవడమే కష్టమేనేమో. ఏది ఏమయినా ఇది అమెజాన్ ప్రాడక్టు కాబట్టి తప్పక మన డబ్బుకు తగిన ప్రతిఫలాన్నిస్తుంది అన్న నమ్మకం ఉంది. పూర్తివివరాలను నవంబరులో Fire విడులయ్యాక చూడాలి.
Fire తో పాటు మరో రెండు ఇ-రీడర్లను కూడా అమెజాన్ సీయీవో Jeff Bezos విడుదల చేసాడు. ఇప్పటికే Kindle 3 ధరను $189 నుండి $139 కు, ఆ తర్వాత ads ఉన్నదాన్ని $114కే ప్రకటించి కొన్నవారికి బాధను, కొనేవారికి ఆశను కల్గించిన Bezos ఈసారి Kindle 3 కొన్నవారు "తొందరపడ్డామేమో!" అనుకొనేలా చేసాడు. (ఆఫ్‌కోర్స్.. ఎలక్ట్రానిక్స్, కార్లు లాంటివి కొన్న ప్రతివారికీ ఇలాంటి బాధలు మామూలే!). 3G లేని కిండిల్ 3 ధర $114 నుండి $99 కి వచ్చింది. దీనితోపాటు అదే స్క్రీన్ సైజు ఉన్న Kindle Touch $99కి, కీబోర్డ్ లేని కిండిల్ $79కే లభ్యమవుతోంది!!
ఇవన్నీ చూసిన తర్వాత ఈ-రీడర్ల పైన ఆసక్తి ఉన్నవారు ఏది కొనాలి అంటే చెప్పడం కష్టమే. ఇంట్లో హైస్కూలు పిల్లలుంటే వారికి చివరన చెప్పిన $79 కిండిల్ కొనివ్వడం ఉత్తమం. iPad కొనాలని, ఇంకా కొనని వారు కొన్నాళ్ళాగి Fire ను $200 కు కొనుక్కోవడం మేలనిపిస్తుంది, అది కూడా Fire రివ్యూలను చదివి. ("ఎంతో కష్టపడి గొప్ప ప్రాడక్టు తయారు చేస్తే మీరు ముష్టి $200 పెట్టి కొనడానానికి రివ్యూలు చూస్తారా? రివ్యూలు చూసి కాదురా ప్రాడక్టు కొనవలసింది" అని ఎవరన్నా అంటే అది వారి మనస్సాక్షికే వదిలేస్తున్నా)

చెత్త చట్టాలు, స్త్రీవాదులు
Posted by జీడిపప్పు
'చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ' అన్న పాట విన్నపుడు "ఓహో, చట్టానికి చూపులేదు కాబట్టి కేవలం విన్నవి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందన్నమాట" అనుకుంటాము. కానీ కొన్ని కొన్ని చట్టాలను చూస్తే "చట్టానికి కళ్ళే కాదు మెదడు కూడా లేదు" అనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల విషయంలో కొన్ని అతిచెత్త చట్టాలను అమలు చేస్తున్నారు. ఎవరయినా మహిళ తన పైన ఎవడో ఏదో చేసాడని చెప్తే చాలు, ముందూ వెనకా చూడక వాడి పైన కేసు బనాయించేస్తారు, ప్రాథమిక విచారణ కూడా జరపకుండా. దీనికి "మహిళా సంఘాల" మద్దతొకటి.
అనగనగా ఓ కాలేజీ అమ్మాయి ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఓ రోజు ఇద్దరి మధ్యా గొడవలయి ఇద్దరూ విడిపోయారు. అప్పటివరకు చెట్టపట్టాలేసుకొని అందరి ముందూ "మేము లవ్‌బర్డ్స్" అని తిరిగిన ఈ జంట కలిసి తిరగకపోవడంతో స్నేహితులు ఆ కుర్రాడిని "ఆ అమ్మాయి ఎలా ఉంది" అన్నాడు. వాడు "మేమిద్దమూ విడిపోయాము" అన్నాడు.. అదీ ఫేస్‌బుక్‌లో. ఎంత ఘోరం ఎంత ఘోరం. Oh my heart melts. అది చూసి, IIM- Bangalore విద్యార్థిని అయిన, ఆ అమ్మాయి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తన పైన ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఆ కుర్రాడి పైన "ఆత్మహత్యకు పురికొల్పినందుకు" కేసు బుక్ చేసారు!!
రోజుకొక బాయ్ ఫ్రెండ్ ను మార్చే అమ్మాయిలు, పూటకొక గర్ల్ ఫ్రెండ్ ను మార్చే అబ్బాయిలున్న ఈ రోజుల్లో ఒకడు తన గర్ల్ ఫ్రెండ్ ను డంప్ చేసాను అని చెప్పడం నేరం ఎందుకవుతుంది? ఫేస్ బుక్‌లో వీళ్ళు జంటలుగా ఉన్న ఫోటోలు పెట్టినపుడు లేని తప్పు అదే ఫేస్‌బుక్ లో "మేము విడిపోయాము" అని చెప్పడం ఎలా తప్పిదమో!
**** ********
ఒకప్పుడు సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ లాంటివారు స్త్రీల అభ్యుదయానికి పాటుపడి అసలయిన స్త్రీవాదులు అనిపించుకున్నారు. కానీ కాలక్రమంలో ఈ స్త్రీవాదానికి ఉన్న విలువ దిగజారి మహిళా సంఘం అంటే పనీ పాటా లేక రోడ్లెక్కి నానా గొడవ చేసి, సంసారాలను నాశనం చేసేవారు అని ముద్ర పడింది. (ఈ సో కాల్డ్ స్త్రీవాదుల్లో ఎంతమంది తమ పిల్లలకు చక్కగా విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకులు చేసి "తల్లి అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి" అనిపించుకున్నారో!) వీళ్ళలో కొందరికి అర్థ నయాపైసా పని ఉండదు, చక్కగా కాపురం చేసుకొనే స్త్రీలను చూసి ఓర్వలేరు. ఎవరో దొరికితే ఒక ఇంటిముందు ధర్నా చేసి, గొడవ చేసి కాసేపు టీవీల్లో కనిపించి వీలయితే నాలుగు డబ్బులు గుంజి ఆ పూటకు పైశాచిక ఆనందం పొందుతుంటారు.
'ఓ టీనేజ్ అమ్మాయిని ఒకడు మోసం చేసాడు ' అని గొడవ మొదలెడతారు. మోసం అంటే ఎలాంటి మోసం? ఆ అమ్మాయిని కొన్నాళ్ళు ప్రేమించి ఆ తర్వాత మరో అమ్మాయిని ప్రేమించడం మోసమా? ఇలాంటి సిల్లీ విషయాలకు కూడా కొందరు గొడవ చేస్తారు... ఇవేమీ అంతగా పట్టించుకోవలసినవి కావు. అసలు సిసలయింది ఏమిటంటే - ఒకడు ఒక అమ్మాయిని గర్భవతిని చేసి తర్వాత పెళ్ళి చేసుకోను అంటాడు. చట్ట ప్రకారం ఇది మోసమే. మరి దీనికున్న పరిష్కారాలేవి? ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏది తప్పో ఏదొ ఒప్పో వివరించాలి.
కానీ స్త్రీవాదులు ఆ అమ్మాయితో కేసు పెట్టించి ధర్నాలు చేయిస్తారు, పెళ్ళి చేసుకోమని. తన పైన కేసు పెట్టిన అమ్మాయితో బలవంతంగా పెళ్ళి చేసినా వాడు ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకుంటాడా? పెళ్ళి అయిన తర్వాత వాడు ఈ అమ్మాయితో కాపురం చెయ్యకుంటే ఈ స్త్రీవాదులు వెళ్ళి రెండు లారీల జనాన్ని తోలుకొచ్చి కాపురం చేయిస్తారా? రేపు అత్తమామలు ఆ పిల్ల పట్ల ఎలా ప్రవర్తిస్తారు? ఇలా పెళ్ళి చేయిస్తే మున్ముందు ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అన్న కనీస ఆలోచన లేకుండా తమ పైశాచిక ఆనందం కోసం చట్టాలను దుర్వినియోగం చేసి సంసారాలు నాశనం చేసే కొందరు చీడపురుగులు మన మధ్యనే ఉండడం శోచనీయం. వీరికి అవకాశమిచ్చే పనికిమాలిన చట్టాలుండడం మన దౌర్భాగ్యం.

అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 2
Posted by జీడిపప్పు
భారతీయ సాహిత్యానికొస్తే - పాశ్చాత్యులకు ఉన్నట్టు మనకు చెప్పుకోదగ్గ "ఆల్ టైం క్లాసిక్స్" పెద్దగా లేవనుకుంటాను. మహాభారత, రామాయణాలు, ఒక యోగి ఆత్మ కథ తప్ప అమెజాన్‌లో మరే ప్రముఖ భారతీయ పుస్తకాలు కనిపించలేదు. Archive.org లో కొన్ని పుస్తకాలున్నాయి కానీ అవి కిండిల్ లో చదవబుల్‌గా లేవు. నాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఈ సైటులో చూడగానే మనసు ఆనందంతో ఉరకలేసింది. ముందూ వెనకా చూడక ఓ పది పుస్తకాలను (కిండిల్ కు సానుకూలమయిన mobi ఫార్మాట్‌లో) దింపి కిండిల్‌లో చదవడానికి ప్రయత్నిస్తే తలప్రాణం తోకకొచ్చింది.
విషయమేమిటంటే, పుస్తకాలను digitize చెయ్యడమంటే గుడ్డిగా స్కాన్ చేసి అప్‌లోడ్ చెయ్యడమే అనుకున్నారు మనవాళ్ళు. వచ్చిన చిక్కల్లా ప్రతి పేజీలో ఉన్న foot notes, references తోనే. స్కాన్ చేసిన పీడీయఫ్ ను ఏదో ఒకరకంగా mobi ఫార్మాట్‌లోకి మార్చినపుడు ఈ foot notes, references కూడా అసలు విషయంతో కలిసిపోతున్నాయి. మనము చదువుతున్నది ముఖ్యవిషయమో లేక దాని రెఫెరెన్సులో అర్థం కాక బుర్ర గోక్కోవాలి. (కొన్ని పుస్తకాలయితే మరీ దారుణంగా ఉన్నాయి. పావు పేజీ మేటర్‌కు రెండు పేజీల రెఫరన్సులు! ఓరి మీ కృతజ్ఞత కాకులెత్తుకెళ్ళ అనిపిస్తుంది).
ఈ సైటు కాదని DLI కు వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా పెద్ద అవాంతరాలు ఎదురయ్యాయి. చాలా పుస్తకల్లో పెన్నుతో అక్కడడక్కడా హైలైట్ చేసారు. Archive.orgలో నాకు నచ్చిన ఒకట్రెండు పీడీయఫ్ లను PDF to Word ఉపయోగించి, రెండు మూడు గంటలు కష్టపడి శుద్దిచేసి కిండిలీకరించుకున్నాను. ఈ DIL లో ఆ భాగ్యము కూడా దక్కలేదు. పెన్నుమార్కులున్న పుస్తకాన్ని text గా మార్చడానికి అన్ని టూల్స్ ససేమిరా అంటున్నాయి. ఇవన్నీ చూసి ప్రస్తుతానికి భారతీయ ఇంగ్లీషు పుస్తకాల సంగతి పక్కన పెట్టాను.
ఇక తెలుగు పుస్తకాల విషయానికొస్తే - ముందుగా నెట్లో మనకు లభ్యమవుతున్న పుస్తకాలేవో చూసాను. ఉన్న పుస్తకాల్లో దాదాపు అన్నీ PDF ఫార్మాట్లో ఉన్నాయి. కిండిల్ స్క్రీన్ సైజు వల్ల పేజీ పూర్తిగా కనిపించదు. ఒకవేళ zoom చేస్తే సగం వాక్యం మాత్రమే కనిపిస్తుంది. మిగతా సగం కనిపించాలంటే horizontal scroll చెయ్యాలి. ఇలా వాక్య వాక్యానికి స్క్రోల్ చేసి చదవడమంటే అది విజయేంద్రవర్మ సినిమా చూడడానికి తెగించినట్టే. పై పేరాలో చెప్పిన కారణాలవల్ల archive.org లోని తెలుగు పుస్తకాల జోలికి వెళ్ళనక్కరలేదు.
తెలుగువన్ లో కొన్ని నవలలున్నాయి కానీ అవి సరి అయిన ఫార్మాట్లో లేవు. కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ, చదవదగ్గ పుస్తకాలు కౌముది గ్రంథాలయంలో ఉన్నాయి. నెట్లో ఉన్న పుస్తకాలలో ఉన్నత ప్రమాణాలున్న ఇ-పుస్తకాలు ఇవే అనుకుంటాను. pdf ను అలాగే కిండిల్ లో చదివితే పైన చెప్పిన సగంవాక్య సమస్య వస్తోంది ( కౌముది పుస్తకాలు iPad లొ చక్కగా చదువుకోవచ్చు). వీటిని mobi ఫార్మాట్‌కు మార్చాలని ప్రయత్నిస్తే అదేదో కొత్త భాష పుట్టుకొచ్చింది. Calibre లో ప్రస్తుతానికి కొన్ని భాషల fonts మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగు fonts కావాలంటే కొన్నాళ్ళు వేచి ఉండక తప్పదు.
నాకు తెలిసిన అన్ని ప్రయత్నాలు చేసాను కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన , ఆశించిన ఫలితం దక్కలేదు! ప్రస్తుతానికి తెలుగు పుస్తకాలు కిండిల్ లో చదివే అవకాశం దాదాపు లేదు. కాకపోతే "అన్నింటికీ ఆ అమెరికావాడే ఉన్నాడు" అని తరచూ అంటుండే నాకు నమ్మకముంది..
ఏదో ఒక రోజు కిండిల్‌లో కూడా మనకు
అందుబాటులో ఉన్న అన్ని తెలుగు పుస్తకాలను తప్పక చదువుకోగలమని, అందుకు తగిన ఏర్పాట్లు ఎవరో ఒకరు చేస్తారని.
కిండిల్ లో ఇంగ్లీషు పుస్తకాలు చదువుతున్నపుడు "తెలుగు కూడా చదవాలి.. ఏదయినా సరే" అని తొలుస్తుంటే ఆగలేక ఓ బ్లాగునుండి కొంత కాపీ చేసి వివిధ font sizeలతో పీడియఫ్‌లు చేసి కిండిల్ లో చదవడానికి ప్రయత్నించగా చివరకి 18 Font size సరిపోయింది.