అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 1
Posted by జీడిపప్పు
అరచేతి గ్రంథాలయం కిండిల్ విడుదలయిన కొన్నాళ్ళవరకు "భౌతికంగా పుస్తకాన్ని పట్టుకొని చదివినపుడు కలిగే అనుభూతే వేరు, ఇలా e-readerలో చదివితే ఆ అనుభూతి రాదు" అన్న పాఠకులే e-reader లో ఒకట్రెండు పుస్తకాలు చదివి "ఇదేదో బాగుందే!! వేలకొద్ది పుస్తకాలను అరచేతిలో అమర్చుకొని ఎప్పుడు ఎక్కడయినా చదుకోవడానికి వీలుగా ఉంది.. పైగా కళ్ళకు శ్రమ కూడా లేదు" అంటూ వీటివైపు మొగ్గు చూపించారు. కొందరు గొప్పరచయితలు కూడా (ముఖ్యంగా Stephen King) వీటి ఉపయోగాలను, భవిష్యత్తులో వీటి అవసరాన్ని వివరించడంతో పఠనారంగంలో సరికొత్త విప్లవం మొదలయింది.
కిండిల్ బాగా పాపులర్ అయిన కొన్నాళ్ళకు స్టీవ్ జాబ్స్ ఎవరూ ఊహించని విధంగా iPad ను విడుదల చేసి 'ఆహా ఏమి భాగ్యము, దీనికంటే మిన్న అయినది, సరిసాటి మరియొకటి లేదు" అనిపించాడు. అమెజాన్ కిండిల్ కేవలం పుస్తకాలను చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది (music, చిన్న చిన్న games కూడా ఉన్నాయి) కానీ ఐపాడ్లో వినోదానికి సంబంధించి దాదాపు అన్ని సౌకర్యాలున్నాయి. అయినప్పటికీ సగటు పాఠకుడికి e-పుస్తకాల రుచిని చూపెట్టి, అందుబాటు ధరకే లభ్యమయ్యేలా చేసింది మాత్రం Amazon CEO Jeff Bezos. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో e-book readers ఉన్నా నా ఓటు మాత్రం కిండిల్ కే.
ఇక్కడ అమెజాన్ వారి marketing strategy ని అభినందించక తప్పదు. మమూలు పుస్తకం కంటే ఇ-పుస్తకం ధర కాస్త తక్కువగా నిర్ణయించి పాఠకుల దగ్గర అభిమానాన్ని చురగొన్నారు. పుస్తకాల ధర తక్కువ అన్నపుడు వచ్చిన స్పందన చూసి "కొన్ని పుస్తకాలు ఉచితం అని ప్రకటిస్తే ఎలా ఉంటుంది" అన్న ఆలోచనతో 1927 కంటే ముందు ప్రచురించబడిన కొన్నింటిని ఉచితంగా అందచేయడం మొదలు పెట్టారు. ఉచిత పుస్తకాలనంత మాత్రాన అవేవో ఊరు పేరు లేని అనామక రచయితలవి కావు. ప్రపంచ ప్రసిద్దులయిన Mark Twain, Jane Austen వంటివారి రచనలన్నిటినీ కిండిలీకరించి ఉచితంగా కిండిల్ లో చదువుకొనే అవకాశం కలిపించారు.
Gulliver's Travels, Adventures of Tom Sawyer, Alice in Wonderland, Jungle Book, Treasure Island, Sherlock Holmes లాంటి పుస్తకాలు ఉచితంగా ఊరిస్తూ ఉంటే ఊరుకోగలరా ఎవరయినా? కొన్నాళ్ళు ఈ ఉచిత పుస్తకాలకే పరిమితమయినా తర్వాత అమెజాన్‌లో $1 నుండి మొదలయ్యే పుస్తకాలను కొనడానికి అలవాటవుతారు. కేవలం Amazon Free Books మాత్రమే కాకుండా Project Gutenberg, ManyBooks లాంటి చోట్ల కూడా ఎన్నో వేల పుస్తకాలున్నాయి. Calibre ఉపయోగించి మన దగ్గర ఉన్న ఇంగ్లీషు pdf లను కిండిల్ కు అనుగుణంగా మార్చుకొని చదువుకోవడానికి కూడా వీలుంది. (ఇక నెట్లో వెతికితే కావలసిన పుస్తకం ఏదో ఒక ఫోరంలో mobi/epub ఫార్మాట్లో దొరుకుతుంది!)
నేను Kindle 3 కొన్న మొదట్లో అందరిలాగే "ఎంతయినా పుస్తకం పుస్తకమే" అనుకుంటూ అందుబాటులో ఉన్న ఏదో పుస్తకాన్ని కిండిల్‌లోకి ఎక్కించి కొన్ని పేజీలు చదివిన తర్వాత నచ్చక "తొందరపడి కొన్నానా" అనుకొంటూ "ఇన్ని మిలియన్లమంది కొంటున్నారంటే ఏదో ఉండి తీరాలి" అనుకున్నాను. తర్వాత తెలిసింది నేను చేసిన తప్పేంటో. వెంటనే నాకు బాగా నచ్చిన Gulliver's Travels చదవడం మొదలుపెట్టాను. కొన్ని పేజీల వరకు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఆ తర్వాత గాడిలోపడ్డాను. తద్వారా బోధపడిన సత్యం - "మనకు బాగా నచ్చిన పుస్తకాన్ని చదవడముతో కిండిల్ ఉపయోగాన్ని ప్రారంభించాలి". ఒక్కసారి కిండిల్ రుచి చూసాక అదే ఊపులో మరికొన్ని పుస్తకాలను చదివి నా పఠనాజీవితంలోకి కిండిల్ ను మనస్పూర్తిగా ఆహ్వానించాను. ఈ క్రమంలో పుస్తకాల వేటను కూడా ఉధృతం చేసాను. ఎమ్మెల్యే సీట్లమ్ముకున్న అల్లు అరవింద్ కలెక్షన్ బాక్సు ఎలా నిండిందో నా కిండిల్ పుస్తకాల కలెక్షన్ కూడా అలా పెరిగింది.
ఇక ఈ కిండిల్‌లో నాకు నచ్చిన మరో అంశం - డిక్షనరీ. మనము చదువుతున్నపుడు మనకు అర్థం తెలియని పదం దగ్గరకు cursor తీసుకొస్తే వెంటనే రెండు లైనలో అర్థం కనపడుతుంది. మరిన్ని వివరాలు, ఉదాహరణ వాక్యాలు చూసుకోవచ్చు కూడా. అలాగే highlight చేసే సదుపాయం వల్ల పుస్తకం మొత్తం పైన ఉన్న మనకు కావలసిన క్లిష్టపదాలను ఒకేసారి చదువుకోవచ్చు. GRE లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక పుస్తకాలను లైబ్రరీలోలా అమర్చుకోవడం కూడా చాలా బాగుంది.
ధర - రెండున్నరేళ్ళ క్రితం నేను వ్రాసిన 'అరచేతిలో గ్రంథాలయం - రచయితలకు, పాఠకులకు ఒక వరం' టపాలో 'బహుశా మరో ఐదేళ్ళలో అన్ని భాషలలో, అన్ని దేశాలలో 100-150 డాలర్లకు ఈ పరికరం అందుబాటులోకి రావచ్చు.' అని ఊహించాను. నా అంచనాలకు భిన్నంగా ప్రస్తుతమే కిండిల్ $139 లేదా $114 కే లభ్యమవుతోంది! ( Best Buyలో Thanksgiving Sale లో $99 కే దొరకవచ్చేమో! ) ఒక కిండిల్ వాడుకరిగా, దీని ఉపయోగాలు, సౌకర్యాలు కాస్తో కాస్తో తెలిసినవాడిగా "పఠనాసక్తి ఉన్నవారు మరో ఆలోచన లేకుండా ప్రస్తుత ధరకు కొనవచ్చు" అని చెప్పగలను. ముఖ్యంగా టీనేజర్లలో పఠనాసక్తి కలిగించడానికి ఇది చక్కని బహుమతి.
ఇవీ ప్రస్తుతానికి "కిండిల్ కబుర్లు - ఇంగ్లీషు పుస్తకాలు". మరి మన భారతీయ సాహిత్యం, ముఖ్యంగా కిండిల్‌లో తెలుగు చదవడం ఎంతవరకు సాధ్యం లాంటి వివరాలు మరో టపాలో!

తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 5 - కేసీయారే దిక్కు
Posted by జీడిపప్పు
దేవుడు ప్రత్యక్షమయితే ఏమి కోరుకుంటావు అంటూ అపుడపుడు కొందరు అడుగుతుంటారు. ఓ ఇళయరాజా వీరాభిమాని అయితే "స్వామీ ఇక ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చెయ్యకుండా విశ్రాంతి తీసుకొనేలా చూడు" అని, ఓ వంశీ అభిమాని "ఇక వంశీ సినిమాలు తీయకుండా కథలు వ్రాసుకునేలా చూడు" అని, బ్లాగు టెర్రరిస్ట్ అయితే "నేను రాసే విషపూరిత పోస్టులు చదివి కనీసం ఒక్కరయినా ప్రభావితమయ్యేలా చూడమని", నాబోటి టెకీ అయితే "ఓ ప్రభువా, Internet Explorer ఉపయోగించు నీ శిశువుల పాపములను హరించి Firefox ఉపయోగించు వరమును ప్రసాదింపుడి 36:28" అని, దాదాపు ప్రతి తెలుగు బ్లాగు పాఠకుడూ "ఈ మార్తాండ కాస్త అర్థవంతమయిన, విషయ సంబంధిత వ్యాఖ్యలు పోస్టేలా చూడ"మని కోరుకుంటారు. ఈ సివరాఖరిది నెరవేర్చడం నావల్ల కాదని దేవుడు మాయమయి కేసీఆర్ ముందు ప్రత్యక్షమయి "భక్తా ఏమి నీ కోరిక" అంటే, కేసీయార్ " నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణా రాకుండా చూడు స్వామీ" అని సాష్టాంగపడతాడు.
టీడీపీ నుండి బయటకు వచ్చాక ఏమి చేయాలో తోచక ఏదో టైంపాస్ గా ఉంటుంది కదా అని తెలంగాణా ఉద్యమాన్ని మొదలు పెట్టిన కేసీయార్ ఇంతితై వటుడింతై అన్నట్టు "తెలంగాణా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణా" అనే స్థాయికి ఎదిగాడు. మిగతాపార్టీల్లో ఎందరు అతిరథ మహారథులున్నా కేసీఆర్ చెప్పిందే ఈ ఉద్యమానికి వేదం. అటు గాంధీవారసులయిన నిజమయిన తెలంగాణా వాదులనుండి ఇటు దేశద్రోహ/దుశ్చర్యలకు పాల్పడే తెలబాన్లవరకు అందరూ కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించవలసిందే. తెలంగాణా వచ్చిన తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏమో కానీ రాష్ట్రం విడిపోయిన పాతికేళ్ళ తర్వాత సీమాంధ్రవాసులు మాత్రం " కేసీఆర్ ఆ ఉద్యమాన్ని నడిపించకపోతే ఈ రోజు మన ప్రాంతాలు ఇంత అభివృద్ది చెంది ఉండేవా" అని తప్పక స్మరించుకుంటారు అని నా అభిప్రాయం.
నాకు ఎందుకలా అనిపించిందంటే - ఇప్పటివరకు ఏ సీమాంధ్ర నాయకుడయినా మనస్పూర్తిగా తమ ప్రాంతాల అభివృద్దికి కృషి చేసాడా? సీమాంధ్రప్రాంతాల్లో జరిగిన అభివృద్ది "జరగవలసినది కాబట్టి దానంతట అదే జరిగింది" తప్ప నాయకుల కృషి వల్ల జరగలేదు. (It just happened, as it should happen) సీమాంధ్రలోని మానవ, సహజవనరులను సక్రమంగా ఉపయోగించుకొనేలా ఈ నాయకులు కృషి చేసి ఉంటే ఈ ప్రాంతాలు మరింత అభివృద్ది చెందేవి. ఎవరో అతి కొద్దిమంది తప్ప ప్రతి సీమాంధ్ర రాజకీయనాయకుడూ హైదరాబాదు చుట్టూ ఎక్కువ దృష్టిసారించారు. రాజకీయ నాయకుల వరకు ఎందుకులే, చేతిలో నాలుగు డబ్బులున్న సగటు సీమాంధ్ర పౌరుడు కూడా "హైదరాబాదులో స్తిరాస్థి కావాలి" అని పొలోమని హైదరాబాదు వెళ్ళేవాడు. ఇలాంటివారందరూ ఈ రోజు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలంటే కాస్త తటపటాయిస్తుండడానికీ, ఎన్నడూ లేని విధంగా టీవీల్లో సీమాంధ్రప్రాంతాల పట్టణాలకు సంబంధించిన "రియల్ ఎస్టేట్, విల్లాస్, అపార్ట్మెంట్ల" గురించి ప్రకటనలు రావడానికి ప్రధాన కారణం కేసీఆరే నడిపిస్తున్న ఈ ఉద్యమమే!
ఇక కేసీఆర్ ఈ ఉద్యమాన్ని సాగదీసే విధానం బహుముచ్చటగొల్పును. "అసలు ఎప్పటికీ తెలంగాణా ఇవ్వరు, ఈ ఉద్యమం పేరుతో మామూళ్ళు వసూలు చేసుకోవచ్చు, అధికార పార్టీతో చేతులు కలిపి ఉద్యమ బూచి చూపి పేరు, డబ్బు గడించవచ్చు" అన్న కేసీఆర్ ప్లానుకు బై ఎలక్షన్ల ఫలితాలను చూసి మిగతా పార్టీలు కూడా తెలంగాణా పాటకు శ్రుతి కలిపినపుడు సమస్య ఎదురయింది.. అప్పటివరకు అంతా తానై నడిపిస్తున్న కేసీఆర్‌కు మిగతా పార్టీలవాళ్ళు కూడా తమతో కలుస్తామని అనడంతో, ఎక్కడ పొలిటికల్ గా తన మైలేజీ తగ్గుతుందో, ఎక్కడ తాను సీమాంధ్రులనుండి వసూలు చేస్తున్న మామూళ్ళలో వాటా మిగతావారికి ఇవ్వవలసి వస్తుందో అన్న అనుమానం మొదలయింది.
టీఆరెస్ ఒక్కటే ఉద్యమిస్తున్న కాలంలో కేసీఆర్ అపుడపుడు తెరపైకి వచ్చి నాలుగు పిట్టకథలు చెప్పి రెచ్చకొట్టే ప్రసంగాలు చేసి రెండ్రోజులు కోలాహలం చేసి "తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు చావండి" అంటూ వెళ్ళిపోయాడు. తర్వాతి రోజుల్లో ఉద్యమకారులు, ఉన్మాదులు, తెలబాన్లు కాస్త హల్చల్ చేసేవారు. ఆ సమయంలో కేసీఆర్ కమీషన్ల లెక్కలు, తన కొడుకు సీమాంధ్ర వ్యాపారవేత్తలతో కలిసి చేస్తున్న వ్యవహారాలు చూసుకొనేవారు. ఉద్యమం కాస్త చల్లబడుతోందన్న సంకేతాలు వస్తే వెంటనే కాస్త పెట్రోలో డీజిలో పోసి మళ్ళీ మంటలు రేపేవాడు. ఏదో మొక్కుబడిగా మొదలుపెట్టిన ఉద్యమం కాస్తా ఉధృత రూపం దాల్చడము, మిగతా పార్టీలవాళ్ళు కూడా అందులో చేరి "మేమూ ఉద్యమంలో చేరాము, మేమూ రాజీనామా చేసాము" అనడంతో ఖంగుతిన్న కేసీఆర్ ఇలా అయితే తొందరగా తెలంగాణా వచ్చే ప్రమాదముందని గ్రహించి, మిగతా పార్టీలవారిని దూరంచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని తెలంగాణా పార్టీలు ఒకే తాటివైపు రాకుండా ఉండడానికి తన సర్వ శక్తులు కేంద్రీకరిస్తున్నాడు. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వస్తే తెలంగాణా రావడం ఎంతసేపు? అలా వస్తే తర్వాత తన ప్రాభవమేముంటుంది?
కొన్నేళ్ళకు తెలంగాణా వచ్చినా క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కు కొన్నాళ్ళే ఉంటుంది. తెలంగాణా వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీలు అక్కడా పోటీ చేసి మొదటిసారి కాకపోయినా రెండోసారి ఎన్నికలనుండి తమ సత్తా చూపుతాయి. అప్పుడు కేసీఆర్ గుంపులో గోవిందుడుగా మిగిలినా ఆశ్చర్యంలేదు. కాబట్టి తెలంగాణా వస్తే ఆ తర్వాత కేసీఆర్ భవిష్యత్తు, ముఖ్యంగా తనయుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు పెద్దగా ఎదుగుదల ఉండకపోవచ్చు.
ఇందులో భాగంగానే టీవీల్లో ఎన్నో వినోదాత్మక దృశ్యాలను చూసాము. ఉన్మాదియాలో విద్యార్థులు నిరాహారదీక్ష చేస్తుంటే టీఆరెస్ నాయకులు వెళ్తే ఏ గొడవా లేదు కానీ అప్పట్లో టీడీపీలో ఉన్న నాగం జనార్ధన రెడ్డి వెళ్తే చెప్పులతో కొట్టి తరుముకున్నారు. ట్యాంక్‌బండ్ పైన మార్చ్ సమయంలోనూ కేశవరావు పైన దాడి చేసారు. మొన్నటికి మొన్న టీడీపీ నాయకుడయిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి పైన దాడి చేసి ఆస్తి నష్టం చేసారు. ఎక్కడ ఏ దీక్షను పరామర్శించడానికి వెళ్ళినా ఆ వెళ్ళినవారు Non-TRS నాయకులయితే చాలు, వారి పైన దాడులకు దిగుతారు "మేము కూడా తెలంగాణా కోసం పోరాటం చేస్తున్నాము మొర్రో, మమ్మల్నీ మీలో కలుపుకోండి" అని కాళ్ళా వేళ్ళా బ్రతిమాలుకున్నా వినిపించుకోకుండా! ఇది కేవలం శ్రీమాన్ కేసీఆర్ గారు తెలంగాణా నాయకులను ఏకతాటిపైన తీసుకురాకుండా చేసే ప్రయత్నం తప్ప ఇంకేమయినా ఉందా?
తెలంగాణా వస్తే తన ఆటలు ఎక్కువకాలం సాగవని తెలంగాణాలోని పార్టీలు ఏకం కాకుండా కృషి చేస్తూ, ఉద్యమాన్ని వీలయినంతగా సాగదీస్తూ అదేసమయంలో సీమాంధ్రులకు తమ ప్రాంతం గురించి ఆలోచించే అవకాశం ఇచ్చినందుకు, తమ ప్రాంతాలను కూడా అభివృద్దిపరచుకొనే సువర్ణావకాశం కల్పించినందుకు భావి సీమాంధ్రులు కేసీఆర్‌కు తప్పక ధన్యవాదాలు తెలుపుకుంటారు.. కేసీఆర్ ఈ ఉద్యమాన్ని ఇలాగే ఇంకొన్నేళ్ళు నడిపిస్తే!

తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 4 - బంద్‌లు
Posted by జీడిపప్పు
మన డిమాండ్లనన్నిటినీ ఒప్పుకొని వాటిని నెరవేర్చాలని ఇతరులను ఇబ్బందులకు గురిచేసి బంద్‌లు చేయడం మనకున్న ఒకానొక ముఖ్యమయిన హక్కు. ఈ తరహాలోనే తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధులు కూడా తరచూ బంద్‌లుకు పిలుపునిస్తున్నారు. హైదరాబాదులో బంద్ ప్రకటించి జనజీవనానికి ఆటంకం కలిగించి తద్వారా కలిగే కష్టనష్టాల రూపంలో ప్రణబ్ ముఖర్జీకి తమ వాదాన్ని గట్టిగా వినిపించాలన్నది వీరి ఆలోచన.
బంద్ ముందే ఖరారు చేస్తే ఆ విషయం తెలిసిన ప్రయాణీకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఉద్యోగస్తులు కాస్త ఓవర్ టైం పని చేసి అనుకున్న సమయానికి పని పూర్తి చెయ్యడం లాంటి ముందస్తు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కోసారి చెప్పా పెట్టకుండా బందులు చేసేస్తుంటారు, హరీష్ రావు ఢిల్లీలో ఎవరినో కొట్టాడని తెలంగాణాలో బంద్ చేయడం, కేసీఆర్ కు కిక్కు దిగిన వెంటనే "ఏల్లుండి హైదరాబాదుకు ఎవర్నీ రానివ్వము" అనడం లాంటివి. ముందు ఒక తేదీ ప్రకటించి ఆ తర్వాత "మాకు జీతాలు వచ్చాక ఆ పై వారం ఫలానా తేదీ చేస్తాము" అంటారు. కొన్నాళ్ళాగి "పండగ వస్తోంది, పండగ అయిన తర్వాత సమ్మె చేస్తాము.. అపుడే హైదరాబాద్ దిగ్భంధనము" అంటారు, ఒక ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా.
ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే - బంద్‌లు వల్ల కలిగే ఇబ్బంది కంటే బంద్‌లు చేస్తున్న తీరువల్ల కలిగిన అనిశ్చితి ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. జూలై నెలలో ఏడెనిమిది రోజు బందులనీ, సమ్మెలనీ అడ్డంకులు కలిగించారు. ఆ దెబ్బకు ఆగష్టులో సగటు మనిషి హైదరాబాదుకు వెళ్ళాలంటే పలుమార్లు ఆలోచించవలసి వచ్చింది. "వెళ్ళిన తర్వాత అక్కడ బందులంటూ బస్సులను, రైళ్ళను అడ్డుకుంటే మనగతేమి?" అన్న ప్రశ్నలు ఉదయించాయి. హైదరాబాదులోని విద్యార్థుల తల్లిదండ్రులు "ఈ నెల అయినా స్కూళ్ళు సక్రమంగా నడుస్తాయా" అని ఆందోళన చెందారు. ఈ అనిశ్చితే సీమాంధ్రకు ఎంతో ఉపకారం చేస్తున్నదని నా గట్టి నమ్మకం.
ఒక ఉదాహరణ తీసుకుందాము. ఈ విద్యాసంవత్సరంలో హైదరాబాదులో దాదాపు 20 రోజులు పాఠశాలలు మూతపడ్డాయి. ఇలా జరగడం వల్ల పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఏడో తరగతి నుండే ఎంసెట్‌కు, పదోతరగతి నుండే ఐఐటీకీ తమ పిల్లలను సిద్దం చేసే పేరంట్స్ బాధ వర్ణనాతీతం. ఇక ఇంటర్ చదివే పిల్లలుండే వారి కష్టాలు చెప్పనక్కర్లేదు. ఉన్న 700 రోజుల్లో 20 రోజులు గాల్లో కలిసిపోతే సీమాంధ్ర ప్రాంతాల్లోని విద్యార్థులు 20 రోజులు ముందున్నట్టే కదా అని లెక్కలు వేసుకొని తమ పిల్లలను గుంటూరు, విజయవాడలాంటి బ్రాంచిలకు పంపిస్తున్నారు. అనధికార లెక్కల ప్రకారం గత రెండు నెలల్లో సుమారు 15 వేలమంది హైదరాబాద్ నుండి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన స్కూళ్ళలో, కాలేజీల్లో ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసారట. అన్నట్టు గత ఆరు నెలల్లో వచ్చిన పోటీ పరీక్షా ఫలితాల్లో హైదరాబాదీలకంటే సీమాంధ్రులే టాప్ ర్యాంకుల్లో ఎక్కువ ఉన్నారని అంటున్నారు! ఇది చాలా మంచి పరిణామమనిపిస్తోంది.
ఇక నా పాత్ర ఉన్న, నేను ప్రత్యక్ష సాక్షి అయిన మరో ఉదాహరణ చెబుతాను. IT కంపెనీల్లో ప్రాజెక్టులను నడిపించడానికి రకరకాల విధానాలుంటాయి. మా ప్రాజెక్టు "ఎంత పనికి అంత డబ్బులు" ప్రాతిపదికన నడుస్తుంది. అంటే, ప్రతి రోజూ ఎవరెవరు ఏమి పని చేసారో, ఎంత పని చేసారో రోజువారీ మీటింగుల్లో చెప్పి వారానికొకసారి ఆ వివరాలు ఇస్తే అందుకు తగ్గట్టు డబ్బులొస్తాయి. సగటున ఒక ఉద్యోగి వల్ల కంపెనీకి రోజుకు 8x30x45 = ~11,000 రూపాయల ఆదాయమన్నమాట.
జూలై నెల బంద్‌లు పుణ్యమా అని కేవలం మా ప్రాజెక్టుకు మాత్రమే లక్షల్లో ఆదాయం పోయింది. ఒక బిల్డింగులోని ఒక ఫ్లోరులోని ఒక సెక్షన్‌లోని ఒక టీం వల్ల రోజుకు లక్ష రూపాయల నష్టం వస్తే హైదరాబాదు బ్రాంచిలో ఎన్ని లక్షల నష్టం వస్తుందో, హైటెక్‌సిటీ మొత్తానికి ఎన్ని కోట్ల నష్టం వస్తుందో ఊహించుకోండి!! ( ఒక్క రోజు ఎవరూ పని చెయ్యకుంటే హైదరాబాదులోని కంపెనీలకు, ఫ్యాక్టరీలకు సుమారు 500 కోట్ల నష్టం వస్తుందట. ఆఫ్కోర్స్, దీర్ఘకాలిక ప్రయోజనాల్లో ఇటువంటి తాత్కాలిక నష్టాలు తప్పవు కదా.)
ఈ బందుల గురించి ఇండియాలోని మేనేజర్లకు తెలుసు కానీ అమెరికన్లకో లండనోళ్ళకో తెలియదు కదా? పని కాకపోవడంతో వాళ్ళు అసహనం వ్యక్తం చేసి అక్కడున్న వాళ్ళను తోమితే వాళ్ళు ఇక్కడున్న మేనేజర్లను "ఇన్ని లక్షలు నష్టమొస్తే ఎలా? మీ ఇష్టమొచ్చింది చేసుకోండి, మాకు మాత్రం billing & delivery ముఖ్యం. కావాలంటే ఇంకో సిటీలోని మన ఆఫీసునుండి పని చెయ్యండి" అంటూ చితక్కొడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా టీం మొత్తం హైదరాబాదునుండి మారడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. "హైదరాబాదు టీం ఇన్వాల్వ్ అయిఉంటే అనుకున్న తేదీకి డెలివరీ చేస్తామన్న గ్యారెంటీ లేదు కాబట్టి కనీసం ఇంకో వారం buffer కావాలి" అని నేను చెప్తుంటా. ఇపుడిపుడే అన్ని కంపెనీలవారు ఈ విషయం పైన దృష్టి సారిస్తున్నారు.
దీనివల్ల సీమాంధ్రకు లాభమేమిటి అంటే.. వైజాగ్ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులు, మరిన్ని దేశీయ సర్వీసులు మొదలుకాబోతున్నాయన్న వార్త చూసారా? దీనికి ప్రధాన కారణం - పెట్టుబడులు పెరగడమే. ఇప్పటికే కొన్ని కంపెనీలు హైదరాబాదునుండి వైజాగ్ కు తమ కార్యకలాపాలను తరలిస్తున్నాయి. తొందర్లో తిరుపతి ఏయిర్పోర్ట్ కూడా ఆధునీకరించబోతున్నారు. సీమాంధ్ర సెజ్ లలోకి రావడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పరిశ్రమలవారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికిపుడే కాకపోయినా మున్ముందు ఇవి మరింత అభివృద్ది చెందుతాయనడంలో సందేహం లేదు. అందుకు కావలసినది "సీమాంధ్రులు తమ ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెట్టడం". అలా జరగడానికి, సీమాంధ్రుల దృష్టి హైదరాబాదు నుండి కొంతయినా మళ్ళించడానికి ఈ బంద్‌లు, అనిశ్చితి తమవంతు సహరాన్ని అందిస్తున్నాయనే చెప్పవచ్చు. అందుకే ఈ ఉద్యమం ఇంకో పదిహేనేళ్ళు కొనసాగాలని నా కోరిక.