తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 3 - తెలబాన్లు
Posted by జీడిపప్పు
తెలంగాణా ఉద్యమం మొదలయిన కొన్నాళ్ళకు 'దుశ్చర్యలు, ఆగడాలు, దౌర్జన్యాలు, ఉన్మాద చర్యలు ' లాంటి మాటలు తరచుగా వినపడేవి. ఇవన్నీ అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న మాటలు. ఈ మాటలకు భిన్నంగా 'తెలబాన్లు ' అనే ఒక కొత్త పదం పుట్టుకొచ్చి అందరి నోళ్ళలో నానుతోంది. ఈ పదం పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకొనే క్రమంలో రెండో దశ తెలంగాణా ఉద్యమ ఆవిర్భావం గురించి ఒకసారి మననం చేసుకుందాము.
మద్రాసు రాష్ట్రం నుండి విడిపడిన కొన్నేళ్ళకు తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి మొదలయింది కానీ అప్పటి కాంగ్రెసు నాయకులు దాన్ని ఉద్యమరూపం దాల్చనివ్వలేదు. తెలుగుదేశం నుండి బయటకు వచ్చాక కేసీఆర్ ఈ ఉద్యమాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేసాడు. అప్పటినుండి తెలంగాణా వాసులు "ఎన్నాళ్ళీ కట్టు బానిసత్వం? ఎన్నేళ్ళీ నిరంకుశత్వ పాలన? ఈ వెట్టి చాకిరీ మనమెందుకు చేయాలి? ఈ బానిస బ్రతుకుల నుండి విమోచన కావాలి" అంటూ ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించసాగారు.
ఈ ఉద్యమానికి రూపకర్త కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు. తెలంగాణా సిద్దాంత కర్త, తెలంగాణా జాతిపిత అయిన కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు ఉద్యమ పంథాను వివరిస్తూ "ఏనాటికయినా మనం తెలంగాణాను సాధించుకోవాలి. అందుకు ఎన్నో మార్గాలున్నాయి కానీ మనము గాంధీమార్గమే ఎంచుకోవాలి. ఎన్నడూ ఇతరులను నొప్పించకూడదు. అహింస ద్వారా తెలంగాణాను సాధించుకొని గాంధీమార్గాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పి తెలంగాణా ప్రజలే అసలు సిసలయిన గాంధీ వారసులు అని నిరూపించాలి" అన్నారు.
అమాయకులయిన తెలంగాణా ప్రజలు కీ.శే|| ప్రొ.జయశంకర్ గారుచెప్పినట్టే నడుచుకోవడం మొదలు పెట్టారు. "మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి చాలు. అన్నదమ్ముల్లా విడిపోదాము" అంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో వీరి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని కొన్ని దుష్టశక్తులు ఉద్యమంలో చాపకింద నీరులా ప్రవేశించాయి. "సీమాంధ్రులను తరిమి కొట్టండి, నాలుకలు చీరేస్తాం, తలలు నరికేస్తాం" అంటూ అమాయకులయిన తెలంగాణా ప్రజలను రెచ్చకొట్టి పెడత్రోవ పట్టించాయి.
అప్పటికీ మెజారిటీ తెలంగాణా వాసులు "ఇలా తోటివారి పైనే దాడులకు దిగడం మంచిది కాదు" అంటున్నా, అతి కొద్దిశాతం ఉన్న ఈ ముష్కురులు వారి మాటలను ఖాతరు చెయ్యక దాడులకు దిగారు. "ఆంధ్రా మెస్" అని బోర్డు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వారిపైన దాడులు చేసి మెస్ అంతా ధ్వంసం చేయడం, సీమాంధ్రులు అని తెలిస్తే వారి కార్ల అద్దాలు పగలకొట్టడం, ఇక అతి నీచాతినీచంగా పరీక్ష పేపర్లు దిద్దను వచ్చిన గురువులను తరిమి కొట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డారు.
అప్పటివరకు ఇలాంటి దేశద్రోహ చర్యలు చేస్తున్నవారిని "అల్లరి మూకలు, గూండాలు, ఉన్మాదులు" అని పిలిచేవాళ్ళు కానీ ఆ పదాలేవీ వీరి చేష్టలకు సరిపోలేదు. పదివేలమందితో పదిలక్షలమంది మార్చ్ నిర్వహించిన రోజున ట్యాంక్‌బండ్ పైన విగ్రహాలను కూల్చినపుడు వీరికి "తెలబాన్లు" అన్న పేరు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో బుద్ద విగ్రహాలను నాశనం చేసి తాలిబాన్లు ఏ విధంగా (అన్)పాపులర్ అయ్యారో, ఈ కొద్దిమంది ముష్కురులు కూడా విగ్రహాలను ధ్వంసం చేసి తెలబాన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఫ్‌కోర్స్, ఆ వీడియో క్లిప్పింగులు అన్నీ కేంద్రానికి పంపించి "ఇదీ వీళ్ళు చేస్తున్నది, మున్ముందు చేయబోయేది" అంటూ నివేదిక ఇచ్చింది ఇంటెలిజెన్స్.
తెలబాన్ల ప్రస్తావన వచ్చినపుడల్లా వినిపించే మరో పదం "ఉస్మానియా". ఈ ఉద్యమానికి ముఖ్యకేంద్రంగా నిలిచిన ఉస్మానియాలో కూడా కొందరు ముష్కురులు ప్రవేశించి బస్సులను తగులబెట్టడం, షో రూముల పైన రాళ్ళు రువ్వి అద్దాలు పగలకొట్టడం లాంటి చర్యలతో 'ఉన్మాదియా' అన్న చెడ్డపేరు తెచ్చారు. ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్ అపుడెపుడో అమెరికా అధికారితో "ఈ ఉస్మానియా విద్యార్థుల్లో మెరిట్ స్టూడెంట్స్ ఎవరూ ఉద్యమంలో పాల్గొనడం లేదు, అంతా 30 ఏళ్ళకు పైబడినవారే" అన్నాడట. వీడియోల్లో చూస్తే ఎంతవరకు నమ్మశక్యమో తెలుస్తుంది.
ఉద్యమంలో పాల్గొనందుకు JNTU విద్యార్థుల పైన ఈ ఉస్మానియా విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. "ఈ JNTU లో ఉంటున్న తెలంగాణాలో పుట్టినవారు కూడా ఉద్యమంలో పాల్గొనడం లేదు. ఎప్పుడూ మెరిట్లో పాసవ్వాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఏ అమెరికాకో వెళ్ళాలి లేదా ఐటీ కంపెనీల్లో చేరి ఏసీ రూముల్లో నిద్రపోవాలి, ఇల్లు కారు కొనాలి అనుకుంటున్నారే తప్ప తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం గురించి ఏనాడయినా పట్టించుకున్నారా? మేము మా చదువులను పక్కనబెట్టి భవిష్యత్తును ఫణంగా పెట్టి చేస్తున్న పోరాటంలో ఎందుకు పాల్గొనడం లేదు? వీరంతా తెలంగాణా ద్రోహులే" అన్నారు. ఇది ఆలోచింపదగ్గ విషయమే.
మళ్ళీ తెలబాన్ల విషయానికొస్తే - కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు చెప్పినట్టు అహింసామార్గంలో పోరాటం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేదో కానీ, తెలబాన్ల ప్రవేశముతో సీన్ మారిపోయింది. సీమాంధ్రుల ఆస్తుల పైన దాడులు చేయడం, మామూళ్ళకు పాల్పడడం, ఇష్టమొచ్చినపుడు బందులు చెయ్యడం, రోజువారీ జీవితానికి ఆటంకం కలిగించడంతో హైదరాబాదులో వ్యాపారం చేసేవాళ్ళకు, హైదరాబాదుకు వెళ్ళాలనుకొనే వారికి అనిశ్చితి, ఆందోళన కలగడం మొదలయింది. తను సీమంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలబాన్లకు తెలిస్తే బెదిరింపులకు దిగరని, మామూళ్ళు అడగరని ఏ సీమాంధ్ర వ్యాపారికి కూడా నమ్మకం లేదు.
నేను ఈ తెలబాన్ల దుశ్చర్యలను పూర్తిగా ఖండిస్తాను కానీ గమనించదగ్గ విషయం ఏమిటంటే, లోపాయకారంగా వీరి దుశ్చర్యలవల్ల ఈ రోజు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలంటే కొందరు జంకుతూ మరో మార్గం చూసుకోవడం మొదలుపెట్టారు. పెట్టుబడుల సంగతి పక్కనపెడితే, హైదరాబాదుకు బస్సులోనో రైల్లోనో వెళ్ళాలన్నా "ఎప్పుడు బంద్ అంటారో, ఎప్పుడు తిరిగివస్తామో" అని ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మొదలుపెట్టారు. (ఈ బందుల గురించి మరో టపాలో!) ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. "ఏ నాటికయినా తెలబాన్ల నుండి తలనొప్పి తప్పదు" అనుకున్నాడేమో, ప్రముఖ నిర్మాత రామానాయుడుగారు వైజాగ్‌లో ఒక సినీ స్టూడియో నిర్మించారు. ఆ స్టూడియో ఎంత సౌకర్యంగా ఉందో హాస్యనటుడు ఏవీయస్ గారు తన బ్లాగులో వివరించారు.
హైదరాబాదులో ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నా (ఒక్క నితిన్ సినిమా తప్ప) అక్కడ వెంటనే తెలబాన్లు ప్రత్యక్షమవుతారు. సినిమా రిలీజ్ ముందు నానా గొడవచేసి డబ్బులు గుంజడం, మహేష్‌బాబు కారు పైన దాడి చేయడం, గీతా ఆర్ట్స్ ఆఫీసు పైన రాళ్ళు రువ్వడం, కొన్ని లక్షల విలువయిన సెట్టు తగలపెట్టడం లాంటి ఉన్మాద చేష్టలను చూసి కోట్లలో ఖర్చుపెట్టే నిర్మాతలు ఇపుడిపుడే మరోదిక్కు వైపు చూడడం మొదలుపెట్టారు. వైజాగ్‌లో ఈ స్టూడియో వల్ల కొన్ని వందల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఇది కేవలం ప్రారంభమే కాబట్టి మున్ముందు రామానాయుడుగారిని ఆదర్శంగా తీసుకొని మరింతమంది తమ పెట్టుబడులను సీమాంధ్రకు మళ్ళించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.
ఈ ఉద్యమం ఇలాగే ఇంకో పది-పదిహేనేళ్ళు కొనసాగితే సీమాంధ్ర వ్యాపారవేత్తలు ఎటువంటి నష్టాలకు గురి కాకుండా హైదరాబాదులో పెట్టుబడులు తగ్గిస్తూ తమప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ది చేస్తారేమో అనిపిస్తుంది. తెలంగాణా వాదులు కోరుకుంటున్నదీ ఇదే కదా మరి!! (సశేషం)
తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 2 - మేలుకొలుపు
Posted by జీడిపప్పు
ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి లక్షణాలున్నట్టే నాలోనూ కొన్ని మంచి లక్షణాలున్నాయి. అందులో ఒకానొకటి Knowledge Sharing. నా కెరీర్ ప్రారంభంలో ఒక పుణ్యాత్ముడు దగ్గరుండి మరీ నాకు పని నేర్పించి అత్యవసర సమయాల్లో ఆపద్భాంధవుడిలా ఆదుకొని "మనము నేర్చుకున్నది ఇంకొకరికి చెబితే మనకే చాలా మంచింది. ముఖ్యంగా అంత ట్యాలెంట్ లేనివాళ్ళకు వీలయినంత సహాయం చేయ్యాలి" అన్న సత్యాలను తెలియజెప్పాడు. నేను నేర్చుకున్నది ఎంతో కొంత అయినా వీలయినంత వరకు దాన్ని ఇతరులతో పంచుకోవడం ఇప్పటికీ పాటిస్తున్నాను.
ఇక విషయానికొస్తే - ఒకానొక ఉద్యోగంలో నాకంటే సీనియర్ అయిన వాడికంటే నేను కాస్త ముందుండే వాడిని. ఏదో గుడ్డిగా పనిచేయడం తప్ప వీడికి ఎక్కువ ట్యాలెంట్ లేదు. ఎవరినయినా టీం నుండి తీసేయాలి అనుకుంటే అందులో మొదటిపేరు వీడిదే ఉంటుంది. మా మేనేజరు మంచివాడు కాబట్టి, టీంలో అందరూ దేశీలే కాబట్టి ఎలాగో నెట్టుకొచ్చేవాడు. కేవలం టెక్నికల్ హెల్ప్ మాత్రమే కాకుండా చాలాసార్లు 'ఎలా మాట్లాడాలి, ఎలా ఈమెయిల్ వ్రాయాలి ' అని నాకు తెలిసినంతలో సహాయం చేసేవాడిని. కొన్నాళ్ళకు నేను ఇంకో ప్రాజెక్టులోకి వెళ్ళినా అపుడపుడు కలుస్తూ మాట్లాడుకొనేవాళ్ళము.
అప్పటివరకు వీడికి నేనంటే కాస్త అభిమానముతో పాటు గౌరవము కూడా ఉండేవి అనుకుంటా. కానీ ఉన్నట్టుండి ఏమయిందో ఏమో కానీ నాతో పాటు మరో ఇద్దరితో సరిగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు లంచ్ చేస్తూ మాట్లాడుకుంటుంటే "మీ వల్లే మా తెలంగాణా ఇలా అయిపోతోంది" అన్నాడు. తెలంగాణాకు మాకు ఏమి సంబంధమో అర్థం కాలేదు. అదేంటని అడిగితే "మీ సీమాంధ్రవాళ్ళు పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ చుట్టూ రియల్ఎస్టేట్ రేట్లు పెంచేసారు. మామూలుగా అయితే 20 లక్షలకు మంచి అపార్ట్మెంట్ వచ్చేది. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటుంటే 30 లక్షలకు తక్కువలో లేవు. కూకట్‌పల్లి తర్వాత అంతా మీరే కదా, తెలంగాణా వచ్చేస్తే 20 లక్షలకే అపార్ట్మెంట్ వస్తుంది" అన్నాడు. వాడు చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు నిజమే అనిపించి ఏమి చెప్పాలో తెలియక నవ్వి ఊరుకున్నా.
వీడు చెప్పినదానిలో అంతా నిజమే అనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ నేనే. 2002 లో అనుకుంటా - తెలిసిన వాళ్ళు హైదరాబాదులో అపార్ట్మెంట్ కొన్నారు. అది విని నేను కూడా వీలయినంత తొందరగా హైదరాబాదులో అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నాను. నాలాగే సీమాంధ్రలోని ఎందరో "హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ కొనాలి" అనుకొనేవారు. ఇహ ఎన్నారైల సంగతయితే చెప్పనక్కర్లేదు!! ప్రతి Pot luck లో, ప్రతి గెట్-టుగెదర్ లో ఈ "రియల్" మాటలే ప్రధాన చర్చలుగా ఉండేవి. తత్ఫలితమే హైదరాబాదు శివార్లలో స్థల, ఇళ్ళ రేట్లు ఆకాశాన్నంటడం మొదలుపెట్టాయి.
సీమాంధ్రులు మరెక్కడా స్థలాలు లేవన్నట్టు హైదరాబాదులో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టి రేట్లను అలా పెంచకుండా ఉండి ఉంటే ఈ రోజు సగటు తెలంగాణా మధ్య తరగతి వ్యక్తికి అన్నీ అందుబాటులో ఉండేవి. కానీ అలా జరగలేదు, పరిస్థితి చేజారిపోయింది. ఇక జరుగవలసినది ఏమయినా ఉందా అంటే - తెలంగాణా రావడం. ఎప్పుడయితే తెలంగాణా వస్తుందో, అప్పుడు సీమాంధ్రులు హైదరాబాదు నుండి తమ దృష్టి మరల్చి తమ ప్రాంతాలకు చెందిన రాజధానుల్లో లేదా ప్రముఖ పట్టణాలలో పెట్టుబడులు పెడతారు, తద్వారా హైదరాబాదులో మళ్ళీ రియల్ ఎస్టేట్ బూం తగ్గి, చౌకగా అపార్ట్మెంట్లు వస్తాయి.
నా మిత్రుడి భావన కూడా సరిగ్గా ఇదే. కాకపోతే వాడు సగటు ఆక్రోశ తెలంగాణా వాసి వలే "మీరు వీళ్ళిపోతే మాకు అన్నీ చీప్" అన్నాడు. వీడన్న మరో మాట - "మీరొచ్చి మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు". ఇది విని ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇదే మాట హైదరాబాదు రోడ్లపైన తిరిగే నిరుద్యోగి అన్నా పర్లేదు కానీ పొట్ట చేతబట్టుకొని అమెరికాకు వచ్చి ఎన్నొ కష్టాలు పడి ఉద్యోగం సంపాదించి ఎలాగో దాన్ని నిలబెట్టుకొని, అవసరమయితే అమెరికన్ల ఉద్యోగాలు ఊడిపోయేలా జాగ్రత్తపడి, అమెరికాలో బ్రతికే వీడు అనడమే వింతగా తోచింది. వీడేమో అమెరికాకొచ్చి సంపాదించవచ్చు కానీ సీమాంధ్రులు హైదరాబాదులో మాత్రం ఉద్యోగం చెయ్యకూడదు. హన్నన్నా!!
అప్పటివరకు సాటి తెలుగువాడిగా వీడి పట్ల ఉన్న భావాలు కాస్తా తుడిచిపెట్టుకుపోయాయి. నేనేమయినా తెలంగాణా రాకుండా అడ్డుకుంటున్నానా? అసలు నేనేటి నా సత్తా ఏమిటి? బ్రతుకుదెరువుకోసం అమెరికాకు వచ్చిన వాళ్ళను పట్టుకొని "మీ వల్లే" అంటే ఏమన్నా ఉపయోగం, అర్థం ఉందా? వాడి అపార్ట్మెంట్ ఏడుపు వాడికి ఉండొచ్చుగాక, అందుకు మమ్మల్ని నిదించడం ఏంటో, అదీ అమెరికాలో!! అందునా ఒకప్పుడు నా దగ్గ్గర నేర్చుకొని నావల్ల వీడికి నష్టం జరుగుతున్నట్టు మాట్లాడుతుటే ఆ సమయంలో "నీతిలేని #$%^&^" అనుకున్నా కానీ ఇప్పుడయితే అలాంటి పరుషపదజాలం వాడకుండా సింపుల్ గా "మెగాస్టార్ చిరంజీవిలా దిగజారిపోయావురా" అనేవాడిని.
రాష్ట్రాన్ని విభజించకూడదు అన్న ఆలోచన పక్కనబెట్టి వాడు చెప్పిదాని గురించి ఆలోచిస్తే ఒక కొత్త లాజిక్ కనిపించింది. తెలంగాణా అంత అభివృద్ది చెందడానికి సీమాంధ్రుల పెట్టుబడులు కూడా ప్రధాన ఒకకారణం కదా. ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే ఆ పెట్టుబడులేవో తమ ఊళ్ళలోనో చుట్టుపక్కలో పెడతారు, అపుడు సీమాంధ్రప్రాంతాలు కూడా ఇంకా అభివృద్ది చెందుతాయి. ఇదొక్కటే కాకుండా వాడు చెప్పినట్టు తెలంగాణా వస్తే ఇప్పుడు 30 లక్షలున్న అపార్ట్మెంట్ 20 లక్షలకే వస్తుందన్నమాట. అంటే హైదరాబాదులో 20 లక్షలకే ఒక ఇల్లు కొనుక్కోవచ్చు!
ఇదే మాట వాడితో అన్నాను "అంటే, తెలంగాణా వచ్చేస్తే అక్కడ రేట్లు తగ్గుతాయి కదా, నువ్వు తొందరగా ఇల్లు కొనుక్కోవచ్చు కదా" అని. అవునన్నాడు. "అలా అయితే నేను కూడా ఒకటి కొంటాను, జై తెలంగాణా" అన్నాను. దిమ్మ తిరగడం వాడివంతయింది! అదేంటి అన్నాడు - "అంతే కదా మరి, తెలంగాణా వస్తే రేట్లు తగ్గుతాయి అన్నావు కదా నువ్వే. ఏదయినా కొనడానికి అదే రైట్ టైం. ఆ టైంలో కొంటే చీప్‌గా వస్తాయని నువ్వే అన్నావుగా.. అప్పుడు నేనేటి, చాలామంది సీమాంధ్రులు కొంటారు" అన్నాను. ఇప్పటికీ వాడితో అంటుంటా "తెలంగాణా వచ్చిన వెంటనే రేట్లు తగ్గుతాయి, అపుడు కొంటే లాంగ్ టర్మ్ లో చాలా ప్రాఫిట్" అని.
ప్రస్తుత పరిణామాలు చూస్తే - తెలంగాణా ఉద్యమం ఊపందుకోవడంతో సీమాంధ్రుల పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. గత రెండేళ్ళలో సీమాంధ్రలోని పట్టణాల్లో చాలా చోట్ల కొత్త లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఎప్పటికయినా హైదరాబాదులో ఇల్లు కావాలనుకొనేవారు "ఇప్పుడే హైదరాబాదులో ఎందుకులే, ముందు మనూళ్ళో కొందాము" అంటూ ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారు. ఎవరో రాజకీయనాయకుడు "రాష్ట్రం విడిపోతే మాకు లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి" అన్నాడు. లక్ష కోట్లు ఇవ్వడం కంటే లక్షమంది సీమాంధ్రులు తమ ప్రాంతాల్లోనే తమ పెట్టుబడులు పెట్టి అభివృద్దిలో పాలుపంచుకోవడం చాలా ముఖ్యం.
అందుకే ఈ ఉద్యమం ఇలాగే ఇంకో పది పదిహేనేళ్ళు సాగుతూ ఉండాలి. అప్పటికి హైదరాబాదులో పెట్టుబడులు తగ్గుతూ సీమాంధ్రలో పెరుగుతూ ఉంటాయి అని నా అభిప్రాయం మరియు ఆశ. తెలంగాణావాదులు కోరుకుంటున్నదీ ఇదే కదా మరి!!! (సశేషం)

తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 1
Posted by జీడిపప్పు
ప్రత్యేక తెలంగాణా - గత రెండేళ్ళనుండి దాదాపు అందరు తెలుగువాళ్ళ నోట నానుతున్న మాట ఇది. రాష్ట్రంలో పాలనను అస్తవ్యస్తం చేసి ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ను "అయోమయ ప్రదేశ్" స్థితికి తీసుకొచ్చి, "అంధ ప్రదేశ్" వైపు పరుగులు తీయిస్తున్న ఈ సున్నిత అంశం గురించి బ్లాగుల్లో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా ఎన్నో వ్యాసాలొచ్చాయి. తెలంగాణా ఇస్తారా ఇవ్వరా? ఎందుకు తెలంగాణా ఇవ్వాలి? ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే లాభనష్టాలేంటి? అంటూ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు విశ్లేషిస్తున్నారు.. నీటుగా, ఘాటుగా, నాటుగా.
ఈ బ్లాగుల్లోని పోస్టులు చదువుతున్నపుడు నా అభిప్రాయాలు కూడా చెప్పాలనిపించేది కానీ సమయం, ఓపిక లేక దాటవేయవలసి వచ్చింది. నా అభిప్రాయాన్ని కూడా భద్రపరిస్తే ఓ పదేళ్ళ తర్వాత ఓ సాయంత్రం వేడి వేడి మిర్చి బజ్జీ తింటూ నా ప్రస్తుత ఆలోచనలను చూసి నెమరు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించి వ్రాయడానికి ఉపక్రమించాను.
తెలంగాణా విషయంలో బ్లాగుల్లోని టపాల్లో లేదా వ్యాఖ్యల్లో దాదాపు ప్రతి ఒక్కరి అభిప్రాయమూ 1) తెలంగాణా ఇవ్వాలి అనో లేదా 2) సమైక్యాంధ్ర గా ఉండాలి అనో ఉంది. నాది ఈ రెండింటి కలయిక మరియు సవరణ అయిన అభిప్రాయం. అది - 3) తెలంగాణాను కొన్నేళ్ళ తర్వాత (2025 అయితే బాగుంటుంది) ఇస్తూ, రాష్ట్రాన్ని రెండు భాగాలుగా కాకుండా మూడు భాగాలుగా విభజించాలి.. ముందు ముందు మళ్ళీ ఇలాంటి గొడవలు తలెత్తకుండా.
ఇక వివరాల్లోకి వద్దాము. ముందుగా, తెలంగాణా విభజనకు నేను పూర్తిగా సానుకూలం. ఇందుకు పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యమయింది "జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం". 2-3 కోట్ల మంది జనాభాకు ఒక రాష్ట్రం ఉంటే పరిపాలన మరింత సులభతరం అవుతుంది. ఎనిమిది కోట్లమంది (తొందర్లో పదికోట్ల మంది) బాగోగులు చూడ్డానికి ఒకే మంత్రి, ఒకే శాఖ ఉంటే పరిపాలన అంత సులభం కాదన్నది నా అభిప్రాయం.
మరో కారణం - హైదరాబాదుతో పోలిస్తే సీమాంధ్ర అంతగా అభివృద్ది చెందకపోవడం.
అందరూ పెట్టుబడులు హైదరాబాదు చుట్టూ పెట్టడంతో అదేమో రాకెట్ స్పీడులో డెవలప్ అయింది కానీ సీమాంధ్ర ప్రాంతాలు ఆస్థాయిలో అభివృద్దికి నోచుకోలేదు. "రాష్ట్రానికి 70% ఆదాయం హైదరాబాదు నుండే వస్తోంది కాబట్టి విడిపోతే మన ప్రాంతాలు అభివృద్ది చెందడమెలా" అంటారు సమైక్యవాదులు. నిజమే, ప్రస్తుతానికి హైదరాబాదే మూలాధారం కానీ ఇలా ఎన్నేళ్ళు? గత 20 యేళ్ళలో హైదరబాదు నూటపాతిక మైళ్ళ వేగంతో దూసుకెళ్తుంటే సీమాంధ్ర మాత్రం మహా అయితే ఓ పాతిక మైళ్ళ వేగంతో అభివృద్ది చెందుతోంది. ప్రతిదానికి చకోర పక్షుల్లా హైదరాబాదు వైపే చూస్తుంటే ఇంకో ఐదు దశాబ్దాలయినా సీమాంధ్ర ప్రాంతాలు ఇలాగే ఉండిపోతాయి. అందుకే సీమాంధ్ర ప్రాంతానికి ఈ తెలంగాణా ఉద్యమం ఒక Blessing in disguise అనిపిస్తుంది.
ఇక జరుగుతున్న ఉద్యమానికొస్తే - తెలంగాణా కావాలని కోరడం వరకు పరవాలేదు కానీ కొందరు తెలంగాణావాదుల పద్దతే చిరాకు, కోపం, అసహ్యం కలిగిస్తున్నాయి. తెలుగుదేశం నుండి బయటకొచ్చాక అప్పటి రాజకీయ నిరుద్యోగి అయిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టినపుడు ఒక సగటు తెలుగువాడిగా "రాష్ట్రాన్ని విభజించడమా? కుదరదంటే కుదరదు. తెలుగు వారందరూ ఎప్పటికీ సమైక్యంగానే ఉండాలి" అనుకొంటూ తెలంగాణాను వ్యతిరేకించేవాడిని. వైయస్సార్ ఉన్నన్నాళ్ళూ కేసీఆర్ కు కొన్ని బిస్కట్లు పడేస్తూ నోరుమూయించాడు కానీ వైయస్సార్ మరణం తర్వాత కేసీఆర్ విజృంభణ ఎక్కువయింది. కేసీఆర్ "తెలంగాణా జాగో ఆంధ్రావాలా భాగో" "నాలుకలు చీరేస్తాం" "సీమాంధ్రులను తరిమి కొట్టండి" "దోపిడీదారులు" అనడంతో అప్పటివరకు తెలంగాణా వాదాన్ని ఉద్యమంగా చూస్తున్న నాబోటివారు కాస్తా "ఇది కేవలం ఉద్యమమే కాదు, ఉన్మాదం కూడా" అనుకోనారంభించారు.
ఎప్పుడయితే తెలంగాణా వాదులు వ్యక్తిగత దాడులకు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడడం మొదలు పెట్టారో "ఈ ఉన్మాదులతో కలిసి ఉండడం అవసరమా" అనిపించడం మొదలయింది. అప్పటివరకు తెలంగాణా ఇస్తే హైదరాబాద్ పోతుంది, మన ప్రాంత అభివృద్ది ఎలా అనుకొనే ఆలోచనలు కాస్త "ఒకవేళ హైదరాబాదు పోతే మన ప్రాంతాలు అభివృద్ది కాలేవా? హైదరాబాదులో సీమాంధ్ర పెట్టుబడిదార్లు ఎక్కువ అవుతున్నారు అనే కదా తెలంగాణావాదుల్లోని కొందరి ఆరోపణ. మరి ఆ సీమాంధ్ర పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను తమ ప్రాంతాల్లో పెడితే సరిపోతుంది కదా" అనిపించేది.
ఇక తెలంగాణా ఇస్తే 2025 లో ఇవ్వాలి అని ఎందుకంటున్నానో, ప్రస్తుతం జరుతున్న పరిణామాలు ఇలాగే మరికొన్నేళ్ళు కొనసాగితే సీమాంధ్రకు ఏ విధంగా లబ్ది చేకూరుతుందని ఆశిస్తున్నానో రాబోవు టపాల్లో పంచుకుంటాను (సశేషం)