ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ Status Report
Posted by జీడిపప్పు
ఎంత చిన్న పని అయినా ఆ పని ఎవరు ఎప్పుడు మొదలుపెట్టాలి, ఆ పని ఎంత శ్రమతో కూడుకున్నది, ఎప్పటిలోపు ముగించాలి మొదలయిన వివరాలతో దానికోసం ఒక task సృష్టించి వారానికోసారి టీం మెంబర్స్ అందరి status reports పరిశీలించి ఆ వారంలో ఏమి జరిగిందో అన్నీ తెలుసుకొని తన పైవారికి వివరాలను అందజేయడం టీం లీడర్ బాధ్యత. ఈ status report పుణ్యమా అని టీం మెంబర్స్ ఎవరూ పని చేయకుండా తప్పించుకోలేరు. బద్దకంతో తప్పులు చేస్తే task లోని వివరాలవల్ల పట్టుబడిపోతారు. మేనేజ్‌మెంటుకు కూడా నిర్వహణ చాలా సులభమవుతుంది.
పదిమంది ఉద్యోగులున్న చిన్న కంపెనీ కూడా ఈ స్టేటస్ రిపోర్ట్ల పైన ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నపుడు లక్షలమందికి ప్రతినిధులయిన రాజకీయనాయకులు నెల నెలా (వారానికి వద్దులే!) తాము చేసిన "ప్రజాసేవ" వివరాలను తెలుపుతూ ఎందుకు తమ స్టేటస్ రిపోర్ట్ విడుదల చెయ్యరు? ఇప్పటికే ప్రజలకు నాయకులపైన నమ్మకం పోయింది. కనీసం ప్రజలు నమ్ముతున్న జయప్రకాష్ నారాయణ గారిలాంటి వారు అయినా ఇకనుండి నెల నెలా తాము ఏమి చేసారో వివరాలు తెలిపితే ప్రజల్లో నాయకులపట్ల మళ్ళీ నమ్మకం కలుగుతుంది.
మూడు నెలల క్రితం కూకట్‌పల్లినుండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన జేపీగారు ఒక్క ఎమ్మెల్యే తలుచుకుంటే ఒక ఊరి స్వరూపాన్ని ఎలా మార్చగలడో చూపించగల సత్తా ఉన్నవాడు. గత మూడు నెలలుగా తన నియోజకవర్గంలో ఏమి చేసాడో ఇప్పటివరకూ చాలామందికి తెలియదు. ఆయన ప్రజాసేవ చేయడం గురించి పత్రికల్లో రావడం లేదు. బహుశా ఇది మీడియా కుట్ర కావచ్చు. ఒక ఎమ్మెల్యే చేసిన, చేయవలసిన మరియు చేయదగిన పనులను క్రోడీకరిస్తే జేపీగారి స్టేటస్ రిపోర్ట్ ఇలా ఉంటుంది. (గత మూడు నెలల్లో జేపీగారు చేసిన ప్రజాసేవ వివరాలను కామెంట్ల రూపంలో తెలిపితే క్రింది వివరాలు update చేయబడుతాయి.)
సంగ్రహం
ప్రజలనుండి స్వీకరించిన మొత్తం సమస్యలు: 0
పరిష్కరించిన సమస్యలు: 0
పురోగతిలో ఉన్న సమస్యలు: 0
మిగిలినవి: 0
వివరాలు
వైద్యరంగం
1) తనిఖీ చేసిన ఆస్పత్రులు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0
విద్యారంగం
1) తనిఖీ చేసిన పాఠశాలలు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0
ఇతరములు
1) పర్యటించిన మురికివాడలు: 0
2) పరిష్కరించిన మంచి నీటి సమస్యలు: 0
3) తనిఖీ చేసిన చౌక దుకాణాలు: 0
4) తనిఖీ చేసిన ప్రభుత్వ కార్యాలయాలు: 0
5) అవినీతి అధికారుల పైన తీసుకున్న చర్యలు: 0
6) అవినీతిని నిరోధించుటకు చేసిన ప్రయత్నాలు: 0
పత్రికలు చేయలేని పనిని బాధ్యతగల పౌరులుగా మనము చేసి ఇకనుండి ప్రతినెలా మొదటివారంలో గతనెల జేపీగారు చేసిన పనుల వివరాలను ఈ స్టేటస్ రిపోర్ట్ రూపంలో తెలుసుకుంటూ అందరికీ తెలియజేద్దాము.
August 3, 2009 at 10:14 PM
idea baane undi kaanee, ee vivaraalannee manaku evaru istaaru cheppu?
August 3, 2009 at 11:48 PM
ఈ విషయాలన్నీ www.loksatta.org సైటు లో బద్రపరిస్తే సంతోషిస్తాము.
August 4, 2009 at 12:51 AM
మంచి ఆలోచనే ! ఈ విషయం నేరుగా ఆయనకే మెయిల్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉండొచ్చు .
August 4, 2009 at 1:23 AM
ఆ వివరాలు సులభంగానే సంపాదించవచ్చు .......ఏదో అద్భతమైన మార్పు ఊహిస్తున్నారా ....ప్చ్
August 4, 2009 at 4:12 AM
మంచి ఆలోచన
August 4, 2009 at 4:52 AM
మన దేశరాజకీయాలలో అంత ప్రొఫెషనలిజమా?
అలా అయితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది.
August 4, 2009 at 5:21 AM
'chanDAlIkarinchaDam' totta pada prayOgam... eskO IratADu
August 4, 2009 at 6:28 AM
JP's email ID - Any one ?
fantastic. I heard Sashi Throor can be reached thro twitter. Dr.APJ can be mailed. Is it true ?
August 4, 2009 at 7:42 AM
:-)!
http://news.loksatta.org/.....have a look!
August 4, 2009 at 9:40 AM
చాల మంచి ఆలోచన ! కాని మీ పోస్టు చదవగానే నాకు ఇంతకు ముందు చంద్రబాబు గారు సి.ఎం గా ఉన్నప్పుడు "Performance Indicators" అనే ప్రోగ్రాం ఒకటి ఉండేది అది గుర్తుకు వచ్చింది. దాని తో కొద్దో గొప్పో ఉపయోగం ఉన్నప్పటికీ ఆ లెక్కలు ఆ equations తలుచుకొంటే నాకు ఇప్పటి కి నవ్వు వస్తుంది, వాటిని కాకి లెక్కలు అని నవ్వుకునే వాళ్ళం (నేను అక్కడ కొద్ది రోజులు ఉద్యోగం వెలగబెట్టా) .
కాని మార్పు అనేది ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి దాన్ని చూసి మరికొంత మంది అనుసరిస్తారు.
August 4, 2009 at 2:07 PM
రొంబ నల్ల అవిడియా :-)
మీ మొదటి పేరా గురించో ముక్క .. తమ ఉద్యోగాన్ని తిట్టుకునే వాళ్లు అన్ని రంగాల్లోనూ ఉంటారు. అలాంటోళ్లని చూస్తే మీలాగే నాకూ చిరాకు.
August 4, 2009 at 3:12 PM
ఓ ఓపెన్ సోర్స్ టాస్క్ ట్రాకింగ్, దాంతోబాటు వర్క్ ఫ్లో ఇంజను, ఓ రూల్స్ ఇంజను తయ్యారుజేసి అవతలనూకండి సారూ!! ఎమెయిల్ మేనేజర్, మెయిల్ ఇంటిగ్రేటర్, కొలాబొరేటర్, కంటేంట్ జెనరేటర్ అన్నీ ఉండేట్టు సూడండి. జయప్రకాశ్ నారాయణ లాంటోళ్ళకి ఉపయోగపడుద్దిగా.
*సొఆ ఫర్ గొవ్ రెలేటెడ్ సెర్వీసెస్*
గొవ్ రెలేటెడ్ - పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ పీపుల్, పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ గొవ్ డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ.
ధన్యవాదాలు సారు..
August 4, 2009 at 4:54 PM
యాండా!! Clunker మీన ఓ పోష్టేయండా!! సదూకొని ఆనందిత్తావండా!!
August 4, 2009 at 7:13 PM
శాసన సభ్యులకు స్థానిక అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారినికి సంబంధం లేదు.ఉండ కూడదు. వీటికి స్థానిక సంస్థలు ఉన్నవి. ఈ విషయం చాలా మంది గమనించడం లేదు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఇప్పటి రాజకీయ నాయకులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు) అధికారం కేంద్రీకృతం చేసుకొని ప్రజలను బిచ్చగాల్లను చేస్తున్నారు.
ఎమ్మెయేలు, ఎంపీలు విధులు వేరు. విశాల ప్రాతిపదికంగా ఉంటాయి. ఒక రొడ్డు, ఒక హాస్పటల్ గురించి వీరు పట్టించుకోవద్దు. వీరు స్థానిక సంస్థలను పటిష్ట పరిచి వాటిద్వారానె అభివృద్ధి, సమస్యల పరిష్కారం కావడానికి విశాల ప్రాతిపదికనేర్పరచాలి. పర్యెవేక్షణ చేయాలి.
August 4, 2009 at 8:21 PM
@ వరుణుడు గారు - లోక్‌సత్తా అభిమానులే ఈ వివరాలను అందరికీ చెప్పాలి. లోక్‌సత్తా వెబ్‌సైటులో కూడా ఇవన్నీ పొందుపరచాలి
@ భాస్కర్ గారు - ఆ వెబ్‌సైటులో జేపీగారి ప్రజాసేవ వివరాలు లేవు ఎందుకో!
@ పరిమళం గారు - ఈ పోస్టు చదివినవారు ఎవరయినా ఆయనకే మెయిల్ చేస్తారని ఆశిద్దాం.
@ చిన్ని గారు - జేపీ గారు మిగిలిన ఎమ్మెల్యేలకు భిన్నంగా ప్రజాసేవ చేస్తారనే అనుకుంటున్నా
@ చైతన్య గారు - ధన్యవాదాలు
@ బోనగిరి గారు - చూద్దాం, జేపీగారు చేసి చూపిస్తే ఆ ప్రొఫెషనలిజం వస్తుందేమో!
@ తెలుగోడు గారు - మంగిడీలు :)
@ sujata గారు - ప్రయత్నించి చూడాలి
@ సుజాత గారు - ఆ లింకులో జేపీ గారు చేసిన ప్రజాసేవ వివరాలు లేవు. అన్నీ స్టేట్‌మెంట్లే!
@ శ్రావ్య గారు - జేపీ గారు చంద్రబాబులా తయారవరులెండి ;)
@ అబ్రకదబ్ర గారు - అలాంటోడినొకడిని టీం నుండి తీసేసిన రోజు నేను ఫుల్ హ్యాపీ!
@ భాస్కర్ రామరాజు గారు - మరెందుకాలశ్యం, కానివ్వండి :)
@ సమతలం గారు - మనము utopiaలో లేము కదండీ!
August 6, 2009 at 10:59 AM
నేను కూడా లోకసత్త అభిమానినే. మీ ఆలోచన నిజంగా బాగుంది. మీ inews ఛానల్ రాత్రి 11:00 గంటలకు ఒకసారి చూడగలరు. వారు మన మూడు ప్రధాన పార్టీల నాయకులు రోజు వారి రీపోర్టు తెలుపుతున్నారు.
August 6, 2009 at 11:46 AM
అన్నా
నాకోసారి మెయిల్ చెయ్యగలవా?
ఏంటీ?? నా మెయిల్ ఐ.డీ కావాలా?
August 6, 2009 at 11:48 AM This comment has been removed by the author.
August 6, 2009 at 7:29 PM
@ సాయిప్రవీణ్ గారు - ఒక టీవీ ఛానల్ అంత మంచిపని చేస్తున్నదా? చూడడానికి ప్రయత్నిస్తాను.
@భాస్కర్ రామరాజు గారు - నిన్న కామెంట్ల మోడరేషన్ పెట్టాను. ఇపుడు తీసేసాను.