ఈమెయిల్ గోలలు
Posted by జీడిపప్పు
అడుక్కునే వాళ్ళు: ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసిన మెయిలులో ఒకటికంటే ఎక్కువ "ప్లీజ్"లు ఉంటే, ఆ రాసినవారు "అడుక్కునే" వారి జాబితాలోకి వస్తారు. ఈమెయిల్ రాస్తున్నది ఏదో దానమో ధర్మమో చేయమని కాదు, ఆఫీసు పని మీద. ఇది పట్టించుకోకుండా కొందరు ఒకే మెయిల్లో "ప్లీజ్ ఈ పని చెయ్యి, ప్లీజ్ ఆ పని చెయ్యి, నీకు ఏమయినా డౌట్లుంటే చెప్పు ప్లీజ్" అని ప్లీజుతుంటారు. ఇది చూసినపుడు నాకు (మాదాల రంగారావు స్టోన్‌తో) "ఒరే అయ్యా, ఏమిటా అడుక్కోవడం? ఇది బస్టాండు కాదు, ఆఫీసు. కాస్త డిగ్నిఫైడ్ గా ఉండాలి" అని చెప్పాలనిపిస్తుంది.
ఫుల్స్టాపర్లు: ఒకప్పుడు మెసేజ్‌లో ఎన్ని తప్పులున్నా పెద్దగా పట్టించుకోకుండా చివరలో నా పేరు పక్కన మాత్రం ఠంచనుగా ఫుల్స్టాప్ పెట్టేవాడిని. అసలు బుర్ర ఉన్నోడెవడయినా పేరు పక్కన ఫుల్స్టాప్ పెడతాడా? ఒకసారంటే పర్లేదు కానీ కొన్ని వందల మెయిల్లలో ఎవరి పేరు చివరా ఫుల్స్టాప్ లేదని గమనించి అయినా ఆ తప్పు సరిదిద్దుకోవచ్చు కదా!
బొమ్మలోళ్ళు: ఒక ఎర్రర్ వచ్చినపుడు లేదా ఒక డౌట్ ఉన్నపుడు వీలయినంతవరకు ఆ వివరాలను మాటలరూపంలో చెప్పి అవసరమయిన చోట స్క్రీన్‌షాట్ తీసి ఈమెయిలుకు అటాచ్ చెయ్యాలి. కానీ కొందరు అలా కాదు. ప్రింట్ స్క్రీన్ ఒకటుంది కదా అని అవసరం లేని చోట కూడా ప్రతి చిన్న విషయానికి బొమ్మలు తీస్తారు. పోనీ ఆ బొమ్మలు jpeg లో ఉంటాయా అంటే అదీ కాదు, bmp ఫార్మాట్లో. ఒక్కోటి ఒక MB తింటుంది. jpeg లో సేవ్ చెయ్యవచ్చుగా? ఈ బొమ్మలను అటాచ్ చేసి దేశమంతా మెయిల్ కొడితే అవతలోడు ఆ బొమ్మలను అలాగే ఉంచి దానికి మళ్ళీ రిప్లై కొడతాడు. ఇహ చూస్కో నా సామి రంగా. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చేసరికి ఆ మొదటి మెయిలుకు రిప్లైల మీద రిప్లైలు ఉంటాయి, ప్రతి రిప్లై లో ఆ భారీ అటాచ్మెంట్ తో సహా. ఆ దెబ్బకు ఇన్‌బాక్స్ సైజు పొర్లిపోయి చేతులెత్తేయడంతో పనికొచ్చే మెయిల్స్ కూడా రావు!
కృతఘ్నులు: తమకు అవసరమయినపుడు కొందరు తెగ మెయిల్స్ కొడతారు, అది కూడా కాపీ టు సీయం - కాపీ టు పీయం అంటూ కంపెనీకంతా. పని పూర్తి అయిన తర్వాత మాత్రం కనీసం థేంక్యూ అని కూడా చెప్పరు. నిజమే, ఆ పని చేయడమే నా డ్యూటీ అందుకే నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి నాకు థేంక్యూ చెప్పనవసరం లేదు. అయితే కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ప్రభావిత పదాలలో "థేంక్యూ" "గుడ్జాబ్" కూడా ఉన్నాయని చాలామంది గ్రహించరు. ఈ విషయాన్ని గ్రహించినవారే తమ పనులను సులువుగా చేయించుకోగలుగుతారు.
చాటభారతగాళ్ళు: ఏదయినా ఒక విషయం చెప్పేటపుడు KISS ఫార్ములా అవలంబించాలి. అంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రెయిట్ (దీనినే కొందరు కీపి ఇట్ సింపుల్, స్టుపిడ్ అంటారు). రెండు లైన్లలో చెప్పగలిగిన విషయాన్ని రెండు పేరాల్లో సాగదీస్తారు కొందరు. ఈ చాటభారతానికి ఇంకో చాభా "నువ్వు చెప్పిన పని చేసాను. అంతా బాగయింది. ఎక్కడా ఇబ్బంది లేదు.." అంటూ మొదటి మెయిల్లోని చాభాని ఉటంకిస్తూ రిప్లై ఇస్తాడు. ఆ చెప్పేదేదో రెండు ముక్కల్లో "ఆల్ సెట్" అనో "డన్" అనో చెప్పచ్చుగా. ఒక్కో చాటభారతంవల్ల సగటున ఒక వ్యక్తికి 2-3 నిమిషాల సమయం వృధా. ఆ లెక్కన మూడు టీములవాళ్ళకు కలిపి ఆ ఒక్క మెయిల్ వల్ల ఒక గంట సమయం వృధా అవుతుందన్నమాట!
చివరగా - నాలో నాకు నచ్చే చాలా లక్షణాల్లో ఒకటి "ఆఫీసులో ఇంకొకరిని ఇబ్బంది పెట్టకపోవడం". ఈ ఉద్యోగంలో ఎన్ని రోజులుంటామో తెలియదు. ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు. అంతమాత్రానికి ఆఫీసులో ఉన్నవాళ్ళతో గొడవలకు దిగడం లేదా ఇబ్బంది పెట్టడం చాలా తెలివితక్కువతనం. ఒకరిని ఇబ్బంది పెట్టి సాధించేది ఏమీ ఉండదు. మంచిపేరు తెచ్చుకుంటే అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది, అసలే మనము "గ్లోబల్ విలేజ్" లో ఉంటున్నామాయె. ఇవన్నీ తెలిసినా అవకాశం వస్తే ఒకడికి చుక్కలు చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే, వాడు దేశమంతా కొట్టే మెయిల్స్ లో కూడా SMS లాగ్వేజ్ "u" "c" "ty" వాడుతుంటాడు. వీడికి ఎలాంటి గుణపాఠం నేర్పించాలంటే, జీవితంలో మళ్ళీ ఛాటింగులో కూడా SMS భాష వాడకూడదు. ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఆ అవకాశం!
August 24, 2009 at 9:12 PM
ఓ ఫోన్ కాల్‌తో పోయే చిన్నపాటి ముక్కకీ ఈమెయిల్ పంపితే భవిష్యత్తులో 'దేన్నో' రక్షించుకోటానికి పనికొస్తుందన్న అభిప్రాయంతో ప్రతిదానికీ తామర తంపరగా మెయిళ్లు కొట్టేవాళ్లూ ంటారు.
August 24, 2009 at 9:32 PM
ప్లీజ్ అనడం లో తప్పేమి లేదు. నేను ఎవరినైన ఫేవర్ అడుగుతుంటే ఒకటికి రెండు సార్లు ప్లీజ్ అని మేల్ చేస్తా.. ఎందుకంటే అది నా అవసరం.and i am making them go over their call of duty to do it for me. నీ అబ్బ రెయ్ డబ్బులు తీసుకుంటున్నావ్ కద చేసి పెట్టర _____ అంటే చిరిగిపోయిన చెప్పుతో కొడతారేమో అని నాకు అనుమానం. దట్ అపార్ట్ ఇంకొంతమంది ఉంటారు.. ఇలా అంటున్నా అని కాదు కాని నా ఎక్స్పీరియన్స్ .. దేశి మేనేజర్లు కొంత మంది ఉంటారు .. అదేదో కూలీలకో స్లేవ్ లేబర్స్ లో చెప్పినట్టు రాస్తారు మేల్స్.. అలాంటి వాళ్ళు చెప్పె పని ఎప్పుడు నా క్యూ లో లాస్టే. but that is just me.
BMP Vs JPEG అంటావా.. paint లో default option BMPనే. కొంతమందికి అసలు దాన్లోనే jpeg చేయచ్చు అని తెలీదు. తెలుసుకునే అవసరం కూడా ఉండదు.. అలాంటి వాళ్ళని అనడం సమంజసం కాదేమో. IMO. నేను నా పేరు తర్వత ఫుల్స్టాప్ పెడతా. అందులో ఏముంది? నా పేరు నా ఇష్టం.. ఇంకా బద్దకం / కొవ్వు ఎక్కువగా ఉన్న రోజులు అసలు పేరే రాయను - thx, -S. అని పెడత. మా బాస్ కి కూడా. And I never had any issue with that.. with both desi or non-desi bosses.
కృతఘ్నులంటావా.. అది సర్వ సాధరణం. ఆపీసులోనే కాడు జీవితం లో కూడా ఇలా బోలెడు మంది ఉంటారు. మన పని మనం చేసుకు పోవడమే.. నువ్వు చేయకపోతే వాళ్ళాకి చేసేదానికి వేరే వాళ్ళు దొరుకుతారు. కొంతమంది నిజంగానే టైం ఉండదు.. వాళ్ళ మేల్స్ కూడా ముందే చెప్పెయాచ్చు మొదటి 2-3 మేల్స్ లోనే బోలెడు సార్లు ప్లీజులు చెప్పెస్తారు.. అంటే తర్వత వాళ్ళు చెప్పగలరో లేదో అని.
చాటభారత గాళ్ళు - you say good. i say exemplary. మనకి నచ్చినట్టు అందరు ఉండలనుకోవడం కష్టం కద గురు.. అందరు ఒకేలా ఉంటే మనిషి బదులు రొబోట్ అనడం బెటెర్ ఏమో.. accounting or lawyers మేల్ చేస్తే అది ఓ పది పాతిక పేజీలు ఉంటది. dev, qa, etc మేల్ చేస్తే ఓ పది పాతిక పదాలు ఉంటాయి. ఇది కూడా నా own సొంత personal opinion మాత్రమే. feel free to disagree.
August 24, 2009 at 9:33 PM
@అబ్రకదబ్ర - it is ALWAYS - Covering One's A**.
August 24, 2009 at 10:00 PM
ఈ మధ్య ఒక సారి ఎవరో మా group లాగిన్ నుండి ఇంకో group కి mail చేశారు with read reciept request. ఒక్కొక్కరు mail open చెయ్యడం. అది సక్సెస్సా ఫెయిల్యూరా అంటూ మాకు mail రావటం.మధ్యలో "ఈ మెయిల్సేంట్రా బాబూ... " అంటూ mails.
August 25, 2009 at 12:45 AM
నేను అడుకున్నేవారి కోవలోకి వస్తానేమో అని నాకు నామీద తీవ్రంగా అనుమానం వచ్చేస్తోంది ఇప్పుడు. కృతఘ్నులతో మాత్రం భలే తంటా అండోయ్, పీ ఎం నుండి ప్యూన్ వరకూ ఎవ్వరినీ వదలకుండా అందరినీ సి.సి లలో పెట్టేసి చావగొడతారు సోది మొహాలు
August 25, 2009 at 12:54 AM
జీడిపప్పు గారు
ఒక వర్గం మీరు టోటల్ గా మర్చిపొయ్యారు. మనం వంద ఈమెయిలు వ్రాసినా రిప్లై ఇవ్వకపోగా, ఎ హాల్ వే లో కనపడ్డప్పుడు విషయం అడిగితే "why don't you send me an email and we will take it from there" అనే వాళ్ళు. By the way I like the word "ప్లీజుతుంటారు".
August 25, 2009 at 1:12 AM
అవునండి బాబోయ్. హింసయ్యలు హింసమ్మ లు మెయిల్ నిండ అంత చేటు కృతజ్ఞతలెందుకో బాబోయ్ కొందరు మళ్ళీ ప్రతి మెయిల్ కు ఎకనా లెడ్జ్మెంట్ పెట్టుకుంటారు, అంత ఓపిక ఎలా వుంటుందో నాకైతే అర్ధం కాదు, కొన్ని సార్లు టీం మొత్తనికి మెయిల్ ఇవ్వవలసి వుంటుందా, అందులో పేర్లు మనం ఏమి ఆర్డర్ లో ఇచ్చామో చూసి ఆ ఆర్డర్ లో వాళ్ళ పేరు ముందు లేదని అలుగుతారు తెలుసా.. నిజం (మహేష్ బాబు మీద ఒట్టు) తల మల్లిక్ జోక్ లో లా ఠపా ఠపా ...
"ప్లీజుతుంటారు" బాగుందండి.. వేసేసుకోవచ్చు మీకో వీర తాడు..
మీ కంపనీ ఎక్కడో చెపితే నేను అటు దరిదాపులకు కూడా రాను లేక పోతే మీరు నన్ను కూడా హిట్ లిస్ట్ లో పెట్టేస్తారు నేను కూడా u అని బాగా వాడతాను అనాగరీకం గా. ఇప్పుడు అర్ధం ఐంది గా మనుష్యులు ఎంత పగ పడతారో దాని గురించి అని.. :-(
August 25, 2009 at 4:39 AM
ప్రభావిత - influenced (past participle)
ప్రభావక/ ప్రభావశాలి - influential (adjective)
August 25, 2009 at 5:17 AM
Good one ...
You might have seen this but just in case ...
http://www.dtcc.edu/cs/rfc1855.html#2
August 25, 2009 at 5:25 AM
అమ్మో! నేను కూడా చుక్కలు చూడవలసి వస్తుందేమో....'u', 'c',2 అనే మాయ రోగం ఈమధ్యే నాకూ అంటుకుంది:)
August 25, 2009 at 8:39 AM
బాబోయ్ నాకు ఉ౦ది ఫుల్ స్టాప్ జబ్బు...నే ను శబధ౦ చెస్తున్నా మానుకు౦టానని.
August 25, 2009 at 9:33 AM
బాగుంది బాగుంది మీ పోస్టు.నాకు వర్డ్ కి వర్డ్ కి మధ్యలో ఎక్కువ స్పేసులు ఇవ్వడం ,!గుర్తు ఎక్కువ గా వాడటం అలవాట్లు ఉండేవి.ఈ అలవాట్లు మా PM ఇచ్చిన రిటార్టు తో దిమ్మ తిరిగి సెట్టెనయ్యి :)
August 25, 2009 at 9:36 AM
:):) రాత్రే వ్యాఖ్యానిద్దాం అనుకున్నా, చంటిది చేతుల్లో నిద్రోతుంటే సెయ్యలేకపొయ్యా సెమించు.
కొందరు మగాత్ములు మగాత్మురాళ్ళు రప్పలు, ఆళ్ళేంజేస్తారో తెలుసా! ఓ పెద్ద ఎంటర్ప్రైజ్ ఆర్చైవ్ బిల్డ్ చేసి, 400mb-600mb (Includes PDFs, Static Content) మెయిల్లో అటాచ్మెమ్ట్ లా పంపిస్తారు.
సర్వర్ లో Devalapars కి ఓ లొకేషన్. అక్కడణుండి ఫైలుని FTP ద్వారా Desktop మీనకి దెచ్చి, ఒక్కోసారి ASCII లాగా FTP చేసి, దాన్ని మెయిల్లో అటాచ్ చేసి పంపిస్తే, నేను దాన్ని download చేస్కుని, FTP back to the same server చేసి డిప్లొయ్ చెయ్యప్రయత్నిస్తే అది Wrong file format అని తంతుంది. ఇలా ఉంటాయి నాయనా గాధలు.
మా పాత కంపెనీలో ఈమెయిల్ పాలసీ అని ఒకటి ప్రవేస పెట్టారు. NO ATTACHMENTS, is one of the policies. This is to reduce network utilization. If it is a simple thanks call or one line mail, should be mentioned in the subject itself with < eom > tag.
August 25, 2009 at 9:47 AM
శశాంక్ తో ఏకీభవిస్తా!!
ప్లీజ్ అనటంలో తప్పులేదు. అన్జెప్పి మాటకు ముందు తర్వాత మద్దెన, నిట్టనడుమ ప్లీజులు ఉండాల్సిన పనిల్యా.
BMP Vs JPEG - బైయ్ డిపాల్ట్ BMP. ఐతే - సరదాగా చెప్తున్నా. అందరికీ తెలిసే ఉంటుంది. ఏ ఫైల్ ఐనా సేవ్ చేసేప్పుడు "" ఇలా డబుల్ కోట్స్ మధ్యన పెట్టి మీకు కావాల్సిన ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయొచ్చు. అప్పుడు డిపాల్ట్ ఎక్స్టెన్షన్ ఓవర్‌రైడ్ అవుతుంది.
>>ఓ ఫోన్ కాల్‌తో పోయే చిన్నపాటి ముక్కకీ ఈమెయిల్ పంపితే భవిష్యత్తులో 'దేన్నో' రక్షించుకోటానికి........
*ఆడిటబిలిటీ* అని ఒకటుంటుంది. దానికోసం కొన్ని కొన్ని తప్పనిసరిగా మెయిల్స్ లో రికార్డ్ చేసి తీరాలి.
ఛేంజ్ మేనేజ్మెంట్ కి కూడా మెయిలింగ్ అనేది ఓ నిర్మాణాత్మక టూల్.
ఈరోజున వర్క్ ఫ్లో/బి.పి.యం ల హవాల్లో ఈమెయిల్ అనేది కీలకం.
August 25, 2009 at 11:42 AM
LOL Good one
August 25, 2009 at 10:51 PM
@ అబ్రకదబ్ర గారు - నాకు తెలిసి ఫోన్ కంటే ఈమెయిల్ కన్ఫర్మేషనే శ్రేయస్కరం!
@ శశాంక్ - దాదాపు అన్నిటితో ద్వికీభవిస్తాను. btw, ఆ కామెంటును కాస్త మారిస్తే ఫుల్ లెంగ్త్ పోస్ట్ అవుతుందేమో!
@ ఇండియన్ మినర్వా గారు - మాకు అలాంటి క్యాండిడేట్ బాధ ఉంది :(
@ లక్ష్మి గారు - lol
@ కిరణ్మయి గారు - భలే గుర్తు చేసారు ఆ కేటగిరి గురించి
@ భావన గారు - పేర్ల ఆర్డర్ విషయంలో నేను "సీనియారిటీ" పాటిస్తాను. Alphabetic order ఫాలో అవడం బెస్ట్.
@ surfizen గారు - ధన్యవాదాలు
@ సూర్యుడు గారు - ధన్యవాదాలు
@ పద్మ గారు - ఆఫీసు మెయిల్లో SMS భాష వాడడం బూతుతో సమానం :)
@ సుభద్ర గారు - హమ్మయ్యా, నా పోస్టువల్ల నిఝ్ఝంగానే ఉపయోగం ఉందన్నమాట :)
@ శ్రావ్య గారు - అఫిషియల్ మెయిల్స్ లో "!", "..." మొదలయినవి అస్సలు వాడకూడదనుకుంటా
@ భాస్కర్ గారు - ధన్యవాదాలు
@ రౌడీ గారు - ధన్యవాదాలు
August 30, 2009 at 1:48 PM
బాగున్నాయండీ మీ ఈ-మెయిల్ గోలలు...! నిత్యం అనుభవిస్తుంటాను ఇలాంటివి ;(
November 24, 2011 at 12:55 PM
email writing medha rojuku rendu gantala choppuna session cheppina na HR kanna medhe baaga nacchindhi :)
subject lo emi raayakunda pampinche vaallu kuda untaaru... sacchinattu motham mail open chesthe kaani ardham kadu asalu sangathi enti ani.