మెడికల్ మాఫియా
Posted by జీడిపప్పు
కొంత కాలానికి అర్థమయినదేమిటంటే, అమెరికాలో కూడా అవినీతి ఉంది. కాకపోతే ఇండియాలో సగటు మనిషిముందు చెయ్యి చాపి "నాకేంటి? అహా నాకేంటని" అంటారు. అమెరికాలో అలా కాకుండా అంతా సైలెంటుగా భారీ ఎత్తున జరిగిపోతుంది. సామాన్య పౌరులు లంచం ఇవ్వవలసిన పరిస్థితి ఎప్పుడూ రాదు. మనవాళ్ళలా పాతికకో పరకకో కాకుండా అమెరికన్ అవినీతిపరులు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు వీలయినంతవరకు మేడాఫ్ తరహాలో బిలియన్లకు లేదా మిలియన్లకు గురిపెడతారు. ఇండియాలో పదిమంది అవినీతిపరులు ఉంటే అమెరికాలో ఒకరిద్దరు ఉంటారు అంతే. అయితే ఈ ఒకరిద్దరి అవినీతి స్థాయి, క్రూరత్వం ముందు ఆ పదిమంది దిగదుడుపే అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంత తెలివిగా అవినీతి చేస్తారో, ఏ స్థాయిలో చేస్తారో తెలుసుకోవడానికొక ఉదాహరణ:
ఈ రోజు మెడికల్ మాఫియా అన్న హెడ్డింగ్ చూడగానే "ఎవడో డాక్టరు ఇన్సూరెన్స్ ఏజంటుతో కలసి మోసం చేస్తున్నాడు" అనుకొని చదువుతుంటే మతిపోయింది. ఒకామెకు చిన్న కారు యాక్సిడెంటువల్ల వెన్నునొప్పి రావడంతో తెలిసిన ఫ్రెండుకు చెప్పింది "లీగల్ గా వెళ్తే ఇన్సూరెన్స్ కవర్ చేయదు కాబట్టి ఏదయినా సలహా కావాల"ని. కాసేపటికి ఇంకో వ్యక్తి ఫోన్ చేసి ఏమీ భయపడనవసరం లేదు, అన్నీ మేము చూసుకుంటాము. కాకపోతే ఫలనా వ్యక్తి సాయం చేసాడని ఎవరికీ చెప్పకు" అని కారును గుద్దినవాడి వివరాలు తీసుకున్నాడు.
ఆరువారాలపాటు నగరంలోని పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసారు. పెద్ద లాయరు వచ్చి వివరాలు తెలుసుకున్నాడు. వీటన్నిటికీ ఆమె ఒక్క సెంటు కూడా చెల్లించలేదు! ఆమె వైద్యానికి అయిన బిల్లు అంటూ ఆమె కారును గుద్దినవాడికి $200,000 బిల్లు పంపించారు. అసలు కథ అప్పుడే మొదలయింది.
ఆమె కారును గుద్దినది సాధారణ వ్యక్తి కాదు, ఒక ఫెడరల్ ప్రాసిక్యూటర్! ఒక చిన్న యాక్సిడెంటుకు అంతమంది డాక్టర్లు, అన్ని బిల్లులా అని అనుమానమొచ్చి FBI సహాయంతో తీగలాగాడు. సంగతేమిటంతే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు, వాదించే లాయర్లు, అవుననే పోలీసాఫీసర్లు, తీర్పునిచ్చే జడ్జీలు, డబ్బులు ఇచ్చే ఏజంట్లూ అందరూ ముఠాగా ఏర్పడి వందల మిలియన్ల డాలర్లను దాదాపు ఎవరూ కనిపెట్టలేని సహజమార్గాల్లో దోచుకుంటున్నారు! అసలు విషయం బయటపడ్డ తర్వాత చట్టంలోని లొసుగులవల్ల, పేరుకుపోయిన అవినీతివల్ల కొందరు తప్పించుకొని హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నారు.
బయటపడని ఇలాంటి మాఫియా కథలు దాదాపు ప్రతిరంగంలో ఉంటాయి. కాకపోతే మిగతా అన్ని రంగాల్లో జరిగే అవినీతి కంటే వైద్యరంగంలో జరిగే అవినీతి ఎన్నో రెట్లు ఎక్కువ. అమెరికాలో ఏడాదికి సగటున 80 బిలియన్ డాలర్ల అవినీతి ఒక్క వైద్యరంగంలోనే జరుగుతుందట! మందుల కంపెనీలు, ఆస్పత్రులు చేసే ఘోరాలకయితే అంతే ఉండదు. అనవసరమయిన బిల్లులు వేసి సగటు కుటుంబాన్ని నిమిషాల్లో బజారుపాలు చేయడానికి దాదాపు అన్ని కంపెనీలు తహతహలాడుతుంటాయి. బాధాకరమయిన విషయం ఏమిటంటే ఇప్పుడిపుడే కార్పొరేట్ వైద్యం విజృంభిస్తున్న ఇండియాలో కూడా ఈ "మెడికల్ మాఫియా" తన ఉనికిని చాటుకుంటున్నది. భవిష్యత్తులో ఇదొక పెద్ద భూతమవడం ఖాయం!
August 19, 2009 at 8:21 PM
ఇప్పటికే అయింది కదా! ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీనే అందుకు నిదర్శనం .
August 19, 2009 at 9:49 PM
:) 'll comment indetail 2moro.
August 19, 2009 at 11:13 PM
లంచం అన్నది మన రక్తం లోనే వుందేమో.. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా.. కిరాణా షాప్ నుంచి ఏదైనా కొనాలంటే అమ్మ మనకి ముందు అర్ధ రూపాయో, రూపాయో లంచం ఇచ్చేది.. అక్కడ మొదల్లయ్యిందండి... లంచం..
August 19, 2009 at 11:43 PM
బాగా చెప్పేరు.. అమెరికా లో లేని ది ఏమిటి చెప్పండి.. పిరమిడ్ లో మన లాంటి కింద తరగతుల వాళ్ళకు అంత తగలవు కాబట్టి ( ఆ వాల్ స్ట్రీట్ బర్నీ మ్యాడాఫ్ ల దెబ్బ కు ఏదో స్టాక్ మార్కెట్ లో కాస్తో కూస్తో సంపాదిద్దాము అనే మన లాంటి సామన్యులకు కూడా కళ్ళు బైర్లు కమ్మేటట్లు కుంభకోణపు దెబ్బ లు తగులుతుంటాయి లే) అంతా శాంతం గా సుఖం గా జరిగిపోతున్నట్లు వుంటుంది. ఈ కార్పొరేట్ ఆరోగ్య పధకాలు ప్రతి ఒక్కరికి వుండవలసిన ఇన్స్యూరెన్స్ అని ఇండియా లో కూడా పెరిగి పోతున్న భూతమే ఇది మరి.. ఏమవుతుందో కథ..
August 20, 2009 at 12:45 AM
జీడిపప్పుగారూ - మంచి విషయాన్ని హైలైట్ చేసారు.
అమెరికా సుగుణాలన్నీ పక్కన పెడితే, నాకు నచ్చని విషయాలు రెండు.
ఇన్స్యూరెన్స్, law suits - ఈ రెండు సగటు మనిషి జీవితాన్ని తలకిందులు చెయ్యగలగడం.
August 20, 2009 at 12:52 AM
అంతా ఇన్స్యూరెన్సు మాయ. లేకపోతే పన్ను నొప్పికీ వేలాది డాలర్లు వదిలించుకోటమేంటి.
పన్లో పనిగా ఒబామా తలపెట్టిన హెల్త్ కేర్ రిఫార్మ్ గురించీ, ఇన్స్యూరెన్సు కంపెనీల తరపున రిపబ్లికన్లు ఆడుతున్న డ్రామాల గురించీ కూడా ఓ పోస్టెయ్యండి. సోషలిజం పేరుతో జనాలని భయపెట్టి ఎంత రభస చేస్తున్నారో కూడా రాయండి.
August 20, 2009 at 2:45 AM
మీరు చెప్పిన దానిలో ఏక్సిడెంట్ చేసినవాడు ఫెడరల్ ప్రాసిక్యూటర్ కాబట్టి, ఎఫ్.బి.ఐ సహాయంతో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. మామూలు వాళ్ళు ఈ హింసకి గురి కావల్సినదేనా? వినాయక చవితి కథలో శమంతక మణి వ్యవహారంలో శ్రీకృష్ణుడు భగవంతుడు కాబట్టి నింద మాపుకోకలిగాడు. ఇక్కడ మాటేమిటి--ఈ కథ చదివినవాళ్ళు, అక్షింతలు నెత్తిమీద వేసికుంటే ఇలాటివి ఉండవా? ఆ నివారణోపాయం కూడా చెప్పి మీ ఎన్.ఆర్.ఐ లకి ఉపకారం చేయండి !!
August 20, 2009 at 3:51 AM
మజా వచ్చింది. ఇలాంటివి మరికొన్ని వ్రాయండి!
August 20, 2009 at 6:28 AM
మీరు చెప్పింది అక్షరాల నిజం. ఏదయినా accident అయినప్పుడు insurance కంపెనీ లతో పోట్లాడి డబ్బులు తేవటానికి ఈ 1/3 గాళ్లను (1/3 to the partee, 1/3 to the attornee(s), 1/3 to the Doctors(chiropractors)) నమ్ముకోవాల్సిందే.
కాకపోతే, వీళ్లను నమ్ముకోకుండా, నిజాయితీ గా వెళ్లితే, ఈ insurance కంపెనీ లు పెట్టే ముప్పుతిప్పలు సామాన్యులు తట్టుకోగలరా? ఆ రకంగా అతి పెద్ద మాఫియా అయిన insurance కంపెనీ లతో, deal చేయటానికి ఈ చిన్న చిన్న మాఫియా లు పుట్టుకొచ్చినాయి. ఓ ordinary fellow గా, నా వోటు ఎప్పుడూ ఈ లాయర్ల మాఫియా లకే, ఎందుకంటే గుడ్డిలో మెల్ల కనీసం 1/3 అయినా నాకు వాటా ఇస్తారు.
ఈ గొడవలు అన్నీ తెలియనప్పుడు, నా కారు ను ఎవడో వెనక నుండి గుద్దితే, ఓ నిజాయితీ డాక్టర్ దగ్గరకు వెళ్లి treatment తీసుకొని, లాయర్ లేకుండా insurance కంపెనీ లను డబ్బులు కట్టమంటే వాళ్లు పెట్టిన ముప్పుతిప్పలు ఇన్ని అన్నీ కావు. చివరకు పాపం ఆ డాక్టర్ చేతులు ఎత్తేసి, వీళ్లు అడిగే తల తిక్క ప్రశ్నలకు సమాధానాలు నేను పంపలేను, నాకు అంత టైం కూడా లేదు, వీళ్లకు సరిపొయే గ్యాంగ్ వేరే వాళ్లు ఉంటారు వాళ్లను వెళ్లి పట్టుకో అని, నన్ను తనే వదిలేసుకొన్నాడు. ఎప్పుడు అయితే, ఆ గ్యాంగ్ లోని attorney ని పెట్టుకొన్నానో, ఏ ప్రశ్నలు వేయకుండా ఆ insurance (అమేరికా లో కల్లా పెద్దది అన్న పేరు) కంపెనీ డబ్బులు కట్టింది అనుకోండి, నాకు వచ్చేది 1/3 పార్టే కాబట్టి, అయినదానికంటే ఖర్చు ఎక్కువ చూపిస్తున్నా ఏమీ మాట్లాడకుండా సంతకాలు పెట్టాను, ఎందుకంటే నిజాయితీ గా అయిన ఖర్చు అడిగితే ఏమయిందో అప్పటికే అనుభవం అయ్యింది కాబట్టి.
August 20, 2009 at 9:40 AM
this kind of trend started here too.
my sister met with an accident in vijayawada last year. i went there. i observed two or three insurence agents were giving pressure on my brother in law to give the entire procedural followup to them. their commission is 25 percent.
i read a newspaper article, if any accident occuring on highways, some brokers of this kind immediately enter the scene and take the situation in to their control, by getting signatures of the relatives. of course their commissions is said to be 50 percent.
it appears that certain things are ubiquitous.
bolloju baba
August 20, 2009 at 10:09 AM
నాకెప్పుడో తెలుసు అక్కడో 'గణేష్' కావాలని. :)
August 20, 2009 at 11:05 AM
వచ్చేసా!!
మెడికల్ ఫ్రాడ్ - చాలా లోతైన సముద్రం. ఇన్సూరెన్స్ ఫ్రాడ్ - అది మహాసముద్రం.
లంచగొండితనం - అబ్బో చాలా కధలు చెప్పొచ్చు. మచ్చుకి.
ప్రతీ బడిజిల్లాకీ కొందరు అటార్నీలను నియమిస్తుంది ప్రభుత్వం. వారికి 78-110కె భత్యం. కొందరు వాళ్ళ గడువు కాలం తీరినా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నారని తేలింది. వెంటనే ప్రభుత్వం కదిలింది (అలా శబ్దం చేసి) మా పెద్దాయన్ని లెపింది, ఏర పెద్దోడా ఏందీగోలా అని. మావాడు వెంటనే ఓ డెవలపర్ చేత ఒక అప్లికేషన్ రాయించి, ఆ యూఆర్యల్, యూజర్ నేం, పార్వర్డ్ ప్రతీ బడిజిల్లాకి పంపి *మీ బడిజిల్లాకింద ఎందరు ఎటార్నీలు ఉన్నారూ* *వారి వారి వివరాలు ఈ యూఆర్యల్ ల్లో తెలపండీ* అని ఆర్డర్ పాస్ చేసాడు. కొన్ని భానయమైన విషయాలు బయటపడ్డాయ్. అది వేరే కధ. ఆ డెవలపర్ థ్రెడ్ సేఫ్ అప్లికేషన్ చేసా అనుకుని పొరపడి మళ్ళీ సవరించాడు. అది ఇంకోకధ.
కొన్ని మిలియనుల డాలరులు దొబ్బితిన్నారు ఈ సోకాల్డ్ అటర్నీలు.
ఇలాంటి కేసులు కోకొల్లలు!!
August 20, 2009 at 9:44 PM
@ చిలమకూరు విజయమోహన్ గారు - హతవిధీ. మన ఖర్మ.
@ సత్య గారు - అది తాయిలమేమో :)
@ భావన గారు - ఈ కథే ఇండియాలోనూ తొందర్లో జరుగుతుంది
@ వేమన గారు - సరిగ్గా చెప్పారు. మాట్లాడితే "law suit" అంటారు వీళ్ళు!
@ అబ్రకదబ్ర గారు - చూస్తుంటే రిపబ్లికన్ల డ్రామా కంటే డెమొక్రాట్ల చేతకానితనమే ఎక్కువేమొ అనిపిస్తున్నది. వీలయితే రిఫార్మ్ గురించి స్టడీ చేసి వ్రాస్తాను.
@ హరేఫల గారు - ట్రాజెడీ ఏమిటంటే, దీనికి నివారణోపాయం ఏమీ లేదు!
@ అమ్మఒడి గారు - ;)
@ కృష్ణ గారు - అయితే ఈ కష్టాల రుచి బాగా తెలుసన్నమాట మీకు :)
@ బొల్లోజు బాబా గారు - బాబోయ్, అప్పుడే ఆ రేంజిలో ఉన్నారా మనవాళ్ళు!
@ కన్నగాడు గారు - :)
@ భాస్కర్ రామరాజు గారు - మరిన్ని విషయాలతో ఓ పూర్తిస్థాయి వ్యాసం వ్రాయండి