తైలం తమాషా చూద్దాం!

Posted by జీడిపప్పు

"చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకు బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది మనీ మనీ"

మనీ సినిమాకోసం సిరివెన్నెల కలమునుండి జాలువారిన ఆణిముత్యాలివి. స్థిరంగా ఒకచోట ఉండకుండా చేతులు మారుతూ కష్టాలు తీరుస్తూ కన్నీళ్ళు తుడిచే చుట్టము కాని చుట్టమయిన ఈ డబ్బు చేసే తమాషా గురించి మొన్న చదివిన ఒక పిట్ట కథ కాస్త మార్పులు చేస్తే ఇలా ఉంటుంది:

అది ఒక చిన్న ఊరు. ఆ ఊరికి దగ్గరలో ఉన్న పర్యాటకస్థలానికి వచ్చేవారి పైన ఆధారపడి ఆ ఊళ్ళో అందరూ జీవిస్తున్నారు. కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నందువల్ల పర్యాటకులు అటువైపు రాకపోవడంతో అందరి ఆదాయం తగ్గిపోయింది. ఒకరోజు ఒక వ్యాపారి ఆ ఊరిగుండా ప్రయాణిస్తుంటే ఉన్నట్టుండి భోరున వర్షం కురవడంతో తన స్కూటరును ఆ ఊళ్ళో ఉన్న ఒక చిన్న హోటల్/లాడ్జ్ ముందు ఆపి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు.

హోటల్ యజమాని కాఫీ ఇచ్చి మాట్లాడడం మొదలుపెట్టి ఆ వ్యాపారి పొరుగూరికి వెళ్ళి తన పని పూర్తి అయిన తర్వాత ఆ రాత్రికి తిరిగి అదే దారిన వెళ్తాడు అని తెలుసుకొని "సార్, మీరు రాత్రి తిరిగివచ్చేటపుడు వర్షం పడితే ఇక్కడే బసచేయండి. భోజనము, రూము రెండూ కలిపి వందరూపాయలే. ఒకవేళ వర్షం పడకపోతే మీ వంద మీకు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు" అన్నాడు. అంతలో వర్షం ఆగిపోవడంతొ ఆ వ్యాపారి సరేనని వందరూపాయలు ఇచ్చి తన స్కూటరు తీసుకొని అక్కడినుండి బయలుదేరాడు.

హోటల్ యజమాని అప్పటికే తనకు చికెన్ సరఫరా చేసేవాడికి నూరు రూపాయలు బాకీ ఉన్నాడు. వెంటనే ఆ వందరూపాయలు తీసుకొని వెళ్ళి చికెన్ సరఫరా చేసేవాడికి ఇచ్చి "ఒకవేళ రాత్రికి వర్షం పడకపోతే వ్యాపారికి డబ్బు ఎలా తీర్చాలి? పోనీలే ప్రస్తుతానికి అప్పు తీర్చాను. రాత్రి సంగతి అప్పుడు చూద్దాం" అనుకుంటూ హోటల్‌కు వచ్చాడు. చికెన్ సరఫరా చేసేవాడు కోళ్ళఫారం యజమానికి ఉన్న అప్పులో భాగంగా ఆ నూరు రూపాయలు ఇచ్చాడు. కోళ్ళఫారం యజమాని ఆ నూరురూపాయలను తీసుకొని దగ్గరలో ఉన్న వేశ్య ఇంటికి వెళ్ళాడు. కాసేపటికి ఆ వేశ్య హోటల్‌లో రూమును వాడుకున్నందుకుగానూ హోటల్ యజమానికి బాకీ ఉన్న నూరురూపాయలు తీర్చివేసింది.

అంతలో వ్యాపారి వెనుతిరిగి వచ్చి వర్షం పడడం లేదు కాబట్టి తాను తన ఊరికి వెళ్ళిపోతానని, తాను ఇచ్చిన నూరు రూపాయలు ఇవ్వమన్నాడు. వేశ్య తనకు ఇచ్చిన వందరూపాయలను ఆ హోటల్ యజమాని వ్యాపారికి ఇచ్చాడు. అందరూ తమ అప్పుల భారం తగ్గినందుకు సంతోషించి రేపటికోసం ఆశగా ఎదురుచూడసాగారు.

ఇదంతా చూస్తున్న ధనలక్ష్మి చిద్విలాసంగా నవ్వుకుంది!

21 comments:

  1. Malakpet Rowdy said...

    Something is not right! When the Net expenditure is Zero .. somebody should lose! Who can that be .. lemme give it a thought ..

  2. Malakpet Rowdy said...

    Yeah .. got it .. the Call girl is the loser. She worked, but didnt earn anything!

  3. మంచు said...

    I feel nothing wrong..

    హొటల్ యజమాని తొ పాటూ అందరూ తనకి రావల్సిన పాత బాకీ తొ తన బాకీ తీర్చారు.
    no one gained any money. no one lost.

  4. Malakpet Rowdy said...

    OOPS I put it in wrong words.. What I meant was .. there was some work done, so, theoritically there should be some money spent. Since No money has been spent, somebody should have lost ..

    perhaps my first answer was wrong the way it had been said. While the others did nothing n gained nothing .. the call girl worked, yet gained nothing!

  5. జీడిపప్పు said...

    Rowdy garu, i think the call girl also gained something. Before the traveler came into the town, she was Rs 100 in debt and by the time the traveler left she got free of that Rs 100 debt, which means she 'gained' something!

  6. భావన said...

    బాగుందండీ కథ. ఈ కధ లో కోళ్ళ ఫారం యజమాని ది అప్పు కాదు కదా అది విలాసం అతని దృష్టి లో.. సొ కొందరి అప్పు, కొందరి బతుకు తెరువు, ఇంకా కొందరి విలాసాలను కూడా తీర్చింది ధన లక్ష్మి..

  7. Bhardwaj Velamakanni said...

    Well I dont deny. But, if getting rid of Debt is treated as gain ... the the loss is for Poultry owner.

    I know it sounds lil stupid but, I am just trying to define "Law of conservation of Money and Work" .. if you look at the whole cycle, they should be conserved!

  8. Bhardwaj Velamakanni said...

    Before:

    Money with the Merchant: Rs 100.00
    Money with Others : Rs. 0
    Work done = 0

    ------------------------------------

    After:

    Money with the Merchant: Rs 100.00
    Money with Others : Rs. 0
    Work Done = 1 (By the call girl)

    So, Monetarily Nobody gained anything, but one person ended up working!

  9. జీడిపప్పు said...

    "the loss is for Poultry owner."

    Well, he did not 'lose' money but he 'spent' money to 'gain' some happiness :)

  10. Bhardwaj Velamakanni said...

    On the second thoughts ... if that point is taken into consideration then .. The poultry owner didn't work but gained something .. and the call girl worked but didnt gain anything. so the Positive DELTA of the Poultry owner compensates the negative DELTA of the call girl..

    LEVLAIPOYINDI :))

  11. జీడిపప్పు said...

    నా స్పందన :)

  12. Bolloju Baba said...

    భలే ఉంది.
    నాకూ పౌల్ట్రీ ఓనర్ డబ్బును ఖర్చు పెట్టాడు అనే అనిపిస్తున్నది. మిగిలినవారందరూ అదే డబ్బును అప్పును తీర్చటానికి వాడితే, పౌల్ట్రీ ఓనర్ ఖర్చు పెట్టటం క్రిందే వస్తుందేమో.

    అలాగని ఇతనూ లూజరూ కాదు. :-)

    ఏమో బాబు నాకు లెక్కలు సరిగ్గా రావు. ఎందుకొచ్చిన గొడవ :-)

    బొల్లోజు బాబా

  13. తమిళన్ said...

    కోళ్ళ ఫారం ఓనరు ఖర్సైపోనాడు....

  14. Suree said...

    ఈ కథ బహు బాగున్నది మిత్రమా ,ధనము వేరు వేరు సమయములనందు ,వేరు వేరు మనుషులకు ,వేరు వేరు విధములుగా ఉపయోగపడునని ఒక చక్కటి బుర్ర కదా బుర్ర తినకుండా చెప్పినందుకు మీకు నా కృతజ్ఞతలు ...

  15. Anonymous said...

    ఇలా రొటేషన్ జరిగితే రిసెషన్ ఎందుకు వస్తుంది?

  16. Anonymous said...

    జీడిపప్పు గారు, మీ బ్లాగును, కామెంట్లను ఫీడ్ ద్వారా ఎలా subscribe చేసుకోవాలో తెలుపగలరు.

  17. మంచు said...

    కాల్ గర్ల్ 100 rs కస్టమర్ కి చార్జ్ చేసి, 100 rs రూం కి ఇచ్చెస్తె ఎంత పనిచెసినా ఎమి ప్రాఫిట్ వస్తుంది పాపం? :-))

  18. Bhãskar Rãmarãju said...

    >>కోళ్ళఫారం యజమాని ఆ నూరురూపాయలను తీసుకొని దగ్గరలో ఉన్న వేశ్య ఇంటికి వెళ్ళాడు. కాసేపటికి ఆ వేశ్య హోటల్‌లో రూమును వాడుకున్నందుకుగానూ హోటల్ యజమానికి బాకీ ఉన్న నూరురూపాయలు తీర్చివేసింది.

    కో.ఫా యజమాని వందట్టుకెళ్ళాడు అనిజెప్పారేగానీ వందా అంఎకిచ్చెసాడంజెప్పలేదుగా!!!

    ధనం సర్క్యులేటు అవుతుంది, ఇందులో కొందరకి కొన్నివిధాల లాభాలు ఉంటాయ్. వేశ్యకాడికిబోయినందుకు బిల్లుకట్టలా, బ్లాకు పే జేసాడు. ట్యాక్సు మిగల్లా ఆడికి? అది ఆడికి లాభ్మేగా? ప్లస్సు 'gained' some happiness :)

  19. swapna@kalalaprapancham said...

    abbabba

  20. Shashank said...

    చస్ గోల.. "రూపీ నోటు పై యే క్రైమూ రాసిఉండదోయి" అని మనీ మనీ లో ఇంకో పాట లో రాసారు. నీ కథ బాగుంది. చదివినందుకు నాకు ఓ వంద్ రూపాయలు పే పాల్ కి పంపు బ్రదర్.

  21. జీడిపప్పు said...

    మంచు పల్లకి గారు - రూం అద్దె 25 అయి ఉండవచ్చు. అలా నాలుగుసార్ల అద్దె బాకీ ఉండవచ్చు కదా!

    సాయిప్రవీణ్ గారు- RSS feed టెంప్లేట్‌లో ఉంటే తీసేసాను!

Post a Comment