Who Moved My Cheese?

Posted by జీడిపప్పు

మార్పు అన్నది ఎంత సర్వసాధారణమో ఆ మార్పుకు అనుగుణంగా మన జీవన, ఆలోచనా విధానాలను మార్చుకోవడం అంత కష్టం. ముఖ్యంగా సుఖమయమయిన జీవనశైలికి అలవాటుపడినపుడు ఆ comfort zone నుండి బయటికి రావడానికి చాలామంది ఇష్టపడరు. దీనికి కారణం - ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందో అన్న భయాందోళనలు.

ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మొన్న ఈ పుస్తకాన్ని చదివాను. ఒకసారి గతాన్ని తరచి చూస్తే, దీని గురించి విన్నప్పటినుండి చదవడం వరకు నా ఆలోచనావిధానాల్లో కొన్ని "మార్పులు" ఉన్నాయి. ఐదేళ్ళ క్రితమే ఒక మిత్రుడు తప్పక చదవమని సూచించినపుడు "అబ్బే ఇలాంటి పుస్తకాల వల్ల ఉపయోగం ఉండదు" అని ఆ పుస్తకం సంగతి మరచిపోయాను. కొద్దికాలానికి ఇలాంటి పుస్తకాలపట్ల నా అభిప్రాయాన్ని "మార్చుకున్నాను". పుస్తకాల షాపుకు వెళ్ళినపుడల్లా ఈ పుస్తకం కనిపిస్తుంటే ఊరుకోలేక పేజీలు తిరగేసాను. ఏదో కథలా ఉండడంతో వద్దనుకొని కొనలేదు. ( ఏ మాటకామాటే చెప్పుకోవాలి, నాకు చీజ్ అంటే అస్సలు పడదు, టాం అండ్ జెర్రీ షోలో తప్ప!)

కొద్ది రోజుల క్రితం ఓ మిత్రుడితో మాట్లాడుతుంటే ఈ పుస్తకం ప్రస్తావన వచ్చింది. అన్వేషి లాంటివాడే ప్రస్తావించాడంటే తప్పక చదవవలసిందే అనుకొని ఈ పుస్తకం పట్ల నా అభిప్రాయాన్ని "మార్చు"కొని పుస్తకం చదివాను. ఈ పుస్తకం ఎలా ఉంది అంటే - స్వర్గం/నరకం నిర్ణయించే జంక్షన్లో నన్ను నిలబెట్టి దేవభటులు "నువ్వు చేసిన నూరు మంచి పనులు చెప్పు" అంటే అందులో "ఫలానా పుస్తకం చదివాను, చదవమని నా బ్లాగులో రాసాను" అని నూరులో ఒకటిగా చెప్తాను. చాలాకుంచెం అతిశయోక్తి అలంకార ప్రయోగం గావింపబడిననూ ఇది సత్యం!

పుస్తకంలోని విషయం ఎంత విలక్షణంగా ఉందో పుస్తకం కూడా అంత విలక్షణంగా ఉంది. మొత్తం నూరుపేజీలు కూడా లేదు. అందులో మొదటి పాతిక, చివరి ~20 పేజీలు పక్కన పెడితే "అసలు కథ" 50 పేజీలు ఉంటుంది. మధ్య మధ్యలో పేజి మొత్తానికీ "చీజ్" పైన ఒకే ఒక్క వాక్యం ఉంటుంది. ఆ మిగిలిన పేజీల్లో అయినా పేజినిండా అక్షరాలున్నాయా అంటే అదీ లేదు. కొన్ని పేజీల్లో దాదాపు సగ భాగం ఖాళీ! ఆ మిగిలిన కొద్దిపాటి స్థలంలో అక్షరలక్షలను పొందుపరచిన విధానం చూస్తే రచయితకు జోహార్లు అర్పించవలసిందే. చదవడం పూర్తిచేసాక కాస్త అర్థమవుతుంది, దశాబ్దం క్రితం సుమారు ఐదేళ్ళపాటు రాజ్యమేలిన ఈ పుస్తకం ఎందుకు 26 భాషల్లో రెండు కోట్ల ప్రతులకు పైగా అమ్ముడుపోయిందో.

చివరగా - e-పుస్తకాన్ని చదివిన ఓ వారం పది ముప్పై రోజుల్లో "శాశ్వత మార్పు" వస్తుందా అంటే, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే - అది "మార్పు" కాబట్టి. మరి అలాంటపుడు ఎందుకు చదవాలి అంటే - ఒక ఆలోచనా బీజం వేయడానికి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను - చివరి పేజీ చదివి పుస్తకాన్ని మూసేస్తున్న తరుణంలో బాస్ ఫోన్ చేసి "నిన్ను ఈ క్షణమే ఉద్యోగం నుండి తీసేస్తున్నా" అనో లేదా ఫ్రెండ్ ఫోన్ చేసి "మనం డబ్బు దాచుకున్న బ్యాంకు దివాలా తీసింది, మనం అంతా పోగుట్టుకున్నాము" అనో అంటే, ఏమాత్రం తొణక్కుండా "ఓస్ అంతేనా" అంటారు!

20 comments:

  1. Malakpet Rowdy said...

    One of my fav. books ..

    There is a spoof on this ... " I moved your cheese" .. that begins with the premise: WHY CHANGE?

  2. Malakpet Rowdy said...

    I read this book in 2001 and its still one of my fav. books!

    Did u read these books?

    * Fish philosophy
    * Three signs of a miserable job
    * Five dysfunctions of a team

  3. మీ శ్రేయోభిలాషి said...

    This is one of the best books I read. It brought a great change in my thinking. "చివరి పేజీ చదివి పుస్తకాన్ని మూసేస్తున్న తరుణంలో బాస్ ఫోన్ చేసి "నిన్ను ఈ క్షణమే ఉద్యోగం నుండి తీసేస్తున్నా" అనో లేదా ఫ్రెండ్ ఫోన్ చేసి "మనం డబ్బు దాచుకున్న బ్యాంకు దివాలా తీసింది, మనం అంతా పోగుట్టుకున్నాము" అనో అంటే, ఏమాత్రం తొణక్కుండా "ఓస్ అంతేనా" అంటారు! "...rightly said..

  4. రమణ said...

    ధన్యవాదాలండీ. ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం ఇంకా మొదలుపెట్టలేదు. మీరు వ్రాసిన సమీక్ష చూశాక చదవాలనిపిస్తుంది.

  5. Anonymous said...

    మంచి పుస్తకం గురించి వ్రాశారు. మిరు ఇచ్చిన లింకు లొ డౌన్లోడ్ చేసికొని, చదివాను. ఈ లింక్ మా పిల్లలకి కూడా పంపాను. థాంక్స్.

  6. వీరుభొట్ల వెంకట గణేష్ said...

    Thanks a lot for sharing the e-book link!

  7. Sujata M said...

    నేను 2003 లో ఒక స్నేహితుడి సలహా మీద చదివాను. నచ్చింది. రేపటి గురించి భయపడనీయని ప్లానింగ్ గురించి చెప్పే ఈ పుస్తకం అంటే ఇష్టపడ్డాను. ఎందుకో, బాలశిక్ష లోనో, పంచతంత్రం లోనో చదివుతున్న నీతి కధ లాగా అనిపించింది. :D

  8. Arkavani Solar Living said...

    మీరిచ్చిన లింకులో ఈ పుస్తకంపై వ్రాసిన "Most helpful customer reviews" చదివాను. అందులోని వ్యాఖ్యలు మీ అభిప్రాయాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి.

    తాము చేపట్టే అర్థంలేని మార్పులను ఉద్యోగులపై సులువుగా రుద్దడంకోసం కార్పొరేట్లు చేపట్టే "బుర్ర ఉతుకుడు" (brain washing) కార్యక్రమంలో ఈ పుస్తకం ఒక భాగమని వ్రాశారు.

    నమ్మినా నమ్మకపోయినా వారి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పక తప్పదు.

  9. Shashank said...

    I always thought that this was common sense. అంటే ఎప్పుడైన మన "చీస్" మాయమైపోతే వేరే చోట వెతకడమో లేకుంటే వేరేది పట్టడమో చేస్తాం. అంటే ఇంతక ముందు కూడా అంటే ఈ పుస్తకం రాకపూర్వం కూడా, ఒక వ్యాపారం లో నష్టం వస్తే వేరేది మొదలెట్టేవాళ్ళు. ఇప్పుడు మనకి బద్దకం .. మానసిక బద్దకం అంతే. దిక్కులేకపోతే మనమూ మారతాము. అప్పటి వరకు మాత్రం కుకూన్ లోనే ఉంటాం. ఎన్ని పుస్తకాలు చదివినా unless our cheese gets moved.. we will be like this only...IMHO

  10. Bhãskar Rãmarãju said...

    అదృష్టవంతులు మీరందరూ!!

  11. జీడిపప్పు said...

    @ మలక్పేట్‌రౌడీ గారు - మీరు చెప్పిన పుస్తకాలేవీ చదవలేదు, ప్రయత్నిస్తాను. అన్నట్టు ఒక రిక్వెస్ట్ - మీరు చదివిన మంచి పుస్తకాలు లేదా మంచి ప్రొఫెషనల్ విషయాలు పంచుకొంటూ పోస్టులు వెయ్యండి. బ్లాగుల్లో చాలామందే IT వాళ్ళు ఉన్నారు, సరదాగా ఉంటుంది :)

    @ మీ శ్రేయోభిలాషి గారు - ధన్యవాదాలు. మీరు చదివిన మంచి పుస్తకాలను పరిచయం చెయ్యండి.

    @ వెంకటరమణ గారు - ధన్యవాదాలు

    @ హరేఫల గారు - ధన్యవాదాలు

    @ వెంకట గణేష్ గారు - ధన్యవాదాలు

    @ సుజాత గారు - అందుకేనేమో అందరికీ అంత నచ్చింది :)

    @ శేష శ్రీనివాస్ గారు - ఈ పుస్తకానికి వచ్చిన పాపులారిటీ ప్రభావం. అవి చదువుతుంటే ఒకప్పటి నేను గుర్తొచ్చాను :)

    @ శశాంక్ - ఒకప్పుడు నేనూ అలాగే అనేవాడిని "కామన్ సెన్స్ ఉంటే చాలు" అని :)

    @ భాస్కర్ రామరాజు గారు - ఎందుకంటారు??!!

  12. Shashank said...

    buDugu - nEnu inkA adE anTunnA.. common sense that is uncommon unte chaalu ani. if you can reassess periodically i think that would be more than sufficient. manamu chestunnadi tappu ani artham aitE adE padivElu (paisalO rUpAyilO DAlarlO adi tarvata). :)

  13. జీడిపప్పు said...

    మనంతట మనమే reassess చేసుకోగలిగి మన నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే అంతకంటే ఇంకేమి కావాలి? కానీ అది చాలామందికి సాధ్యం కాదు అనుకుంటాను. అక్కడే ఇలాంటి పుస్తకాలు, అనుభవాలు ఉపయోగపడతాయి.

  14. Bhãskar Rãmarãju said...

    అన్నా!! కారణం మీకు ఇలాంటి మంచి పుస్తకాలు సదవటాకి సమయం దొరుకుతున్నందుకు. :):)
    http://jeedipappu.blogspot.com/2009/07/blog-post.html పోస్టులో మా వ్యాఖ్యని సరిగా గమనించినట్టులేరు మీరు ఆటోప్రకాష్ కవితా నివాళుల్లో పడి..

    ఏమైనా - ఆనంద సోమవారం!!

  15. జీడిపప్పు said...

    భాస్కర్ రామరాజు గారు - అపుడపుడు ఇలాంటి కలాపోసన కూడా ఉండాలి.. లేకుంటే మడిసికి మహిషానికి తేడా ఏటుంటది :)
    అన్నట్టు ఈ పుస్తకం చాలా చిన్నది, పైన ఉన్న లింకు నుండి డౌన్‌లోడ్ చేస్కోండి.. ఒక గంటలో ముగించవచ్చు.

  16. శరత్ కాలమ్ said...

    http://www.youtube.com/watch?v=-oYJu9xMiEs

    మీ ఈ టపా గురించి నా యూట్యూబ్ ఛానల్ లో వ్లాగాను. ఇలాంటి మంచి టపాలను యూట్యూబ్ వీక్షకులకు అందించాలనే అత్యుత్సాహంతో మీ అనుమతి తీసుకోకుండానే ప్రారంభించినప్పటికీ మీకు అభ్యంతరం వుంటే వెంటనే తొలగిస్తాను.

    ఏదో ఒక రకంగా నా వ్లోగులను మళ్ళీ మొదలెట్టే వుద్దేశ్యంతో రికార్డ్ చేసినందువల్ల ఈ వీడియో అంత గొప్పగా రాలేదని గమనించగలరు. ముందు ముందు వీడియోల్లో లోపాలని సరిచేస్తాను.

    అన్నట్లు ఈ పుస్తకాన్ని, రిచ్ డాడీ - పూర్ డాడీ అన్న పుస్తకాలను (యూజుడ్ వి)అమెజాన్ లో ఈరోజే ఆర్డర్ చేసాను.

  17. జీడిపప్పు said...

    శరత్ గారు, my pleasure! ఒక మంచి పని చేస్తున్నపుడు నాకు అభ్యంతరం ఎందుకు? :) Feel free to grab anything without hesitation.

    rich dad, poor dad పుస్తకం నేను చదవలేదు కానీ ఆడియో బుక్ సగం విన్నాను. financial matters పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్ల కాబోలు..కాస్త బోర్ కొట్టింది, అందుకే మొత్తం వినలేదు.
    Here is the Audio book, if you are interested.

    Rich Dad Poor Dad 1
    Rich Dad Poor Dad 2
    Rich Dad Poor Dad 3

  18. శరత్ కాలమ్ said...

    ధన్యవాదాలు.

    ఆడియో బుక్స్ పట్ల నాకు ఆసక్తి లేదు లెండి. ఆ బుక్ చదివాక (అందరికీ) చెబుతా - నాకూ బోర్ కొట్టిందో లేదో.

    Just FYI: ఆ రెండు పుస్తకాలు ఒక్కొక్కటి వెల 1 సెంటుకి ఆర్డర్ చేసాను - సెకండ్ హ్యాండ్ వి కాబట్టి. (కాకపోతే షిప్పింగ్ చార్జెస్ 4$ లు )

  19. రానారె said...

    వ్యక్తిత్వవికాస పుస్తకాలనబడే రచనలను చదవాలంటే నాకూ "అబ్బే ఇలాంటి పుస్తకాల వల్ల ఉపయోగం ఉండదు" అనే అనిపిస్తుంది ఇప్పటికీ. నేను చదివిన చివరి పుస్తకం - విజయానికి ఐదుమెట్లు. పదేళ్ళ క్రితం. చూద్దాం మీలాగ నాలోనూ "మార్పు" వస్తుందేమో. :)

  20. ప్రవీణ్ ఖర్మ said...

    జీడిపప్పు గారూ ఇంకా పడుకోలెదా ?

Post a Comment