బాబోయ్ కూడలి.. వామ్మో మాలిక - 2

Posted by జీడిపప్పు

నెలక్రితం తెలుగు బ్లాగుల, బ్లాగు సమాహారాల స్థితిగతుల గురించి వ్రాసిన పోస్టుకు వచ్చిన స్పందన చూసిన తర్వాత చెత్త బ్లాగుల బాధితుడిని నేను ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు అని తెలుసుకున్నాను.  ఆసక్తికరమయిన విషయమేమిటంటే దాదాపు అందరు బ్లాగరులు కూడా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న కూడలి, మాలికలకు రావడానికి భయపడుతున్నామని, సోది వార్తలతో నిండిన వీటిజోలికి రావడమే మానుకున్నామని చెప్పారు. ఉన్నంతలో తమకు నచ్చిన బ్లాగులను అనుసరిస్తూ అవే చదువుకుంటుండడం వల్ల ఎన్నో కొత్త బ్లాగులను మిస్ అవుతున్నారు.

~ 2006 లో అనుకుంటా, కూడలికి వస్తే సుగంధ పరిమళాలు వెదజల్లే బ్లాగులు స్వాగతం పలికితే, మిగతా బ్లాగులు నందనవనంలోని పారిజాతాలను తలపించేవి. మరి ఇప్పుడో? అడుగు పెట్టగానే కుళ్ళు కంపు వస్తే కాస్త ముందుకెళ్ళి భరించలేని దుర్గంధం తో ముక్కుమూసుకొని పారిపోవలసి వస్తోంది. ఈ సందర్భంగా నిర్వాహకులయిన కూడలి చావాకిరణ్ గారు, మాలిక మలక్పేట్ రౌడీ గారు మొదలయిన వారికి ఒక చిన్న మాట - ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీరు ఎన్నో వ్యవప్రయాసలకోర్చి ఒక వెబ్సైటు నిర్వహించడం చాలా అభినందనీయం. కేవలం మీకు బ్లాగుల పట్ల ఉన్న ఆసక్తి, మంచివిషయాలు నలుగురికి తెలియాలి అన్న మంచి ద్రుక్పథంతో మీరు చేస్తున్న ప్రయత్నం, మీరు పడుతున్న శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్థమేమో అనిపిస్తున్నది. సగటు బ్లాగరు మీ సైట్లను చూడాలంటేనే భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో గమనించి తగిన చర్యలు తీసుకోండి.

 'అసలు అగ్రిగేటర్లలో ఏ బ్లాగులు ఉంచాలో చెప్పడానికి నువ్వెవడివోయ్, అంతగా కావాలంటే నువ్వే ఒకటినడుపు' అన్నాడొక అనానిమస్సయ్య. అనూష్కనే ఉంటే ఇలియానా ఎందుకన్నట్టు వెబ్సైటు నడిపే ఓపిక, తీరిక, సత్తా ఉంటే ఈ టపాలే వేసేవాడిని కాదేమో!!  కాకపోతే నాక్కూడా 'నిజమే కదా, ఏ బ్లాగులు చదవదగ్గ బ్లాగులో ఎలా చెప్పడం' అనిపించి అప్పటికపుడు అగ్రిగేటర్లు చూస్తే నూటికి పట్టుమని పది కూడా కనిపించలేదు. కాస్త ఓపిక తెచ్చుకొని  ఒక IPL మ్యాచ్ చూస్తూ సుమారు ముప్పి, ఇంకో మ్యాచ్ చూస్తూ సుమారు డెబ్బి బ్లాగులు సేకరించగలిగాను.

బ్లాగులయితే సేకరించాను కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాలేదు. మెయిల్ లో బ్లాగు రీడరు, ఫీడర్లు, ఫాలో అవడాలు పెద్దగా నచ్చలేదు. చివరికి దాదాపు అందరికీ తెలిసిన, అతి సులువయిన పద్దతిలో మరో బ్లాగు సృష్టించి అందులో అన్నీ పొందుపరచాను. బ్లాగు డిజైన్ కూడా ఫంక్షన్లకు గాడీ మేకప్‌తో వచ్చే బాలీవుడ్ హీరోయిన్ రేఖలా జిల్ జిల్ జిగా జిగా అని ఉండాలా, లేక సాగరసంగమంలో జయప్రదలా సింపుల్‌గా ఉండాలా అని ఆలోచించి చివరికి జయప్రద వైపే మొగ్గు చూపాను.

బ్లాగు పేరు కోసం కొన్ని ప్రయతించినా అవి అందుబాటులో లేకపోవడంతో సింపుల్ గా ఉంటుదని నూరు తెలుగు బ్లాగులంటూ ఫిక్సయ్యాను, తెలుగులో చదవదగ్గ బ్లాగులు కనీసం ఓ వందయినా ఉండకపోతాయా అన్న ఆలోచనతో!  మొదటి రెండు రోజులూ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ, ఈ రెండువారాల్లో బాగా అలవాటయింది. అగ్రిగేటర్లలో సగటున రోజుకు 50 పోస్టులున్నా అందులో చదవదగ్గవి మహా అయితే 5 ఉంటాయి. వార్తలు, చిట్కాలు, పాడి-పెంట పోస్టుల మధ్య అవి వెతుక్కోవడానికే కొన్ని నిమిషాలు పడుతుంది. ఇక వారానికొకసారి చూసేవారి సంగతి చెప్పనక్కర్లేదు. క్రితం రోజు వచ్చిన మంచి పోస్టు కూడా అగ్రిగేటర్లో కనపడదు.

ఈ 'బ్లాగుల బ్లాగు ' లో నాకు నచ్చిన మూడు విషయాలేమిటంటే - మొదటిది - వచ్చి వెళ్ళే బ్లాగులు ఉండవు. అన్నీ స్థిరంగా అక్కడే ఉంటాయి. కాకపోతే లేటెస్టు బ్లాగు ముందుగా కనపడుతుంది. రెండవది - మనమే బ్లాగులను వర్గాలుగా విభజించుకోవచ్చు, ఆణిముత్యాలు, రచయితలు, సినిమాలు etc. ఇక మూడోది - అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పనక్కర్లేదు.

'ఈ బ్లాగుల బ్లాగు' ను కొన్నాళ్ళు అగ్రిగేటర్లతో పోల్చి చూస్తూ స్మోక్ టెస్ట్ చేసాక ఇదే బాగుంది అనిపించింది. బ్లాగరులారా, ఓ సారి http://100telugublogs.blogspot.com చూడండి. మీకు తెలిసిన ఇంకేవయినా చదవదగ్గ బ్లాగులు తెలిపితే ఈ జాబితాలో కలుపుతాను. తెలుగు బ్లాగులను ఆస్వాదించేవారికి, అగ్రిగేటర్ల నిర్వాహకులకూ ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నా.

44 comments:

  1. Indian Minerva said...

    దీని మొదటిభాగం నేను మిస్సయ్యాను. ఇప్పుడే చదివాను.

    ఒకప్పుడు నేను కూడలిని రిఫ్రెష్‌చేయడమే పనిగా పెట్టుకొనేవాడినండీ. ఎంతచేసినా కొత్త పోస్టువచ్చేదేకాదు. ఇప్పుడు చూస్తే పదినిమిషాలకో పోష్టు వచ్చేస్తోంది. అందులో సగానికిపైగా ఎక్కడెక్కడొ కొట్టుకొచ్చిన వార్తలు, సినిమా గాసిప్పు కబుర్లు ఉంటున్నాయి. సైట్లకి ట్రాఫిక్కులు పెంచుకొనే, డబ్బులను మనమీదపడి సంపాదిద్దామనే దుగ్ధతో కొన్నిసైట్లేమో మళ్ళీ ఇక్కడ క్లిక్కండి అంటు లింకులిస్తుంటే, ఇంకొన్నింటికి popupలు రావడం, అవికాస్తా systemని hang చేస్తుండటంతో ఒకానొక శుభదినాన ఒళ్ళుమండి కూడలిలోని manage optionని వీరstrict modeలో operateచేయించడం మొదలుపెట్టాను. చెబితేనమ్మరుగానీ ఈ బ్లాగుల సెన్సారింగులో చాలా మజా ఉందండి :).

    ఆ మధ్య 'శరత్'కాలం గారుకూడా ఇలాంటిదే ఏదో వందబ్లాగులంటూ చేశారు.

    అదంతా వదిలెయ్యండి. ఏదో quarterly financial reportలాగా మూణ్ణెల్లకో పోస్టుకాకుండా కొంచెం regularగా రాస్త్రుండండి బాబూ.

  2. Padmarpita said...

    Good collection :-)

  3. Kala said...

    మీతో 100% ఏకీభవిస్తున్నాను. మంచి collection. నేను రెగ్యులర్ గా చూసే బ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. సరదా సినీ సమీక్షలు వ్రాసే రాజ్ కుమార్ గారి బ్లాగ్ లిస్ట్ల్ లో లేదేంటండి.

  4. చిలమకూరు విజయమోహన్ said...

    `మూణ్ణెల్లకో పోస్టుకాకుండా కొంచెం regularగా రాస్త్రుండండి బాబూ.'
    Indian Minerva గారూ! జీడిపప్పు ఖరీదయింది కాబట్టి తక్కువ వాడుతుంటాం అలాగే విలువైన టపాలు కాబట్టి తక్కువైనా పరవాలేదు.

  5. Sravya V said...

    ఇంకొన్ని బ్లాగులు ఇవిగోండి

    http://kothavakaya.blogspot.com/
    http://mourya-1202.blogspot.com/
    http://invisiblephoton.blogspot.com/
    http://paravallu.blogspot.in/
    http://rajkumarneelam2.blogspot.com/
    http://saratchandrika.blogspot.in/

  6. జీడిపప్పు said...

    @ మినర్వా గారు - రెగులర్ గా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. మీ కూడలి కష్టాలు భలే ఉన్నాయి! సెన్సారు బోర్డు మెంబరుగా ప్రయత్నించండి.
    అన్నట్టు శరత్ గారి బ్లాగుల లిస్టు ఇవ్వండి, ఇంకొన్ని మంచి బ్లాగులు దొరుకుతాయేమో చూస్తాను.

    @ పద్మార్పిత గారు - ధన్యవాదాలు. అలా మెచ్చుకొని వెళ్ళిపోకుండా ఓ రెండొ మూడో మంచి బ్లాగులను పరిచయం చేయండి

    @ కల గారు - రాజ్ కుమార్ గారి బ్లాగ్ లింక్ ఇవ్వండి

    @ విజయమోహన్ గారు - అంతా మీ అభిమానం :)

    @ శ్రావ్య గారు - కొత్తవకాయ బ్లాగు తప్ప మిగిలినవి ఉన్నాయని కూడా తెలియదు. మంచి బ్లాగులను తెలియజేసారు, ధన్యవాదాలు.

  7. sunita said...

    బాగుంది!ఈ బ్లాగు ఓపన్ చేసి చదువుకోవచ్చు. మంచిపని చేసారు. Thanks!!!

  8. మరువం ఉష said...

    మీ ప్రయత్నానికి థాంక్స్. నేను ఆపుడపుడూ/తరుచూ చూసే 2 లిస్టుల్లోవి కొన్ని లేవనిపించి ఇక్కడ ఇస్తున్నాను.

    అన్వేషి - http://mahavarnam.blogspot.com/
    అన్వీక్షణం - http://venkatbrao.wordpress.com
    అనువాదలహరి - http://teluguanuvaadaalu.wordpress.com
    కలంకలలు - http://loveforletters.blogspot.com/
    http://raji-fukuoka.blogspot.com/

    శాస్త్రవిజ్ఞానం - http://scienceintelugu.blogspot.com/

  9. Sujata M said...

    Really worth the trouble andi. Excellent ! I love this already. విశ్వనాథ్ సినిమా లా వుంది మీ కొత్త ఆగ్రిగేటర్. అంతా క్లాస్ (సికల్) కలెక్షన్. బావుంది. ఇక బ్లాగడం లో మజా వస్తుందనిపిస్తుంది. ఇన్ని మంచి బ్లావులున్నాయని కూడా నాకు తెలియదు. ఇంకా నేను 1940 లోనే ఉండిపోయాను. మెల్లిగా అందరితోనూ పరిచయం పెంచుకుంటాను. మేకు బోల్డన్ని థాంకులు.

  10. Anonymous said...

    మీ ప్రయత్నం మెచ్చదగినది. మొన్ననే చూశాను ఆలస్యంగా.

  11. Anonymous said...

    దీనికో చిన్న పేరు పెట్టండి, వీలుగా ఉంటుంది

  12. జీడిపప్పు said...

    శర్మ గారు, http://100telugublogs.blogspot.in చూడండి

  13. శశి కళ said...

    చాలా చక్కగా వంద బ్లాగులు నిర్వహిస్తున్నారు.మీ విడ్జెట్ న బ్లాగ్ పక్కన
    ప్రెజెంట్ చెయ్యాలంటే లింక్ ఇవ్వండి.నేను కూడా రచయితినే ...ఆల్ ది బెస్ట్

  14. శృతి said...

    nice thought andi.....

  15. భాస్కర్ కె said...

    నా బ్లాగ్ ను మీ వంద జాబితా లో చేర్చినందుకు ధన్యవాదాలు, నాకు తెలిసిన కొన్ని మంచి బ్లాగుల పేర్లు ఇస్తున్నాను, పరిశీలించండి.
    అమయ http://amayaas.blogspot.in
    అలల పై కలలతీగ http://alalapaikalatiga.blogspot.in
    పుట్టుమచ్చ http://ushakhadar.blogspot.in
    రవిశేఖర్ హృదిలో మదిలో http://ravisekharo.blogspot.in
    లిఖిత http://blueofmoon.blogspot.in/
    రొట్టెమాకురేవు http://kaviyakoob.blogspot.in

  16. భాస్కర్ కె said...

    http://venneladaari-v.blogspot.in,
    sorry sir, i missed this,
    manchi kavithala blog idi.

  17. జీడిపప్పు said...

    Thank you Bhaskar garu for sharing good blogs

  18. Lasya Ramakrishna said...

    Hi, all the best. and my blog url is

    http://serialmutchata.blogspot.in/

  19. బివిడి ప్రసాదరావు said...

    నమస్కారము.
    మీ ప్రయత్నము బాగుంది.
    నా బ్లాగ్ ను చూడండి. వీలయితే, మీ ప్రయత్నము లో నాకూ చోటు ఇవ్వండి.
    నా బ్లాగ్ : http://www.bvdprasadarao-pvp.blogspot.com
    నా ఇ-మెయిల్ : prao.bvd@gmail.com

  20. Chinni said...

    my blog url is http://anubhavamulu.blogspot.in/

  21. Sudhakar said...

    WWW. బాగు .నెట్
    www.baagu.net or www.baagu@wordpress.com

    ఆరోగ్య విషయాలూ , మానసిక విషయాల మీదా శాస్త్రీయం గా అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న బ్లాగు.
    ఈ బ్లాగు పూర్తిగా మన తెలుగు భాషలోనే.
    చదివి , చదువుతూ , మీ అమూల్యమైన అభిప్రాయాలూ, సందేహాలూ తెలియచేయండి !

    Dr. సుధాకర్

  22. Prasad Rao Lakkakula said...


    మొట్టమొదటి తెలుగు బ్లాగ్స్ ఆన్ తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి,కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిశ్వర స్వామి గురించి,తెలుగు సంస్కృతి సంప్రదాయాలు,మన దేవుళ్ళ ప్రసాదములు గురించి తెలుగు లో బ్లాగ్స్
    http://tirumaladarshini.blogspot.in
    http://thesrikalahasthitemple.blogspot.com
    http://tirupatigamgamma.blogspot.in
    http://manadevatalaprasadamulu.blogspot.in
    http://theteluguculture.blogspot.in
    http://kanipakamtemple.blogspot.in
    http://thesrikalahasti.blogspot.in

  23. Anonymous said...

    ఒక లోగో పెట్టండీ

  24. Anonymous said...

    Very thoughtful endeavour ! Best wishes.
    Dr.Sudhakar.

  25. sarma said...

    I am not finding my blog in ur aggregator since last two days plz check

    http//kastephale wordpress.com

  26. Karthik said...

    Nice:-):-)

  27. Karthik said...

    http://egisealalu.blogspot.in
    this is my blog.. Meeku nacchithe mee dantlo add chesukogalaru... mee prayathnam chaalaa baagundi. Kotthalo nenu kudaa aggregatorslo konni blog chaalaa cheetthagaa unnayi.
    maalanti vaarini vaati nundi save chestunna meeku boledanni thanq's:-):-)

  28. $h@nK@R ! said...

    Hi this is my blog.
    http://nelabaludu.wordpress.com

  29. Krishna K said...

    Thanks for taking initiative and its the need of the day.

  30. Anonymous said...

    this is my telugu hindu tradition blog

    http://basettybhaskar.blogspot.in/

  31. Anonymous said...

    Dear Sir, if found interesting, add my blog Journo Dreams in your role.
    My blog's URL : https://puranapandaphani.wordpress.com

  32. Unknown said...

    నా బ్లాగుని చేర్చండి

    http://sureshte.blogspot.com

  33. Unknown said...

    It is really very excellent,I find all articles was amazing.Awesome way to get exert tips from everyone,not only i like that post all peoples like that post.Because of all given information was wonderful and it's very helpful for me.

    ccna training in chennai Tnagar

  34. కమల said...

    p4prerana.blogspot.in

  35. కమల said...

    p4prerana.blogspot.com

  36. KarlDeville said...

    Thank you for taking the time and sharing this information with us. It was indeed very helpful and insightful while being straight forward and to the point.
    mcdonalds.gutscheine | startlr.com | salud limpia

  37. Anonymous said...

    తెలుగు బ్లాగుల పరిస్థితి గురించి చక్కగా వివరించారు.

    https://postpapa.com/Photo/

  38. Anonymous said...

    mmorpg
    İnstagram takipci satin al
    tiktok jeton hilesi
    tiktok jeton hilesi
    SAC EKİMİ ANTALYA
    ınstagram takipçi
    instagram takipçi satın al
    MT2 PVP SERVERLAR
    instagram takipçi satın al

  39. Anonymous said...

    perde modelleri
    sms onay
    mobil ödeme bozdurma
    nft nasıl alınır
    ANKARA EVDEN EVE NAKLİYAT
    trafik sigortasi
    dedektor
    WEBSİTESİ KURMAK
    Ask Kitaplari

  40. Anonymous said...

    SMM PANEL
    Smm panel
    iş ilanları
    instagram takipçi satın al
    Hırdavatçı Burada
    WWW.BEYAZESYATEKNİKSERVİSİ.COM.TR
    servis
    Jeton hilesi indir

  41. Anonymous said...

    tuzla daikin klima servisi
    çekmeköy toshiba klima servisi
    ataşehir toshiba klima servisi
    çekmeköy beko klima servisi
    maltepe lg klima servisi
    kadıköy lg klima servisi
    kartal toshiba klima servisi
    beykoz lg klima servisi
    beykoz alarko carrier klima servisi

  42. GadirajuMadhusudanaRaju said...

    స్పందనలు అంతగా లేవు

  43. GadirajuMadhusudanaRaju said...

    https://www.blogger.com/profile/13131154575750577016

  44. GadirajuMadhusudanaRaju said...

    జీడిపప్పు చాలా బావుంది

Post a Comment