జై హో జాన్ స్టీవర్ట్

Posted by జీడిపప్పు

అమెరికాలో నాకు కావలిసినవన్నీ దొరికినా ఒకటి మాత్రం దొరకలేదు. చాలా రోజులపాటు ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు. చూస్తేనేమో కుప్పలు తెప్పలుగా ఛానెళ్ళు ఉన్నాయి. అతిరథ మహారథులయిన రిపోర్టర్లు ఉన్నారు. అయినా సరే ఒక్కరంటే ఒక్కరు కూడా నేను వెతుకుతున్నది మాత్రం అందించేవారు కాదు.

24 గంటల చానెళ్ళల్లో Exclusive Report అని Breaking News అని ఏవేవో  చెప్తుంటారు. ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ కనీసం ఎలక్షన్లపుడయినా నిజాలను చెప్పరు. అందుకే అమెరికాలో మీడియాను "మాఫియా మీడియా " అనవచ్చు. రిపబ్లికన్లు అధికారంలో ఉన్నపుడు ఇది మరీ ఎక్కువ ఉండేది. ప్రతి చానెల్ పోటీ పడి జార్జ్ బుష్ గురించిన నిజాలను తొక్కిపెట్టేవి. అసలు ఇరాక్ యుద్దం ఎందుకు చేస్తున్నారో రెండేళ్ళవరకు చాలామందికి తెలియదంటే ఈ "మాఫియా మీడియా" ప్రభావం ఎంతో తెలుసుకోవచ్చు.

అమెరికాలోని అత్యంత ప్రమాదకర సంస్థ పేరు FOX News. రిపబ్లికన్లు 2+ 2  = 3 అంటే అది నిజమని వారం రోజులు, డెమొక్రాట్లు 2+ 2 = 4 అంటే అందులో ఏదో తప్పు ఉందని నెలరోజులు ఊదరగొడుతుంది ఈ మాఫియా గ్యాంగ్. వీళ్ళు ఎంత ప్రమాదకరం అంటే, ఇరాక్ అణ్వాయుధాలు వేస్తే మారుమూల పల్లెల్లో ఉన్నవాళ్ళు ఎలా చనిపోతారు, అలా చనిపోకుండా ఉండాలంటే రక్షించుకోవడానికి అవసరమయిన Safety Equipment ఫలానా కంపెనీవాళ్ళ దగ్గరే కొనాలి అని పుంఖానుపుఖలుగా రోజుల తరబడి న్యూస్ లో కథలు చెప్తూ ప్రజలను భయభ్రాంతులను చేసారు. సగటు ఓటరు నిజమేననుకొని బుష్‌ను రెండో సారి అధ్యక్షుడిగా చేయాల్సి వచ్చింది, "అమెరికా బీహార్" అయిన ఫ్లోరిడా పుణ్యమా అని.

ఇక అసలు విషయానికొస్తే, నేను మీడియాలో వెతికినది "రిపబ్లికన్లను ఎండగట్టే" వార్తల కోసం. ఒక రోజు చానెల్స్ మారుస్తూ Comedy Central లో ఏదో "కామెడీ షో" వస్తుంటే చూసాను. ఎవరో రిపబ్లికన్ల పైన భలే జోకులు వేస్తూ విమర్శిస్తున్నారు. ఇదేదో భలే ఉందే అనుకుంటూ చూడడం మొదలుపెట్టాను.

సీన్ కట్ చేస్తే, కొన్నేళ్ళ తర్వాత - ఈ రోజు అసలు సిసలయిన వార్తల కోసం యువత అత్యధికంగా చూసేది ఆ "కామెడీ" షో. దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిపేరు జాన్ స్టీవర్ట్. ఆర్థిక మాంద్యం లేకుంటే ఈ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్లకు ఓట్లు బాగానే పడేవి. అయినా ఒబామా గెలిచేవాడు. అందుకు ప్రధాన కారణం యువత పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొనడం. దీని కారకుడు జాన్ స్టీవర్ట్. ఈ మధ్య జరిపిన ఒక సర్వే ప్రకారం, మిగతా న్యూస్ చానెళ్ళను గంటల తరబడి చూసేవారికంటే, జాన్ స్టీవర్ట్ The Daily Show చూసే వాళ్ళకే వాస్తవాలు ఎక్కువ తెలుస్తాయట!

ఒక Stand-up కమెడియన్ గా కెరీర్‌ను మొదలు పెట్టిన జాన్ స్టీవర్ట్ కామెడీ సెంట్రల్ చానల్లో ఒక చిన్న షో నిర్వహించేవాడు. క్రమంగా రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విమర్శిస్తూ అనతికాలంలో పేరు తెచ్చుకున్నాడు. CNN లో Crossfire అనే పరమ చెత్త షో నడిచేది. వాళ్ళు జాన్ ను తక్కువ అంచనా వేసి తమ షోకు పిలిచి ఎప్పటిలాగే పనికిరాని సంభాషణలు మొదలుపెట్టారు, కానీ తన పదునైన మాటలతో ఇద్దరినీ విమర్శించి ఇద్దరికీ దిమ్మె తిరిగేలా చేసాడు. జాన్ స్టీవర్ట్ గురించి సరిగా తెలియనివాళ్ళు నోరు వెళ్ళబెట్టారు "టీవీ రంగంలో  నిజాలను ఇంత ఖచ్చితంగా చెప్పే ఈ వ్యక్తి ఎవరా" అని. కొద్ది రోజులకు Crossfire షో పైన వీక్షకులకు నమ్మకంపోవడంతో ఆ షో క్యాన్సిల్ చేసేసారు.అదీ జాన్ స్టీవర్ట్ మాటల తడాఖా!

Image and video hosting by TinyPic జాన్ స్టీవర్ట్ వెలుగులోకి తెచ్చే అతి ముఖ్యమయినది - మీడియా మాఫియా గురించి. ఏదయినా ఒక సంఘటన జరిగితే దాదాపు అన్ని చానెళ్ళు ఒకే రకమయిన పదాలను, ఒక్కోసారి దాదాపు అదే వాక్యాలను చెప్తాయి. ఒక చానెల్ చూసేవారికి తెలియదు. కానీ జాన్ స్టీవర్ట్ షోలో వరుసగా ఒక్కో చానెల్ వాళ్ళు ఏమి చెప్పారో క్లిప్పింగ్స్ చూపిస్తాడు. చూస్తే అర్థమవుతుంది, ఎంతగా కూడబలుక్కున్నారో! మాటలు మార్చే రాజయకీయ నాయకులకు జాన్ స్టీవర్ట్ పేరు చెబితే హడల్. FOX న్యూస్ ను ఫుట్‌బాల్ ఆడుకోవడం అంటే జాన్ స్టీవర్ట్ కు మహా సరదా. నీతినియమాలు మచ్చుకయినా లేని Bill O'Reilly కుటిలత్వాన్ని జాన్ స్టీవర్ట్ & కో బయటపెట్టినంత బాగా ఎవరూ బయట పెట్టలేదు.

మరోసారి రిపబ్లికన్ ఎన్నిక కాకుండా అమెరికాను కాపాడేందుకు తన సర్వశక్తులు ఒడ్డి పోరాడిన జాన్ స్టీవర్ట్,  ఒబామా అంటే పక్షపాతం చూపిస్తాడు అనుకోవడం పొరపాటే. ఒబామా తప్పు చేస్తే అదే వాడి, వేడి మాటలతో విమర్శిస్తున్నాడు.

నిమిష నిమిషానికి  నవ్విస్తూ, నిజాలను నిర్భయంగా చెబుతూ అసలు సిసలయిన "న్యూస్ మేన్" గా ఆరాధింపబడే జాన్ స్టీవర్ట్ కు  మరోసారి జై హో!

12 comments:

  1. Kathi Mahesh Kumar said...

    అమెరికన్ మీడియా గురించి "manufacturing consent" లో Noam Chomsky బహుచక్కగా ఎప్పుడే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడా మనం అనుభవిస్తున్నాం...

  2. చైతన్య said...

    మీరు ఇండియా వచ్చేప్పుడు స్టీవర్ట్ గారిని వెంటపెట్టుకురండి.

  3. Anonymous said...

    ఇదిగోండి ఓ థ్రిల్లర్ స్టోరీ...
    http://sky-astram.blogspot.com/

  4. suresh said...

    alaage stephen colbert ni kooda cherchandi :). Jon stewart and stephen colbert shows are oxygen to comedy central.

  5. asha said...

    ఇకనుండి వీళ్ళ న్యూసులు వింటానైతే.

  6. Shashank said...

    మొన్న jim cramer తో ఇంటర్వ్యూ చూసేవుంటావ్ కద. తర్వత నందన్ నిలకనెని ది కూడా చూసావా ? రచ్చ.

    btw మొన్న colbert making fun of Glenn Beck http://www.colbertnation.com/the-colbert-report-videos/223279/march-31-2009/the-10-31-project చూడూ. మన దేశం లో ఇలాంటివి పెట్టచు కాని risk ఎక్కువ.. లాలూ, ములయాం, ysr గట్ర గురించి కామెడి చేస్తే సాల్తీలు గల్లంతే కద..

  7. బెజవాడ said...

    I am a big fan of Mr Stewart. Thanks for introducing him to the telugu blog world.

  8. జీడిపప్పు said...

    @ మహేష్ గారు - Glad to hear Noam Chomsky name. ఒకప్పుడు ఆయన ఉపన్యాసాలు తెగ చూసేవాడిని. నోబెల్ శాంతి బహుమతికి అమెరికాలో అర్హత ఉన్న వారిలో ఆయన ప్రథములు. కానీ మీడియా వక్రీకరణ తెలిసిందే కదా!

    @చైతన్య గారు - జాన్ స్టీవర్ట్ ఇండియాకు వస్తే మాయావతి, లాలూ అభిమానులు ఒక్క రోజులో ఆయన అంతు తేలుస్తారు!

    @సురేష్ కుమార్ గారు - ముందుగా చప్పట్ట్లు, కోల్బేర్ పేరు చెప్పినందుకు మరియు మీరు ఆయన అభిమాని అయినందుకు. కోల్బేర్ గురించి ఈ వ్యాసంలో ఒక పేరా రాద్దాం అనుకున్నాను కానీ పూర్తిస్థాయి వ్యాసం వ్రాయడమే సరి అయినది అనిపించింది. తొందర్లో రాస్తాను.

    @భవాని గారు - Comedy Central ఛానెల్లో వస్తుంది ఈ షో. ఆ ఛానెల్ రాకపోయినా http://www.thedailyshow.com/full-episodes/index.jhtml చూడండి.

    @శశాంక్ - చూసాను CD. నిలేకని ఇంటర్వ్యూ అయిన మరుసటి రోజు ఎపిసోడ్ చూడు. పాపం నిలేకని ఫీల్ అయి ఉంటాడు.
    మన దేశంలో ఇలాంటి షోనా? బాలయ్య బాబు షూట్ చేస్తే, అరెస్టు చేయకూడదని అభిమానులు గొడవ చేయడం మర్చిపోయావా?

    @ BezaWa గారు - Glad to hear that :)

  9. దెయ్ తడి said...

    బాంచన్.. నువ్ డుబుగ్స్ ఆ? నీ పోస్ట్లు.. కామెంట్లల్ల CD, శశాంక్ అంటె ఏవో రింగు(!!)లు తిర్గుతున్నై నాకు..

    నేన్ ఇర్ఫాన్.

    మస్త్ రాస్తున్నవ్! పీకిటప్!!

    John Stewart పేరు చూడంగనె ఉరుక్కుంట ఒచ్చిన :D

  10. దెయ్ తడి said...

    ఊ లా లా! అపచారం అపచారం!! కుదిర్తె పైన పోస్టిన కామెంట్ల John ల h తీసెయ్ బాంచన్.

  11. జీడిపప్పు said...

    హెల్లో ఇర్ఫాన్, హ హ్హ హ్హా డుబుగ్స్ నే :) ఎలా ఉన్నావ్ గురూ?
    నేను ఇప్పటికీ John అనేస్తుంటా.. మనకది అలవాటేలే :)

    అన్నట్టు నీ బ్లాగ్ ఖాళీగా ఉంది, ఇంకా షురూ చెయ్యలేదేమి గురూ?

  12. చైతన్య said...

    అంతేనంటారా... అయితే వద్దులెండి... అతన్ని అక్కడే ఉండనివ్వండి...
    ప్చ్... మనకెప్పుడు అలాంటి వాడు దొరుకుతాడో... ఎప్పుడు మంచి రోజులోస్తాయో!

Post a Comment